ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' కింద హెచ్ఐవీ/ఎయిడ్స్ & టీబీపై రెండోదశ అవగాహన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు.
విద్యార్థులు, కౌమారదశలో ఉన్నవారు, యువత తదితరులు దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడానికి న్యూ ఇండియా@75 రాష్ట్రాలకు ఒక వేదికను అందించింది: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
"భారతదేశ ఆరోగ్య సూచికలను మెరుగుపరచడంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం జాతీయ టీబీనిర్మూలన కార్యక్రమం కీలక పాత్ర పోషించాయి" అని అన్నారు.
ఫేజ్ -1 కింద చేపట్టిన వివిధ రకాల అవగాహన కార్యక్రమాలను వివరించే ఈ–-బుక్లెట్ కూడా అందుబాటులోకి వచ్చింది.
Posted On:
12 OCT 2021 2:37PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఇక్కడ ఆజాది కా అమృత్ మహోత్సవం కింద హెచ్ఐవీ/ఎయిడ్స్ & టీబీపై అవగాహన ప్రచారాల రెండవ దశను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో వర్చువల్ విధానం ద్వారా మాట్లాడారు. భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ నిర్మాణానికి దోహదపడాలని యువతకు పిలుపునిచ్చారు.
ఈ ప్రచారం ప్రారంభించినందుకు ఆమె హర్షం వ్యక్తం చేస్తూ, “న్యూ ఇండియా@75.. దేశ ప్రయోజనాల కోసం పనిచేయడానికి విద్యార్థులు, కౌమారదశలో ఉన్నవారు, యువత ఇతర వాటాదారులను ఒకేతాటిపైకి తీసుకురావడానికి రాష్ట్రాలకు ఒక వేదికను అందించింది. మొదటి దశ ప్రారంభమైన తరువాత, ప్రతి రాష్ట్రంలోని 25 పాఠశాలల్లో 25 కళాశాలల్లో హెచ్ఐవీ/ఎయిడ్స్, టీబీ, రక్తదానంపై అవగాహన కోసం పెయింటింగ్, చర్చా కార్యక్రమాలు, మాస్క్ మేకింగ్ వంటి వారం రోజుల కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
అంతర్జాతీయ భారతీయుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 న 'హెచ్ఐవి, టిబి రక్తదానంపై' అవగాహన ప్రచారాల మొదటి దశను విజయవంతంగా ప్రారంభించినందుకు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) ను అభినందించారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యువతకు అవగాహన కలిగించడానికి నాకో చేసిన కృషిని కూడా ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా, ఫేజ్ -1 కింద నిర్వహించిన వివిధ రకాల అవగాహన కార్యక్రమాలను ప్రదర్శించడానికి నాకో అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ -బుక్లెట్‌ను కూడా విడుదల చేశారు. ఈ బుక్లెట్ దేశవ్యాప్తంగా ఉన్న మరింత మంది విద్యార్థులను తదుపరి కార్యకలాపాలలో పాల్గొనడానికి ఒక మార్గదర్శిగా పని చేస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో వర్చువల్గా ఆమె సంభాషిస్తూ, "మన దేశాన్ని గొప్ప దేశంగా మార్చడానికి 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్' ముఖ్యమైనవి అని తాను గట్టిగా నమ్ముతానని ప్రకటించారు. మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మది నుంచి పుట్టిన ఆత్మనిర్భర్ భారత్, మనదేశాన్ని మరింత శక్తిమంతం చేస్తుందని, ఇందుకు కోసం మీ సహకారం చాలా ముఖ్యమని మన ప్రధాన మంత్రి సరిగ్గా చెప్పారని అన్నారు. "దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ యువత క్రీడలు, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన అనేక రంగాలలో సాధించిన ప్రావీణ్యం మన దేశాన్ని గర్వపడేలా చేస్తోంది" అని అన్నారు. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి సాటిచెప్పగల అనేక ఉత్పత్తుల తయారీ కోసం పని చేస్తున్నారని కొనియాడారు.
సామాజిక అభివృద్ధి సమస్యలలో యువతను భాగస్వాములుగా నాయకుడిగా పూర్తిగా నిమగ్నం చేయడం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. “సమాజ స్వచ్ఛందంగా యువతను నిమగ్నం చేయడం వలన హెచ్ఐవీ/ఎయిడ్స్, క్షయ, రక్తదానం, వీటిపై ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన కల్పించాలి. ఆయుర్దాయం పెంపు, శిశు మరణాల రేటు (ఐఎంఆర్), మాతాశిశు మరణాల రేటు తగ్గింపు వంటి అన్ని ఆరోగ్య సూచికలలో భారతదేశం విశేషమైన మెరుగుదల సాధించింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం, జాతీయ టీబీనిర్మూలన కార్యక్రమం వంటి జాతీయ కార్యక్రమాలు ఈ విషయంలో కీలకపాత్ర పోషించాయి”అని ఆమె అన్నారు. రాజేశ్ భూషణ్, ఆరోగ్య కార్యదర్శి, ఆర్తి అహుజా, అదనపు కార్యదర్శి, అలోక్ సక్సేనా, ఎంహెచ్ఎఫ్డబ్ల్యూ & డైరెక్టర్ జనరల్, నాకో, నిధి కేసరవాణి, నాకో డైరెక్టర్, డైరెక్టర్ అనూప్ కుమార్ పూరి, నాకో డైరెక్టర్ తోపాటు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
ఈవెంట్ సమయంలో ఈ లింకు ద్వారా సినిమాను ప్రదర్శించారు.
"యువత మార్పునకు సారథులు": https://www.youtube.com/watch?v=MUWe7wj7ufE
(Release ID: 1763666)
Visitor Counter : 398