ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజకీయ మెడికల్ కాలేజి, కుశీనగర్ కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

కుశీనగర్ లో వివిధ అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించారు; అటువంటివే మరికొన్ని పథకాల కు ఆయన శంకుస్థాపన చేశారు

‘‘ఎప్పుడైతే మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయో, అప్పుడు పెద్ద పెద్ద కలల ను కనే ధైర్యం, మరి ఆ కలల ను నెరవేర్చుకొనే శక్తిజనిస్తాయి’

‘‘ఉత్తర్ ప్రదేశ్ ను 6-7 దశాబ్దుల కాలానికి పరిమితం చేయజాలరు;  ఇది కాలాని కిఅందని చరిత్ర కు ఆలవాలమైనటువంటి భూమి, ఈ గడ్డ యొక్క తోడ్పాటు లు కాలబద్ధమైనవి ఏమీ కావు’’

‘‘ ‘జంట ఇంజను ల’ ప్రభుత్వం రెట్టింపు బలం తో స్థితి ని మెరుగు పరుస్తున్నది’’

‘‘స్వామిత్వ పథకం ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల లో సమృద్ధి తాలూకుకొత్త తలుపుల ను తెరవబోతున్నది’’

‘‘పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 37,000 కోట్ల రూపాయల కు పైగా సొమ్ము ను ఉత్తర్ప్రదేశ్ రైతుల బ్యాంకు ఖాతాల లో జమ చేయడం జరిగింది’’

Posted On: 20 OCT 2021 2:35PM by PIB Hyderabad

కుశీనగర్ లో రాజకీయ మెడికల్ కాలేజి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆయన కుశీనగర్ లో వివిధ అభివృద్ధి పథకాల ను కూడా ప్రారంభించారు, అలాగే మరికొన్ని అభివృద్ధి పథకాల కు పునాదిరాళ్ల ను సైతం వేశారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కుశీనగర్ కు వైద్య కళాశాల వచ్చిందా అంటే గనక డాక్టర్ కావాలనే స్థానికుల ఆకాంక్షలతో పాటు నాణ్యమైన చికిత్స సంబంధి మౌలిక సదుపాయాలకు నోచుకోవాలనే ఆకాంక్ష లు కూడా నెరవేరుతాయన్నారు. సాంకేతిక విద్య ను ఏ వ్యక్తి అయినా వారి మాతృభాష లో అభ్యసించే అవకాశం జాతీయ విద్య విధానం ద్వారా వాస్తవ రూపం దాల్చుతోంది అని ఆయన అన్నారు. ఇది కుశీనగర్ లోని స్థానిక యువతీ యువకుల కు వారి కలల ను పండించుకోవడానికి వీలు ను కల్పిస్తుంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ఎప్పుడైతే మౌలిక సదుపాయాలు లభ్యం అవుతాయో, అప్పుడు పెద్ద పెద్ద కలల ను కనడానికి ధైర్యం తో పాటు ఆ కలల ను నెరవేర్చుకొనేందుకు ఉత్సాహం కూడా జనిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆశ్రయం అంటూ లేనటువంటి ఒక వ్యక్తి కి, గుడిసె లో నివసిస్తూ ఉన్న వ్యక్తి కి, ఒక పక్కా ఇల్లు దక్కితే, మరి ఆ ఇంటి లో ఒక టాయిలెట్, విద్యుత్తు కనెక్శన్, గ్యాస్ కనెక్శన్, నల్లా నీరు.. ఇవి అన్నీ సమకూరాయి అంటే, ఆ పేద వ్యక్తి లో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రం లో రెండు ఇంజన్లప్రభుత్వం స్థితి ని రెండింతల బలం తో మెరుగుపరుస్తోందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఇదివరకటి ప్రభుత్వాలు పురోగతి ని గురించి, వారి గౌరవాన్ని గురించి పట్టించుకోలేదని, వంశవాద రాజకీయాల దుష్ఫలితాలు అనేక మంచి చర్యల తాలూకు ప్రయోజనాలు నిరుపేదల కు చేరకుండా చేశాయంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు.

చేసే కార్యాల కు దయ ను, పరిపూర్ణమైనటువంటి కరుణ ను జోడించండి అని రామ్ మనోహర్ లోహియా గారు అనే వారు అని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. కానీ, ప్రభుత్వాన్ని ఇదివరకు నడుపుతూ వచ్చినటువంటి వారు పేద ప్రజల బాధ ను గురించి పట్టించుకోలేదు, మునుపటి ప్రభుత్వం వారి కార్యాల ను కుంభకోణాల తో, నేరాల తో జోడించింది అని ప్రధాన మంత్రి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన స్వామిత్వ పథకంభవిష్యత్తు లో ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల లో సమృద్ధి తాలూకు కొత్త తలుపుల ను తెరవబోతోందని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ స్వామిత్వ యోజన లో బాగం గా గ్రామం లోని ఇళ్ళ కు యాజమాన్య దస్తావేజు పత్రాల ను ఇచ్చే పని మొదలైంది. టాయిలెట్ లు, ఇంకా ఉజ్జ్వల పథకాల తో సోదరీమణులు, కుమార్తెలు సురక్షితంగా ఉన్నట్లు భావించుకొంటున్నారు, వారు గౌరవ భావన ను పొందుతున్నారని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ ఆవాస్ యోజన లో చాలా వరకు గృహాలు ఆ ఇంటి మహిళ ల పేరు తోనే ఉన్నాయి అని ఆయన అన్నారు.

ఇదివరకటి కాలాల్లో ఉత్తర్ ప్రదేశ్ లో శాంతి భద్రత ల స్థితి ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, 2017వ సంవత్సరం కంటే పూర్వం ప్రభుత్వ విధానం బాహాటం గా దోపిడీ చేయడానికి మాఫియా కు యథేచ్ఛ ను ప్రసాదించింది అని పేర్కొన్నారు. ప్రస్తుతం యోగి గారి నాయకత్వం లో మాఫియా క్షమాపణ లు చెప్పుకొంటూ తిరుగుతోందని, అంతేకాక యోగి గారి ప్రభుత్వం లో ఎక్కువ గా ఇబ్బంది పడుతోంది కూడా మాఫియాలే అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

దేశాని కి ఎక్కువ మంది ప్రధానుల ను ఇచ్చిన రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది ఉత్తర్ ప్రదేశ్ యొక్క ప్రత్యేకత. ‘‘అయితే, ఉత్తర్ ప్రదేశ్ గుర్తింపు ను ఈ ఒక్క అంశానికే పరిమితం చేయకూడదు. ఉత్తర్ ప్రదేశ్ ను ఆరేడు దశాబ్దాలకే గిరి గీసివేయడం తగదు. ఈ గడ్డ యొక్క చరిత్ర కాలాని కి కట్టుబడని అటువంటిది. ఈ నేల యొక్క తోడ్పాటు కాలాని కి అతీతమైంద’’న్నారు. భగవాన్ రాముడు ఈ గడ్డ మీద అవతరించారు. భగవాన్ శ్రీకృష్ణుని అవతారం కూడా సాక్షాత్కరించింది ఇక్కడే. 24 మంది జైన తీర్థంకరుల లో 18 మంది తీర్థంకరులు ఉత్తర్ ప్రదేశ్ లోనే అగుపించారు. మధ్య యుగం లో తులసీదాస్, ఇంకా కబీర్ దాస్ ల వంటి మహనీయులు కూడా ఈ మట్టి లోనే పుట్టారు. ఈ రాష్ట్రం సంత్ రవిదాస్ వంటి ఒక సంఘ సంస్కర్త కు జన్మ ను ఇచ్చిన విశేష అధికారాన్ని కలిగినటువంటిది కూడాను అని ప్రధాన మంత్రి అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రతి ఒక్క మార్గం లో యాత్ర స్థలాలు మిక్కిలి గా ఉన్నాయి. ఇక్కడి రేణువు లో శక్తి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. వేదాల ను, పురాణాల ను లిఖించే మహత్కార్యం ఇక్కడి నైమిశారణ్యం లో జరిగింది. అయోధ్య వంటి పుణ్యస్థలం అవధ్ ప్రాంతం లోనే నెలకొంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

మన గౌరవశాలి సిఖ్కు గురువు ల సంప్రదాయానికి కూడా ఉత్తర్ ప్రదేశ్ తో గాఢమైన బంధం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. గురు తేగ్ బహాదుర్ గారి శౌర్యాని కి ఆగ్ రా లోని గురు కా తాళ్గురుద్వారా ఇప్పటికీ ఒక సాక్షి గా నిలబడివుంది.. ఇక్కడే ఆయన ఔరంగజేబు కు సవాలు ను విసరారు అని ప్రధాన మంత్రి అన్నారు.

రైతుల నుంచి కొనుగోళ్ల ను జరపడం లో జంట ఇంజను ల ప్రభుత్వం కొత్త రికార్డుల ను నెలకొల్పుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఇంత వరకు పంట కొనుగోళ్ళ రీత్యా ఉత్తర్ ప్రదేశ్ లోని రైతుల బ్యాంకు ఖాతాల లో దాదాపు గా 80,000 కోట్ల రూపాయలు చేరాయి. పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 37,000 కోట్ల రూపాయల కు పైగా ఉత్తర్ ప్రదేశ్ రైతు ల బ్యాంకు ఖాతాల లో జమ చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 (Release ID: 1765227) Visitor Counter : 70