సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్త కంటెంట్, సాంకేతిక పరమైన అవకాశాలకు మార్గం సుగమం చేస్తున్న ప్రసారభారతి బ్రాడ్ కాస్ట్ సంస్కరణలు

Posted On: 09 OCT 2021 10:33AM by PIB Hyderabad

దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో గత రెండు సంవత్సరాలుగా ప్రసార సంస్కరణలు అమలు చేస్తున్నాయి, ప్రసార భారతి అనలాగ్ టెరెస్ట్రియల్ టీవీ ట్రాన్స్‌మిటర్‌ల వంటి వాడుకలో లేని ప్రసార సాంకేతికతలను వేగంగా తొలగిస్తోంది, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు మరియు కొత్త కంటెంట్ అవకాశాలకు నమూనాను మార్చడానికి మార్గం సుగమం చేస్తుంది.

తప్పుడు సమాచారం కొన్ని మాధ్యమాలలో ప్రచురణ అవుతున్నాయి. ప్రసార భారతి ప్రసారం చేసిన అనలాగ్ టెరిస్ట్రియల్ టీవీ ట్రాన్స్‌మిటర్‌లను దశలవారీగా తొలగించడానికి ప్రసార సంస్కరణ దశలను తప్పుగా చూపించారని స్పష్టం చేసింది. ఇటీవల, డిడి సిల్చార్, డిడి కలబురగి మొదలైన వాటి గురించి ఇటువంటి తప్పుడు నివేదికలు గుర్తించడం జరిగింది. ఈ డిడి కేంద్రాలు తమ రాష్ట్రాలకు అంకితమైన దూరదర్శన్ ఉపగ్రహ ఛానెళ్లలో ప్రసారం చేయడానికి ప్రోగ్రామ్ కంటెంట్‌ను రూపొందిస్తూనే ఉంటాయని, యూ ట్యూబ్ ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా డిజిటల్ మీడియాలో తమ కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రసార భారతి స్పష్టం చేసింది. ఉదాహరణకు, డిడి సిల్చార్, డిడి కలబురగి ద్వారా రూపొందించబడిన ప్రోగ్రామ్ కంటెంట్ ఇప్పుడు డిడి అస్సాం మరియు డిడి చందనలలో ప్రసారం అవుతాయి.

అనలాగ్ టెరెస్ట్రియల్ టీవీ అనేది వాడుకలో లేని సాంకేతికత. ఇది వృధా వ్యయాన్ని తగ్గించడమే కాకుండా 5జి వంటి నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు విలువైన స్పెక్ట్రంను అందుబాటులోకి తెస్తుంది. ఇప్పటివరకు, దాదాపు 70% అనలాగ్ ట్రాన్స్‌మిటర్‌లు దశలవారీగా తొలగించారు. దశలవారీగా మిగిలినవీ కనుమరుగు అవుతున్నాయి. అయితే సిబ్బందిని తిరిగి విస్తరించడానికి తగిన చర్యలు మాత్రం తీసుకుంటారు. వ్యూహాత్మక ప్రదేశాలలో దాదాపు 50 అనలాగ్ టెరెస్ట్రియల్ టీవీ ట్రాన్స్‌మిటర్‌లను మినహాయించి, ప్రసార భారతి 31 మార్చి 2022 నాటికి గడువు ముగిసిన మిగిలిన అనలాగ్ ట్రాన్స్‌మిటర్‌లను తొలగిస్తుంది.

అనలాగ్ టెరెస్ట్రియల్ టీవీ (ఏటిటి) దశలవారీ తొలగింపు, వనరుల హేతుబద్దీకరణ పై కాలక్రమ రేఖ :

సంవత్సరం

తొలగించిన ఏటిటీలు

అదా అయినా స్పెక్ట్రమ్ బ్యాండ్ విడ్త్

ఐఈబిఆర్ ఖర్చులో తగ్గుదల / సంవత్సరానికి

2017 - 18

306

 

7 MHz in VHF,

8 MHz U in HF

 

 

ఆపరేటింగ్ ఖర్చులో ఏటా సుమారు రూ.100 కోట్ల ఆదా

2018 - 19

468

2019 - 20

6

2020 - 21

46

2021 - 22

412

అక్టోబర్ 21 నాటికి – 152

డిసెంబర్ 21నాటికి – 109

మర్చి 22 నాటికి – 151

 

ప్రసార భారతి ఐఐటి కాన్పూర్‌తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది, డిజిటల్ టెరెస్ట్రియల్ బ్రాడ్‌కాస్టింగ్ కోసం 5 జి బ్రాడ్‌కాస్ట్ కోసం కొత్త తరహా అప్లికేషన్‌ల కోసం డైరెక్ట్ టూ మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ మరియు కొత్త కంటెంట్ అవకాశాలను సృష్టించడం ద్వారా నెక్స్ట్ జెన్ బ్రాడ్‌కాస్ట్ సొల్యూషన్/రోడ్‌మ్యాప్‌ను కృత్రిమ మేధస్సు అల్గోరిథంలు ద్వారా అభివృద్ధి చేసింది.

డిడి ఫ్రీ డిష్ డిటిహెచ్ ద్వారా డిడి అస్సాంతో సహా అన్ని దూరదర్శన్ ఛానెల్‌లు, అనేక ప్రైవేట్ ఛానెల్‌లు ప్రసార భారతి ద్వారా ఉచితంగా అందించారు, దేశవ్యాప్తంగా నెలవారీ రుసుము లేకుండా ఉచితంగా. డిడి ఫ్రీ డిష్ డిటిహెచ్ ఛానెల్‌లను "ఫ్రీ టు ఎయిర్ మోడ్" లో స్వీకరించడానికి సెట్-టాప్ బాక్సులను బహిరంగ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు, ఒకేసారి పెట్టుబడిగా అనేక విద్యా ఛానెల్‌లతో పాటు 120 కి పైగా ఫ్రీ టు ఎయిర్ ఛానళ్ళు, 40 కంటే ఎక్కువ ఆకాశవాణి ఉపగ్రహ రేడియో ఛానెల్‌లు యాక్సెస్ చేయవచ్చు. .

.

****

 

 


(Release ID: 1762512) Visitor Counter : 259