వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వ‌రికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర విలువ‌గా రూ.11099.25 కోట్లు అందుకోనున్న రైతులు


- కేఎంఎస్‌ 2021-22 కింద ఇప్పటి వరకు 56.62 ఎల్ఎంటీల‌ వరి కొనుగోలు చేయబడింది

- ఛండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల‌లో కొన‌సాగుతున్న‌
కొనుగోళ్లు

Posted On: 18 OCT 2021 4:04PM by PIB Hyderabad

కేఎంఎస్ 2021-22లో అక్టోబర్ 17, 2021వ తేదీ వ‌ర‌కు  56.62 ఎల్ఎంటీల‌కు  పైగా వరి సేకరించబడింది. ఛండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కొనుగోళ్లు జరిగాయి. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ వద్ద ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్‌) 2021-22.. ఇటీవల ప్రారంభమైంది. ఇందులో ఎంఎస్‌పీ విలువ‌తో 371919 మంది రైతులకు రూ.11,099.25 కోట్ల  మేర  ప్రయోజనం చేకూరింది.
                                                                                           *

***

 



(Release ID: 1764880) Visitor Counter : 157