సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పది లక్షలు దాటిన డిడి చందన వీక్షకులు
డిజిటల్ ప్రసార భారతికి దక్షిణ భారత రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆదరణ
Posted On:
13 OCT 2021 11:53AM by PIB Hyderabad
డిజిటల్ విధానంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రసార భారతి అందిస్తున్న కార్యక్రమాలకు దక్షిణ భారతదేశంలో వీక్షకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రసారాలను ప్రారంభించిన కొన్ని సంవత్సరాల్లోనే ప్రసార భారతి దక్షిణ ప్రాంత విభాగం ప్రసారాలు వీక్షకుల హృదయాలను చూరగొంటున్నాయి. యు ట్యూబ్ లో 10 లక్షలకు మించి వీక్షకులు కలిగి ఉన్న ఛానల్ గా డిడి చందన ( కన్నడ) అరుదైన రికార్డు సృష్టించింది. పది లక్షలకు పైగా వీక్షకులు కలిగిన దక్షిణ ప్రాంత ప్రసార భారతి తొలి ఛానల్ గా డిడి చందన గుర్తింపు పొందింది. డిడి సప్తగిరి ( ఆంధ్రప్రదేశ్), డిడి యాదగిరి ( తెలంగాణ) కూడా వీక్షకుల ఆదరణ పొందుతున్నాయి. వీటి ప్రసారాలు చూస్తున్న వారి సంఖ్య అయిదు లక్షలకు చేరువలో ఉంది.
దూరదర్శన్ తమిళ, మలయాళం వార్తా ప్రసారాలు ఇతర కార్యక్రమాలను లక్షకి మించి వీక్షకులు యూ ట్యూబ్ లో చూస్తున్నారు. వీక్షకుల ఆదరణ పొందుతున్న ఈ కేంద్రాలు ఇతర స్థానిక ఛానళ్లతో పోటీ పడుతున్నాయి.
ప్రసార భారతిలో ప్రసారం అవుతున్న టెలీ చిత్రాలు, హాస్య కార్యక్రమాలు, ప్రముఖులతో విద్యా అంశాలపై నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లను ఎక్కువ మంది చూస్తున్నారు.
దూరదర్శన్ జాతీయ చానళ్ళకు వీక్షకుల ఆదరణ లభిస్తోంది. దూరదర్శన్ ద్వారా అంతర్జాతీయ వార్తల ఛానల్ 'డిడి ఇండియా' ను యూ ట్యూబ్ లో చూస్తున్న వారి సంఖ్య ఇటీవల లక్ష దాటింది. యువత, ప్రపంచ వివిధ ప్రాంతాల్లో ఉన్న వారి అభిరుచులకు అనుగుణంగా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు, జాతీయ కార్యక్రమాలకు ఆదరణ లభిస్తోంది.
***
(Release ID: 1763569)
Visitor Counter : 238