ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

97.23 కోట్ల డోసులను దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


98.08 శాతానికి చేరిన రికవరీ రేటు; 2020 మార్చి నుంచి గరిష్ట స్థాయి

గత 24 గంటల్లో 15,981 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (2,01,632) 0.59 శాతం

వారపు పాజిటివిటీ రేటు ‍(1.44 శాతం) గత 113 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 16 OCT 2021 10:49AM by PIB Hyderabad

భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 97.23 కోట్ల డోసులను దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 8,36,118 డోసులతో కలిపి, 97.23 కోట్ల డోసులను (97,23,77,045) టీకా కార్యక్రమం అధిగమించింది. 96,05,482 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,75,703

రెండో డోసు

90,68,232

 

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,61,275

రెండో డోసు

1,54,90,253

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

39,14,51,891

రెండో డోసు

10,85,40,506

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

16,73,04,569

రెండో డోసు

8,53,97,182

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

10,55,20,693

రెండో డోసు

6,08,66,741

మొత్తం

97,23,77,045

 

గత 24 గంటల్లో 17,861 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,33,99,961 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.08 శాతానికి చేరింది. 2020 మార్చి నుంచి ఇదే గరిష్ట స్థాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002J91P.jpg

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 111వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 15,981 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 8 రోజులుగా 20,000 కంటే తక్కువగా కేసులు నమోదువుతున్నాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030KPO.jpg

 

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2,01,632. ఇది 218 రోజుల కనిష్ట స్థాయి. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఈ సంఖ్య 0.59 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PX7T.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 9,23,003 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 59 కోట్ల (58,98,35,258) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.44 శాతంగా ఉంది. గత 113 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 47 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 130 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00577OW.jpg

 

 

****



(Release ID: 1764331) Visitor Counter : 149