మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

చిన్నారులకోసం -పి.ఎం.కేర్స్- మార్గదర్శక సూత్రాల జారీ!


కోవిడ్.తో కన్నవారిని కోల్పోయిన పిల్లలకు సమగ్ర సంరక్షణ అందించే పథకం..

18ఏళ్లు నిండగానే నెలసరి స్టైపెండ్, 23 ఏళ్లకు రూ.10లక్షలు అందుకునే వెసులుబాటు

Posted On: 07 OCT 2021 1:47PM by PIB Hyderabad

చిన్నపిల్లలకోసం పి.ఎం. కేర్స్ పథకం (పి.ఎం. కేర్స్ ఫర్ చిల్డ్రన్) కింద అనుసరించవలసిన వివరణాత్మక మార్గదర్శక సూత్రాలను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కోవిడ్-19 వైరస్ మహమ్మారి దాడితో, తమ తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నపిల్లలకు సమగ్ర రక్షణ కల్పించే పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 మే నెల 29న ప్రకటించారు. కోవిడ్ సోకి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సమగ్ర రక్షణ సుస్థిరమైన పద్ధతిలో లభించేలా చూడటమే ఈ పథకం లక్ష్యం. ఆరోగ్య బీమా, విద్యాబోధన ద్వారా సాధికారత కల్పించడం, 23 సంవత్సరాల వచ్చేనాటికి ఆర్థకంగా స్వయంసమృద్ధితో వారిని తీర్చిదిద్దడం తద్వారా వారి సంక్షేమాన్ని చూసే లక్ష్యంతో ఈ పథకం రూపొందించారు.

   కరోనాతో తల్లిని, తండ్రిని కోల్పోయిన బాధితులైన బాలల విద్యాభ్యాసం, ఆరోగ్య రక్షణ కోసం నిధులను అందించడం, 18ఏళ్ల వయస్సునుంచి నెలసరి స్టైపెండ్.ను అందించడం, 23ఏళ్ల వయస్సు వచ్చే సరికల్లా వారికి దాదాపు పది లక్షల రూపాయలను ఏక మొత్తంగా అందించడం తదితర సదుపాయాలను ఈ పథకం లబ్ధిదారులకు అందిస్తుంది.

  ఈ పథకానికి అర్హులైన పిల్లలను 2021 మే నెల 29నుంచి (అంటే ప్రధాని పథకాన్ని ప్రకటించిన నాటి నుంచి) 2021, డిసెంబరు 31వ తేదీ వరకూ నమోదు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ తేదీల మధ్యలో నమోదైన బాధిత పిల్లలకు పి.ఎం. కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ప్రయోజనాలు లభిస్తాయి. గుర్తించిన ప్రతి లబ్ధిదారుకూ 23ఏళ్ల వయస్సు వచ్చేంతవరకూ ఈ పథకం అమలు కొనసాగుతుందని భావిస్తున్నారు.

  కరోనా కారణంగా i) తల్లిదండ్రులిద్దరినీ, లేదా ii) తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా iii) చట్టబద్ధమైన సంరక్షకులను, దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన వారిని ఈ పథకానికి అర్హులుగా పరిగణిస్తారు. కరోనాను మహమ్మారి అంటువ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) ప్రకటించిన గత ఏడాది మార్చి 11నుంచి,.. ఈ ఏడాది డిసెంబరు నెలాఖరు వరకూ ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి బాధితులకు అర్హత ఉంటుంది. iv) ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే, తల్లిదండ్రుల మరణించేనాటికి బిడ్డ వయస్సు 18ఏళ్లు పూర్తి కాకుండా ఉండాలి. 

https://ci5.googleusercontent.com/proxy/meYkJLdzQ8zbimIwBDHCWAztsV1ljPH0ebG-9gVGs7xNlaxmlNIpVYLKrYpYfbTdS2D9ONFb0G2_rII2eJRUEsBtgw-Y9fA-F_-d1D48EbsG9H5r710U577t3w=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZEFL.jpg

 

ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి అర్హతలు:

i. భోజన, వసతి ప్రయోజనాలతో మద్దతు:

) బాధిత చిన్నారికి తన కుటుంబం, బంధువులు, రక్తసంబంధీకుల పరిధిలోనే పునరావాసం కల్పించేందుకు గల అవకాశాల అన్వేషణకు శిశు సంక్షేమ కమిటీ (సి.డబ్ల్యు.సి.) సహాయంతో సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్ చర్యలు తీసుకుంటారు.

బి) కుటుంబీకులు, రక్తసంబంధీకులు, బంధువులు చిన్నారికి అందుబాటులో లేకపోయినా, సంరక్షణ కల్పించేందుకు వారు సుముఖంగా లేకపోయినా, రక్షణ కల్పించేందుకు వారు అర్హులు కాదని సి.డబ్ల్యు.సి. నిర్ధారించినా, నాలుగేళ్లనుంచి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న చిన్నారి తమవారితో జీవించేందుకు విముఖత చూపినా, సదరు చిన్నారులను ప్రత్యేక పెంపక, సంరక్షణ వ్యవస్థ పరిధిలో ఉంచుతారు. 2015వ సంవత్సరపు బాలల న్యాయ సంరక్షణ చట్టం ప్రకారం నిర్దేశించిన మేరకు ఈ సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు అమలులోకి వచ్చే సంబంధిత నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. .

సి) చిన్నారి పెంపకాన్ని చూసే కుటుంబం అందుబాటులో లేకున్నా/ సంరక్షణకు  సదరు కుటుంబం విముఖతతో ఉన్నా / ఆ కుటుంబానికి రక్షణ కల్పించే అర్హత లేదని సి.డబ్ల్యు.సి. నిర్ధారించినా, నాలుగేళ్లనుంచి పదేళ్లకు పైగా ఉన్న చిన్నారి,.. సదరు కుటుంబంతో కలసి జీవించడానికి విముఖత చూపినా అలాంటి వారిని పి.ఎం.కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి అర్హులుగా పరిగణిస్తారు. అలాంటి వారిని వయస్సుకు, లైంగిక స్వభావానికి తగిన చిన్నారుల సంరక్షణ సంస్థ (సి.సి.ఐ.) పరిరక్షణలో ఉంచవలసి ఉంటుంది.

డి) తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పదేళ్లకు మించిన వయస్సు ఉండి, కుటుంబీకులు, లేదా బంధువులు, పెంపుడు కుటుంబంనుంచి తగిన ఆదరణ లేకపోయినా, లేదా వారితో కలసి జీవించేందుకు సదరు పిల్లలు విముఖత చూపుతూ, చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్నా అలాంటి పిల్లలను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాయం, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ, ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు, సైనిక పాఠశాలలు, నవోదయ విద్యాలయాలతో పాటుగా, జిల్లా మెజిస్ట్రేట్ నిర్దేశించిన ఏ ఇతర గురుకుల పాఠశాలలో అయినా నమోదు చేయించవచ్చు. పథకం మార్గదర్శక సూత్రాలను అనుసరించి ఈ మేరకు ఏర్పాట్లు చేయవచ్చు.

) సాధ్యమైనంత వరకూ పిల్లలు కలసి ఉండేలా చూసేందుకే చర్యలు తీసుకుంటారు.

ఎఫ్) సంరక్షకుల ఖాతా  పరిధిలోని పిల్లలకు చిన్న పిల్లల రక్షణ సేవల పథకం (సి.పి.ఎస్.) నిబంధల మేరకు సంస్థాగతేతర రక్షణను, ఆర్థిక మద్దతును ప్రస్తుతం అమలులో ఉన్న ధరల ప్రకారం కల్పిస్తారు. సంస్థాగతమైన సంరక్షణలోని పిల్లలకు సంబంధించి సి.పి.ఎస్. నిబంధనల మేరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేట్ల ప్రకారం నిర్వహణా గ్రాంటును చిన్నపిల్లల సంరక్షణా సంస్థలకు అందిస్తారు. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం పరిధిలోని పథకం ద్వారా అందే మద్దతును కూడా అదనంగా అందజేస్తారు.

 

 

ii. పాఠశాల విద్యకు ముందు సహాయం,.. పాఠశాల విద్యకు మద్దతు

  1. లబ్ధిదారులుగా గుర్తించిన ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారానికి, పాఠశాల విద్యకు ముందస్తు సహాయానికి, పాఠశాల విద్యకు, వ్యాధి నిరోధక కార్యక్రమాలకు, ఆరోగ్య రక్షణకు, ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అంగన్ వాడీ సేవల ద్వారా మద్దతు లభిస్తుంది.

 

b. పదేళ్ల లోపు పిల్లలకు..

i) ఏదైనా సమీపంలోని పాఠశాలలో ప్రవేశం కల్పించవచ్చు. ప్రభుత్వ పాఠశాల/ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల/ కేంద్రీయ విద్యాలయాలు/ ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు.

ii) ప్రభుత్వ పాఠశాలల్లో వారికి రెండు జతల ఉచిత ఏకరూప దుస్తులను (యూనిఫాం డ్రెస్సులు) పాఠ్య పుస్తకాలను అందిస్తారు. పథకం మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద వీటిని అందిస్తారు.

iii) ప్రైవేటు పాఠశాలలల్లో వారికి విద్యా హక్కు చట్టంలోని 12(1) (సి) సెక్షన్ కింద వారికి బోధనా రుసుం చెల్లింపునుంచి మినహాయింపు కల్పిస్తారు.

iv) పైన పేర్కొన్న ప్రయోజనాలేవీ చిన్నారి పొందలేపోయిన పరిస్థితుల్లో, విద్యా హక్కు చట్టం నిబంధనల ప్రకారం బోధనా రుసుమును పి.ఎం. కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా అందిస్తారు. అలాగే, యూనిఫాం దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల కొనుగోలు వ్యయానికి కూడా ఈ పథకం ప్రకారం డబ్బు చెల్లిస్తారు. ఈ అర్హతలకు సంబంధించిన వివరాలను అనుబంధం-1లో పొందుపరిచారు.

 

c. 11-18 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలకోసం..

i) ఎవరైనా బాధిత చిన్నారి తన కుటుంబీకుల సంరక్షణలో జీవిస్తున్న పక్షంలో, సదరు చిన్నారులకు ప్రభుత్వ పాఠశాల/ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల/కేంద్రీయ విద్యాలయాల్లో, ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశం కల్పించేందుకు జిల్లా మెజిస్ట్రేట్ చర్యలు తీసుకుంటారు.

ii) సదరు చిన్నారికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయ/కస్తూరీబా గాంధీ బాలికా విద్యాలయ/ఏకలవ్య ఆదర్శ పాఠశాల/సైనిక్ పాఠశాల/నవోదయ విద్యాలయాల్లో లేదా జిల్లా మెజిస్ట్రేట్ నిర్దేశించే ఏదైనా ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశం కల్పించేందుకు వీలుంటుంది.  సంబంధిత పథకం మార్గదర్శక సూత్రాల పరిమితికి లోబడి ఈ మేరకు చర్యలు తీసుకుంటారు.

iii) చిన్న పిల్లల సంరక్షణ కేంద్రాల్లో అలాంటి ఇతర కేంద్రాల్లో సెలవుల సందర్భంగా బాధిత పిల్లలకు వసతికోసం జిల్లా మెజిస్ట్రేట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తారు.

iv) ఏదైనా కారణంతో పైన పేర్కొన్న ప్రయోజదనాలను పొందలేని సందర్భాల్లో సదరు బాధిత పిల్లలకు విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ఫీజులను పి.ఎం.కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకంనుంచి చెల్లిస్తారు. అలాగే, యూనిఫాం దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల కొనుగోలు ఖర్చులను కూడా ఈ పథకం చెల్లింపులు చేస్తుంది. ఇందుకు సంబంధించిన అర్హతా నిబంధనల వివరాలను అనుబంధంలో పొందుపరిచారు.

 

d. ఉన్నత విద్యకోసం సహాయం:

i) దేశంలో ప్రొఫెషనల్ కోర్సులు లేదా ఇతర ఉన్నత విద్యాకోర్సులను అభ్యసించేందుకు అవసరమైన విద్యా రుణంకోసం తగిన సహాయం అందిస్తారు.

ii) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకంనుంచి వడ్డీ మినహాయింపు ప్రయోజనాన్ని లబ్ధిదారులు ఎవరైనా అందుకోలేని పరిస్థితుల్లో,,.వారికి పి.ఎం.కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా విద్యా రుణానికి వడ్డీ చెల్లింపు సదుపాయం లభిస్తుంది.

iii) పి.ఎం. కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద ఉపకార వేతనానికి ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంటుంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖల ఆధ్వర్యంలోని పథకాల ద్వాలా ఈ ప్రత్యామ్నాయ చెల్లింపులు జరుగుతాయి. ఇందుకోసం నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్. ద్వారా లబ్ధిదారులకు తగిన సహాయం అందుతుంది. లబ్ధిదారులకు అందించే ఉపకార వేతనాల సమాచారాన్ని పి.ఎం.కేర్స్ ఫర్ చిల్డ్రన్ వెబ్ పోర్టల్.లో ఎప్పటికప్పుడు నవీకరిస్తారు.

 

iii. ఆరోగ్య బీమా:

. ఆయుష్మాన్ భారత్ పథకం (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన-పి.ఎం.జె.ఎ.వై.) కింద లబ్ధిదారులైన చిన్నారులందరినీ నమోదు చేస్తారు. తద్వారా రూ. 5లక్షల ఆరోగ్య బీమా సదుపాయం వారికి వర్తిస్తుంది.

బి. పి.ఎం. కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద నమోదైన ప్రతి చిన్నారికీ పి.ఎం. జె.ఎ.వై. కింద ప్రయోజనాలు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటారు.

సి. ఈ పథకం కింద చిన్నారులకు అందుబాటులో ఉన్న ప్రయోజనాల వివరాలను అనుబంధంలో పొందుపరిచారు.

 

iv. ఆర్థిక సహాయం:

 . లబ్ధిదారుల పేరిట ఖాతా ప్రారంభమై అది చెల్లుబాటులోకి వచ్చిన వెంటనే పూర్తి మొత్తం సదరు లబ్ధిదారుల పోస్టాఫీస్ ఖాతాలోకి నేరుగా బదలాయింపు జరుగుతుంది. లబ్ధిదారు వయస్సు 18ఏళ్లకు చేరుకున్నపుడు కార్పస్ నిధి రూ. 10లక్షలకు చేరుకోగానే సదరు దామాషా మొత్తాన్ని గుర్తించిన లబ్ధిదారు ఖాతాలోకి నేరుగా జమచేస్తారు.  

బి. 10 లక్షల కార్పస్ నిధి పెట్టుబడి కారణంగా, లబ్ధిదారులైన చిన్నారులకు 18ఏళ్లు నిండినప్పటినుంచి నెలసరి స్టైపెండు అందుతుంది. వారికి 23ఏళ్ల వయస్సు వచ్చేంత వరకూ ఈ స్టైపెండ్ అందుతూ ఉంటుంది.

సి. లబ్ధిదారులకు 23 ఏళ్లు నిండగానే, రూ. 10 లక్షల రూపాయలను ఏకమొత్తంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

పథకం మార్గదర్శక సూత్రాల  వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

****



(Release ID: 1761838) Visitor Counter : 357