ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళ లో భారీ వర్షాలు కురవడం, కొండచరియ లు విరిగి పడడం పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్రధాన మంత్రి


కేరళ లో భారీ వర్షాలు కురవడం, కొండచరియ లు విరిగి పడడం తో ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి



प्रविष्टि तिथि: 17 OCT 2021 5:44PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేరళ  ముఖ్యమంత్రి శ్రీ పినరాయి విజయన్‌ తో మాట్లాడారు.  కేరళ లో భారీ వర్షాలు కురిసి, కొండచరియ లు విరిగిపడ్డ కారణం గా ఏర్పడ్డ స్థితి ని గురించి చర్చించారు. కేరళ లో భారీ వర్షాలు, కొండచరియ లు విరిగిపడినందువల్ల ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి తీవ్ర విచారాన్ని కూడా వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి వరుస ట్వీట్ ల లో -

“కేరళ ముఖ్యమంత్రి శ్రీ @vijayanpinarayi తో మాట్లాడాను; కేరళ లో భారీ వర్షాల తో పాటు కొండచరియలు విరిగిపడిన ఫలితం గా తలెత్తిన స్థితి ని గురించి చర్చించాను.  గాయపడ్డ, బాధిత వ్యక్తుల కు సాయపడడానికి అధికారులు కృషి చేస్తున్నారు.  అందరి సురక్ష కోసం, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం నేను ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.

 

కేరళ లో భారీ వర్షాల వల్ల, కొండచరియలు విరిగిపడినందువల్ల కొంత మంది చనిపోవడం దు:ఖదాయకం. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1764628) आगंतुक पटल : 189
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam