సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రసార భారతితో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోండి
పండగ సీజన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలు ఇంకా మరెన్నో కార్యక్రమాలు.
प्रविष्टि तिथि:
05 OCT 2021 5:13PM by PIB Hyderabad
పండగల సీజన్ ప్రారంభానికి గుర్తుగా నవరాత్రి కార్యక్రమాల ప్రారంభంతో ప్రజలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రసార భారతి నెట్ వర్క్ ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యక్ష కవరేజ్‌లు, ఇంకా పండగల ఉత్సాహాన్ని పెంచే పలుకార్యక్రమాలను ప్రసారం చేయనుంది. దూరదర్శన్,ఆలిండియా రేడియోలు పలు భక్తి, వినోద కార్యక్రమాలను ప్రసారం చేయనున్నాయి.
నవరాత్రి రోజులలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దూరదర్శన్ దుర్గాపూజ, హారతి ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందులో ముఖ్యంగా కోల్‌కతా నుంచి మహాలయ, తిరుపతి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే అయోధ్య నుంచి అయోధ్యా కి రామ్ లీలాను దూరదర్శన్‌లో ప్రజలు చూడవచ్చు. అక్టోబర్ 6 వతేదీ నుంచి 15 వ తేదీ వరకు రోజూ డిడి నేషనల్‌లో రామచరిత మానస్ ఎపిసోడ్‌లు ప్రసారం కానున్నాయి.
దూరద్శన్‌లో నవరాత్రి ప్రత్యేక కార్యక్రమాల షెడ్యూలు
|
కార్యక్రమం పేరు
|
ఎప్పటినుంచి ఎప్పటివరకు
|
సమయం
|
|
చత్తార్‌పూర్ మందిర్ నుంచి లైవ్
|
2021 అక్టోబర్ 6నుంచి 15 వరకు
|
06.00
|
|
జంధేవాలన్ మందిర్ నుంచి ఆర్తి లైవ్
|
2021 అక్టోబర్ 6నుంచి 15 వరకు
|
06:30
|
|
కోల్ కతా నుంచి మహాలయ
|
2021 అక్టోబర్ 6
|
07.00 to 08.00
|
|
విజయవాడ నుంచి కనకదుర్గాదేవి కుంకుమ పూజ , అలంకారం లైవ్
|
2021 అక్టోబర్ 7నుంచి 11 వరకు
|
07.00
|
|
కోల్‌కతా నుంచి దుర్గా పూజ లైవ్
|
2021 అక్టోబర్ 12 నుంచి 15 వరకు
|
06.30 to
08.00
|
|
రామచరిత మాసన్ -2 ఎపిసోడ్‌లు
|
2021 అక్టోబర్ 6నుంచి 15 వరకు
|
08:00
|
|
శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుపతి నుంచి ప్రత్యక్షప్రసారం
|
2021 అక్టోబర్ 8 నుంచి 15 వరకు
|
09:00
|
|
రామచరిత మాసన్ -2 ఎపిసోడ్‌లు
|
2021 అక్టోబర్ 6నుంచి 15 వరకు
|
14:00
|
|
చత్తార్‌పూర్ మందిర్‌నుంచి జంధేవాలన్ ఉదయపు హారతి పునఃప్రసారం
|
2021 అక్టోబర్ 6నుంచి 15 వరకు
|
15.00
|
|
దుర్గోత్సవ్ సందర్భంగా ఫీచర్ ఫిల్మ్
|
2021 అక్టోబర్ 8 నుంచి 15 వరకు
|
16.00
|
|
అయోధ్య కి రామ్ లీలా - అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం
|
2021 అక్టోబర్ 6నుంచి 15 వరకు
|
19.00
to 22.00
|
దేశవ్యాప్తంగా ఆలిండియా రేడియోకు గల విస్తృత నెట్ వర్క్ వివిధ నవరాత్రి ప్రత్యేక కవరేజ్‌ని ప్రసారం చేస్తుంది. వీటిని వివిధ ప్రాంతాలనుంచి ప్రసారం చేస్తుంది. అక్టోబర్ 6న మహాలయ సందర్భంగా మహిషాసుర మర్ధిని ప్రత్యేక కార్యక్రమాన్ని హిందీ, సంస్కృతంలో ఇంద్రప్రస్థ, ఎఫ్.ఎం గోల్డ్, ఎఐఆర్ లైవ్ న్యూస్ 24*7 లో ఉదయం 5 గంటలనుంచి 5.30 గంటలవరకు ప్రసారం చేస్తారు. మహిషాసుర మర్దిని బంగ్లావర్షెన్‌ను ఎఫ్.ఎం రెయిన్‌బో నెట్ వర్క్ రాజధాని ఛానల్‌పై ప్రసారం చేయనున్నారు.
ఎఐఆర్ , దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ఈ ఆడియో విజువల్ కార్యక్రమాలను ప్రసార భారతి న్యూన్ ఆన్ ఎయిర్ యాప్, యూ ట్యూబ్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
న్యూస్ ఆన్ ఎయిర్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునేందుకు కింద ఇచ్చిన క్యుఆర్ కోడ్‌నుస్కాన్ చేసుకుని, నవరాత్రికి సంబంధించి దూరదర్శన్ , ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చు.
(रिलीज़ आईडी: 1761160)
आगंतुक पटल : 187