యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఢిల్లీ హాకీ వీకెండ్ లీగ్‌ను ప్రారంభించిన కేంద్ర కీడా మంత్రి అనురాగ్ ఠాకూర్
పోటీలు క్రీడాకారుల స్తైర్యాన్ని పెంచుతాయన్న మంత్రి
Posted On:
10 OCT 2021 1:10PM by PIB Hyderabad
కీలకాంశాలు
హాకీకి ప్రోత్సాహం లభించడమే కాక ప్రతిభ కలిగిన యువత తమ నైపుణ్యాలకు పదను పెట్టుకునేందుకు అవకాశాలు లభించేలా మరిన్ని రాష్ట్రాలు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలిః క్రీడా మంత్రి
ట్రోఫీ కోసం 36 టీంలు పోటీ పడుతున్నాయి, తర్వాత దశలలో కూడా మరిన్ని టీంలు పాల్గొనవచ్చు.

ఆదివారం ప్రతిష్ఠాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఢిల్లీ హాకీ వీకెండ్ లీగ్ 2021-22ను కేంద్ర క్రీడలు, యువ వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పురుష, మహిళా బృందాల విజయాలు హాకీకి ఒక క్రీడగా నూతన ఊపిరులూదాయని అనురాగ్ ఠాకూర్ అన్నారు. భారత్‌లో ప్రతిభకు లోటు లేదని అంటూ, క్షేత్రస్థాయిలో మరింత ప్రతిభను ప్రేరణనిచ్చేందుకు తోడ్పడే ఈ చొరవను చేపట్టిన ఢిల్లీ హాకీని అభినందిస్తున్నానని ఆయన అన్నారు. అంతర్జాతీయ శ్రేష్ఠత దిశగా క్షేత్రస్థాయి ప్రతిభను పెంచిపోషించాలన్నది మా లక్ష్యం. శిక్షణ, పోటీలు రెండూ కీలకమే. ఇవి క్రీడాకారుల ఉత్సాహాన్ని, నైతిక స్థైర్యాన్ని పెంచుతాయని ఆయన అన్నారు. హాకీకి ప్రోత్సాహం లభించడమే కాక ప్రతిభ కలిగిన యువత తమ నైపుణ్యాలకు పదను పెట్టుకునేందుకు అవకాశాలు లభించేలా మరిన్ని రాష్ట్రాలు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి అన్నారు.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఎఐ), ఢిల్లీ హాకీ ఫెడరేషన్‌తో కలిసి నిర్వహిస్తున్న హాకీ లీగ్‌లో ట్రోఫీ కోసం మొత్తం 36 టీంలు పోటీ పడుతున్నాయి, తర్వాత దశలలో మరిన్ని టీంలు పాలు పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం నేడు (ఆదివారం) ప్రారంభమయ్యి, ప్రతి వారాంతంలో 4 మ్యాచీలు ఆడతారు. లీగ్ తొలి మ్యాచ్ ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లాల్ కాలేజ్ - ఫెయిత్ క్లబ్ (స్వతంత్ర హాకీ క్లబ్)ను ఆడాయి.

ఈ ప్రారంభ కార్యక్రమంలో హాకీ ప్రపంచ కప్ (1975)లో పాలు పంచుకున్న భారతీయ హాకీ మాజీ క్రీడాకారుడు పద్మశ్రీ జఫార్ ఇక్బాల్, స్వర్ణ పతక గ్రహీత బ్రిగేడియర్ హెజెఎస్ చిమ్ని, భారతీయ హాకీ మాజీ గోల్ కీపర్, అర్జున్ అవార్డు గ్రహీత హెలెన్ మేరీ ఇన్నొసెంట్ ప్రత్యేక గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
***
(Release ID: 1762702)
Visitor Counter : 182