ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
19 రాష్ట్రాలలో కోవిడ్-19 వాక్సినేషన్ పురోగతిని సమీక్షించచిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
100కోట్ల డోస్ ల లక్ష్యాన్ని సాధించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపు
సురక్షతంగా పండగలు జరుపుకునేందుకు కోవిడ్ -19 నిబంధనలు తప్పకుండా పాటించడంపై దృష్టిపెట్టాలని పిలుపు
Posted On:
09 OCT 2021 3:33PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ అన్ని ప్రధాన రాష్ట్రాలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, నేషల్ హెల్త్‌మిషన్ కు చెందిన మిషన్ డైరక్టర్లతో ఆయా రాష్ట్రాలలో కోవిడ్ -19 వాక్సినేషన్ కార్యక్రమం అమలు పురోగతిపై చర్చించారు. ఇండియా కోవిడ్ -19 వాక్సినేషన్ విషయంలో సాగిస్తున్నప్రయాణంలో తక్షణ మైలురాయి, దేశం 100 కోట్ల డోసుల లక్ష్యాన్ని సాధించడమని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 94 కోట్ల వాక్సిన్ డోస్‌లను వేసినట్టు ఆయన తెలిపారు.
పండుగలు ఎంతో పవిత్రమైనవని,ఇవి సంతోషానికి, పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోట చేరడానికి పర్యాయపదంగా ఉంటూ ఉన్నాయి. వీటిని కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ నిర్వహించుకోకపోతే కోవిడ్ -19ను అదుపు చేయడం అనేది దారితప్పుతుంది . కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయడం, వాక్సినేషన్‌ను వేగవంతం చేయడం అనేది ద్విముఖ పరిష్కారంగా చెప్పుకోవచ్చు. కోవిడ్ -19 వాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్న వారిలో 96 శాతం మందిలో తీవ్రమైన కోవిడ్ -19 లక్షణాలు ఏవీ ఏర్పడలేదని,
రెండు డోసులు వేయించుకున్న వారి విషయంలో కోవిడ్ లక్షణాలు ఏర్పడకపోవడం 98 శాతం వరకు ఉన్నదని ఆయన తెలిపారు.
రాష్ట్రాలవద్ద ప్రస్తుతం ఇంకా 8 కోట్ల మేరకు కోవిడ్ వాక్సిన్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారరు. వాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలో , లక్షిత వర్గాలకు వాక్సిన్ కవరేజ్‌ను పెంచడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆయా రాష్ట్రాలకు చెందిన వారిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
చాలావరకు రాష్ట్రాలు పట్టణ ప్రాంతాలలో నిర్దేశిత వాక్సినేషన్ లక్ష్యాలను సాధించే దశకు దగ్గరగా ఉన్నాయి. అలాగే ఆయా నగరాలకు వచ్చిపోయే జనాభాకు కూడా వాక్సిన్ వేస్తున్నారు. అలాగే ఇంటింటికి తిరిగి వాక్సినన్ వేసే కార్యక్రమాన్ని కూడా కొన్ని ప్రాంతాలలో చేపడుతున్నారు. తొలి డోస్ వేయడం చాలా చోట్ల పూర్తి అయింది. ఉత్తరప్రదేశ్‌వంటి రాష్ట్రాలలో పెద్ద ఎత్తున వాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు.కోవాక్సిన్ పరిమిత సంఖ్యలో సరఫరా కావడం, వాక్సిన్ డోస్ ల మధ్య కాలవ్యవధి తక్కువగా ఉండడం వంటివి ఇబ్బందిగా ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు ప్రస్తావించారు.
రాష్ట్రాలతో సంప్రదించిన మీదట, ప్రతి రాష్ట్రంతమ వాక్సినేషన్ లక్ష్యాలను పెంచుకోవాలని మంత్రి సూచించారు. దీనివల్ల చివరి 6 కోట్ల డోస్‌ల వాక్సినేషన్ పూర్తి చేసుకుని 100 కోట్ల డోస్‌లు వేసే కార్యక్రమాన్ని మరి కొద్ది రోజులలో పూర్తి చేయగలమని ఆయన అన్నారు.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ, రాష్ట్రాల ఆరోగ్య రంగ పాలనా వ్యవహర్తలు కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి, కోవిడ్ అనుకూల ప్రవర్తన (సిఎబి) ను ప్రస్తుత పండగల సీజన్‌లో కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తమ మంత్రిత్వశాఖ 2021 సెప్టెంబర్ 21న జారీ చేసిన లేఖలో పేర్కొన్న విధంగా ఎస్.ఒ.పి కి కట్టుబడి ఉండాలని అన్నారు.
కింద పేర్కొన్న మార్గదర్శకాలను రాష్ట్రాలకు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో వీటిని పునరుద్ఘాటించారు.
--కంటైన్‌మెంట్ జోన్‌లు, 5 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ కేసులు గుర్తించిన జిల్లాలలో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా చూడాలి.
--పాజిటివిటి రేటు 5 శాతం అంతకంటే తక్కువ ఉన్న జిల్లాలలో
ముందస్తు పర్మిషన్ల ద్వారా, పరిమిత స్థాయిలో ప్రజలను ( స్థానిక అవసరాలను బట్టి) ఒక చోట చేరడానికి అనుమతించవచ్చు.
--వారపు పాజిటివిటి కేస్ రేట్ ఆధారంంగా మినహాయింపులు, ఆంక్షలు విధించవచ్చు.
--రాష్ట్రాలు అన్ని జిల్లాలలో కోవిడ్‌కేసులను ప్రతిరోజూ జాగ్రత్తగా పరిశీలించాలి. సత్వర జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. అలాగే కోవిడ్ అనుకూల ప్రవర్తనకు సంబంధించి ఆంక్షలు విధించడానికి ఉపకరిస్తుంది.
--ప్రజలు భౌతికంగా ఆయా ప్రాంతాలను సందర్శించడాన్ని, గుమికూడడాన్ని ప్రోత్సహించరాదు.
--ఆన్‌లైన్ దర్శనాలు, వర్చువల్ ఉత్సవాలను ప్రోత్సహించాలి.
--దిష్టిబొమ్మల దహనం, దుర్గా పూజ పందిళ్లు, దాండియా, గార్భా నృత్యాలు, ఛాత్‌పూజ సింబాలిక్ గా ఉండాలి.
--ఉత్సవాలు, ప్రదర్శనలలో పాల్గోనే ప్రజలను అనుమతించేసంఖ్యపై నియంత్రణ ఉండాలి.
--వేరు వేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ప్రార్థనా ప్రదేశాలలో ఉండాలి. అలాగే సామూహిక ప్రార్థనా మ్యాట్‌లు, పవిత్ర జలాలు చల్లడం వంటి వాటిని తప్పించాలి.
--అత్యవసర కోవిడ్ రెస్పాన్స్ పాకేజ్ (ఇసిఆర్‌పి) -2 కు సంబంధించి రాష్ట్రాలకు అందించిన ఆర్ధిక వనరుల విషయం పైనా సమావేశంలో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, చత్తీస్‌ఘడ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ , మధ్యప్రదేవ్, మహారాష్ట్ర, ఒడిషా పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
***
(Release ID: 1762595)
Visitor Counter : 211