యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు హుమాయూన్ సమాధి ఆవరణలో క్లీన్ ఇండియా డ్రైవ్‌లో పాల్గొన్నారు.


క్లీన్ ఇండియా డ్రైవ్ కార్యక్రమంలో మొదటి 10 రోజుల్లో దేశవ్యాప్తంగా సేకరించిన వ్యర్ధాలు 30 లక్షల కిలోగ్రాములు: శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 12 OCT 2021 12:44PM by PIB Hyderabad

ప్రధానాంశాలు:

  • ప్రధానంగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సేకరించడం మరియు తొలగించడం కోసం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని 1 అక్టోబర్ 2021 నుండి 31 అక్టోబర్ 2021 వరకు నిర్వహిస్తోంది
  • ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రధానంగా శుభ్రపరచడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమం చేపట్టబడింది


కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ స్వచ్ఛంద సేవకులతో కలిసి ఈ రోజు ఉదయం ఢిల్లీలోని హుమయూన్ సమాధి ఆవరణలో స్వచ్ఛ భారత్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి ఉషా శర్మ మరియు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు మరియు ఎన్‌వైకెఎస్‌ మరియు వివిధ గ్రూపుల వాలంటీర్లు కూడా ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. యువ వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ యొక్క దేశవ్యాప్త నెల సుదీర్ఘ పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఇది చేపట్టబడింది. ప్రధానంగా చెత్త సేకరించడం మరియు తొలగించడం దీని ఉద్దేశం. ఆజాది కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టబడింది.

ఈ సందర్భంగా శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ " జాతిపిత మహాత్మా గాంధీ కల నెరవేర్చడమే క్లీన్ ఇండియా క్యాంపెయిన్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేము స్వచ్ఛ భారత్ డ్రైవ్ నిర్వహించడమే కాకుండా పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పరిసరాల గురించి అవగాహన కల్పిస్తున్నాము. పౌరుల స్వచ్ఛంద భాగస్వామ్యం ద్వారా యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 75 లక్షల కిలోల వ్యర్థాలను ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలను 2021 అక్టోబర్ 1 నుండి 31 వరకు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  "కార్యక్రమంలో మొదటి 10 రోజుల్లో క్లీన్ ఇండియా డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా 30 లక్షల కిలోల వ్యర్థాలు సేకరించబడ్డాయి. 31 అక్టోబర్ 2021 లోపు దేశవ్యాప్తంగా 75 లక్షల కిలోగ్రాములకు పైగా వ్యర్థాలను సేకరిస్తామని నా దృఢ విశ్వాసం"అని శ్రీ ఠాకూర్ తెలిపారు.

రోడ్లపై మరియు పార్కుల్లో చిప్స్ మరియు ప్లాస్టిక్ సీసాలు మరియు ఇతర వ్యర్థా పదార్ధాలను, చెత్తాచెదారం వేయవద్దని శ్రీ ఠాకూర్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన ఇళ్లల్లో నిర్వహించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించడం మన బాధ్యత. ప్రతిఒక్కరూ తెలుసుకుని డస్ట్‌బిన్‌లను ఉపయోగిస్తే భవిష్యత్తులో ఇలాంటి పరిశుభ్రత డ్రైవ్‌లు ఉండాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు.

క్లీన్ ఇండియా అనేది నెహ్రూ యువ కేంద్ర సంస్థ (ఎన్‌వైకెఎస్‌) అనుబంధ యూత్ క్లబ్‌లు & నేషనల్ సర్వీస్ స్కీమ్ అనుబంధ సంస్థల నెట్‌వర్క్‌ల ద్వారా అలాగే వివిధ వాటాదారుల క్రాస్ సెక్షన్ ద్వారా దేశవ్యాప్తంగా 744 జిల్లాల్లోని 6 లక్షల గ్రామాల్లో నిర్వహించే యువత నేతృత్వంలోని కార్యక్రమం. మతపరమైన సంస్థలు, టీచర్లు, కార్పొరేట్ సంస్థలు, టీవీ మరియు ఫిల్మ్ యాక్టర్స్, మహిళా గ్రూప్ మరియు ఇతరులు వంటి నిర్దిష్ట జనాభా కూడా స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఒక ప్రత్యేక నిర్దేశిత రోజున తమ సంఘీభావాన్ని ప్రదర్శిస్తుంది. పర్యాటక ప్రదేశాలు, బస్టాండ్/రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారి మరియు విద్యాసంస్థలతో పాటు చారిత్రక/ఐకానిక్ ప్రదేశాలు మరియు హాట్‌స్పాట్‌లలో పరిశుభ్రత డ్రైవ్‌లు చేపట్టబడ్డాయి.

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆజాది కా అమృత్ కా అమృత్ మహోత్సవాల స్మారకార్థం 1 అక్టోబర్ 2021 నుండి అక్టోబర్ 31, 2021  వరకూ దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎన్‌వైకెఎస్‌,ఎన్‌ఎస్‌ఎస్‌, యూత్ క్లబ్‌లు మొదలైనవి కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. క్లీన్ ఇండియా అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది సామాన్యుడి యొక్క నిజమైన సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న వారి సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.

స్వచ్ఛ అభియాన్‌ను ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ 2014లో ప్రారంభించారు. అప్పటి నుండి ఈ విషయంలో విశేషమైన ముందడుగు గమనించవచ్చు. క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ప్రధాన మంత్రి పునరుద్దరించిన సంకల్పం మరియు నిబద్ధతతో కొనసాగిస్తున్న కార్యక్రమానికి కొనసాగింపు. ఇది నిజంగా క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగం కావడానికి మనందరికీ గొప్ప అవకాశం. యువత మరియు తోటి పౌరుల సమష్టి కృషితో మరియు వాటాదారులందరి మద్దతుతో భారతదేశం నిస్సందేహంగా పరిశుభ్రత డ్రైవ్‌లను ప్రారంభిస్తుంది మరియు  పౌరులకు మెరుగైన జీవన పరిస్థితులను సృష్టిస్తుంది.


 

*******



(Release ID: 1763398) Visitor Counter : 167