ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
05 OCT 2021 9:08AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 91.54 కోట్ల డోసులను అందించారు.
గత 24 గంటల్లో 18,346 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 209 రోజుల కనిష్ట స్థాయి.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.75% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,52,902. ఇది 201 రోజుల కనిష్ట స్థాయి.
రికవరీ రేటు 97.93% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.
గత 24 గంటల్లో 29,639 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,31,50,886కు పెరిగింది.
వారపు పాజిటివిటీ రేటు (1.66%) గత 102 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు (1.61%) గత 36 రోజులుగా 3% కన్నా తక్కువగా ఉంది.
ఇప్పటివరకు 57.53 కోట్ల కొవిడ్ పరీక్షలు చేశారు.
****
(Release ID: 1761042)
Visitor Counter : 158