ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 10 OCT 2021 9:09AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 94.70 కోట్ల డోసులను అందించారు.

గత 24 గంటల్లో 18,166 కొత్త కేసులు నమోదయ్యాయి.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.68% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,30,971. ఇది 208 రోజుల కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 97.99% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 23,624 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,32,71,915 కు పెరిగింది.

వారపు పాజిటివిటీ రేటు (1.57%) గత 107 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు (1.42%) గత 41 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 58.25 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

****



(Release ID: 1762664) Visitor Counter : 120