ఆర్థిక మంత్రిత్వ శాఖ
రెవిన్యూ లోటు గ్రాంటు కింద 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లు విడుదల
రాష్ట్రాలకు రెవిన్యూ లోటు గ్రాంటు కింద మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.69,097 కోట్లు విడుదల
Posted On:
11 OCT 2021 2:01PM by PIB Hyderabad
ఆర్థిక శాఖ వ్యయ విభాగం ఈ రోజు రాష్ట్రాలకు రూ.9,871.00 కోట్లు 7వ వాయిదా కింద పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ (పిడిఆర్‌డి) గ్రాంట్ ను విడుదల చేసింది. ఈ విడత విడుదలతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ (పిడిఆర్‌డి) గా మొత్తం రూ.69,097.00 కోట్లు విడుదల చేసినట్టు అయింది.
రాష్ట్రాల వారీగా ఈ నెల విడుదలైన గ్రాంట్ వివరాలు మరియు 2021-22లో రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం పిడిఆర్‌డి గ్రాంట్ మొత్తం జత చేయడం జరిగింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్ అందిస్తున్నారు. పదిహేనవ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాల రెవెన్యూ అకౌంట్‌ల లోటును తీర్చడానికి నెలవారీ వాయిదాలలో గ్రాంట్‌లు విడుదల అవుతున్నాయి. 2021-22 లో 17 రాష్ట్రాలకు పిడిఆర్‌డి నిధులను కమిషన్ సిఫార్సు చేసింది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన విభజనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర ఆదాయం మరియు వ్యయాల అంచనా మధ్య వ్యత్యాసం ఆధారంగా ఈ గ్రాంట్ మరియు గ్రాంట్ పరిమాణాన్ని స్వీకరించడానికి రాష్ట్రాల అర్హతను కమిషన్ నిర్ణయించింది.
పదిహేనో ఆర్థిక సంఘం మొత్తం పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్‌ను 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రూ.1,18,452 కోట్లు సిఫార్సు చేసింది. ఇందులో రూ. 69,097.00 కోట్లు (58.33%) ఇప్పటివరకు విడుదలయ్యాయి.
పదిహేనవ ఆర్థిక సంఘం పిడిఆర్‌డి మంజూరు కోసం సిఫార్సు చేసిన రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ .
రాష్ట్రాల వారీగా విడుదలైనపోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్
వ.సంఖ్య
|
రాష్ట్రం
|
అక్టోబర్ 2021న విదులైన నిధులు (7వ విడత) (రూ.కోట్లలో)
|
2021-22 లో విడుదలైన మొత్తం నిధులు (రూ.కోట్లలో)
|
-
|
ఆంధ్రప్రదేశ్
|
1438.08
|
10066.58
|
-
|
అస్సాం
|
531.33
|
3719.33
|
-
|
హర్యానా
|
11.00
|
77.00
|
-
|
హిమాచల్ ప్రదేశ్
|
854.08
|
5978.58
|
-
|
కర్ణాటక
|
135.92
|
951.42
|
-
|
కేరళ
|
1657.58
|
11603.08
|
-
|
మణిపూర్
|
210.33
|
1472.33
|
-
|
మేఘాలయ
|
106.58
|
746.08
|
-
|
మిజోరాం
|
149.17
|
1044.17
|
-
|
నాగాలాండ్
|
379.75
|
2658.25
|
-
|
పంజాబ్
|
840.08
|
5880.58
|
-
|
రాజస్థాన్
|
823.17
|
5762.17
|
-
|
సిక్కిం
|
56.50
|
395.50
|
-
|
తమిళనాడు
|
183.67
|
1285.67
|
-
|
త్రిపుర
|
378.83
|
2651.83
|
-
|
ఉత్తరాఖండ్
|
647.67
|
4533.67
|
-
|
పశ్చిమ బెంగాల్
|
1467.25
|
10270.75
|
మొత్తం
|
9,871.00
|
69097.00
|
****
(Release ID: 1762984)
Visitor Counter : 212