యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా నెల రోజుల స్వచ్ఛ భారత్ ప్రచార కార్యక్రమం పూర్తి స్థాయిలో కొనసాగుతోంది


ప్రచారంలో 25 కంటే ఎక్కువ కీలక ఐకానిక్ వారసత్వ ప్రదేశాలు చేర్చడం జరిగింది

Posted On: 13 OCT 2021 5:30PM by PIB Hyderabad

ప్రధాన అంశాలు 

  • ప్రధానంగా ప్లాస్టిక్‌ను, చెత్త సేకరించడం మరియు తొలగించడం కోసం, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాన్ ఇండియా క్లీన్ ఇండియా ప్రోగ్రామ్‌ను 1 అక్టోబర్ 2021 నుండి 31 అక్టోబర్ 2021 వరకు నిర్వహిస్తోంది. 
  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రపరచడంలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా పరిశుభ్రత డ్రైవ్ 

‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ చారిత్రక, ఐకానిక్, ధార్మిక ప్రదేశాలతో సహా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ డ్రైవ్ నిర్వహిస్తోంది. పర్యాటక ప్రదేశాల చుట్టూ పరిశుభ్రతను కాపాడాలనే సందేశాన్ని పంపడానికి ఎన్వైకేఎస్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పరిశుభ్రత డ్రైవ్ చేస్తున్న స్వచ్ఛ భారత్ డ్రైవ్ కోసం 25 కి పైగా ఐకానిక్ హెరిటేజ్ ప్రదేశాలను మంత్రిత్వ శాఖ గుర్తించింది.
ఈ స్వచ్ఛ భారత్ కింద, గువాహటిలోని కామాఖ్య దేవాలయం, గయ మహాబోధి దేవాలయం, అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం, జమ్మూలోని అమర్ మహల్ ప్యాలెస్, కర్ణాటకలోని హంపి, మధ్యప్రదేశ్‌లోని ఖజురాహో, ఒడిశాలోని పూరి దేవాలయం, మీనాక్షి వంటి దిగ్గజ ప్రదేశాలలో స్వచ్ఛ భారత్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. మధురై ఆలయం, గోల్డెన్ టెంపుల్/ అమృత్ సర్, జలియన్ వాలా బాగ్, లక్నో రూమి దర్వాజా మరియు హరిద్వార్ యొక్క హర్ కిపౌరీ మొదలైన వాటిలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. 

దీనిలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర సంఘం (ఎన్వైకేఎస్), జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) మంగళవారం హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వచ్ఛ భారత్ డ్రైవ్ నిర్వహించారు.

 

 

(హైదరాబాద్ గోల్కొండ కోట వద్ద పరిశుభ్రత కార్యక్రమం)

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ యూత్ ఆఫీసర్ శ్రీ కెసి. రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రచారం ద్వారా "మేము స్వచ్ఛ భారత్ డ్రైవ్ నిర్వహించడమే కాకుండా పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పరిసరాల గురించి అవగాహన కల్పిస్తున్నాము" అని అన్నారు. ఈ నెల చివరి వరకు తెలంగాణలోని జిల్లాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద వివిధ కార్యకలాపాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఎన్వైకే, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గోల్కొండ కోట పరిసర ప్రాంతాల నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో సహా దాదాపు 285 కిలోల వ్యర్థాలను సేకరించారు. పరిశుభ్రత వల్ల కలిగే ప్రయోజనాల గురించి స్థానికులకు అవగాహన కల్పించారు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను నివారించాలని మరియు వాటిని సక్రమంగా పారవేయాలని సూచించారు. జిల్లా ఎన్వైకే కోఆర్డినేటర్ హైదరాబాద్ శ్రీమతి ఖుష్భు గుప్తా, యూత్ అసిస్టెంట్ శ్రీ కె.సి. రెడ్డి,  ఎన్వైకే, ఎన్ఎస్ఎస్ ఇతర అసోసియేషన్ల నుండి సుమారు 100 మంది వాలంటీర్లు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

(మధురై మీనాక్షి ఆలయం వద్ద పరిశుభ్రత కార్యక్రమం)

ధార్మిక ప్రదేశాల చుట్టూ ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో పరిశుభ్రత డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తున్నారు. మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి 100 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మదురైలోని మీనాక్షి దేవాలయ ప్రాంగణంలో క్లీన్ ఇండియా డ్రైవ్‌లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

 

మాండ్య లో ఆలయాల వద్ద పరిశుభ్రత కార్యక్రమం 

దీనితో పాటు కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని దేవాలయాలలో మరియు చుట్టుపక్కల క్లీన్ ఇండియా డ్రైవ్ కూడా నిర్వహించారు. 
 

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (కేంద్ర ప్రభుత్వం) ఆజాది కా అమృత్ కా అమృత్ మహోత్సవాల స్మారకార్థం 1 అక్టోబర్ 2021 నుండి 31 అక్టోబర్ 2021 వరకు దేశవ్యాప్తంగా ఎన్వైకే, ఎన్ఎస్ఎస్, యూత్ క్లబ్‌లు మొదలైనవి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. క్లీన్ ఇండియా అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది సాధారణ ప్రజల నిజమైన ఆందోళనలను మరియు సమస్యను పరిష్కరించడానికి వారి సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.

*******



(Release ID: 1763926) Visitor Counter : 235