సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
సహాయక రుణాల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం (సీజీఎస్ఎస్‌డీ) గడువు 31.03.2022 వరకు పొడిగింపు
प्रविष्टि तिथि:
04 OCT 2021 2:43PM by PIB Hyderabad
'ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ' కింద ఆర్థిక ఒత్తిడిలో ఉన్న సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) సహాయక
రుణాలనందించే నిమిత్తం ఒక ‘డిస్ట్రెస్డ్ అసెట్స్ ఫండ్'ను ఏర్పాటు చేస్తున్నట్టు 13 మే, 2020న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దీని ప్రకారం, ప్రభుత్వం 'సబార్డినేట్ డెట్ కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్' అనే పథకానికి 1 జూన్, 2020న ఆమోదం తెలిపింది. ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈల ప్రమోటర్లకు రుణ సంస్థల ద్వారా క్రెడిట్ సౌకర్యాన్ని అందించడానికి ఈ పథకం 24 జూన్, 2020న ప్రారంభించబడింది. ఎస్ఎంఈ-2 మరియు ఎన్‌పీఏ ఖాతాలు రుణ సంస్థల పుస్తకాలపై ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం పునర్నిర్మాణానికి అర్హులు. వాస్తవంగా తొలత ఈ పథకం 31.03.2021 వరకు అమలులో ఉంది. ఒత్తిడిలో ఉన్న ఆయా ఎంఎస్ఎంఈ యూనిట్లకు చేయూతను అందించే మార్గాలను తెరిచేందుకు, ప్రభుత్వం ఈ పథకం కాలావధిని ఆరు నెలలు మేర అంటే 31.03.2021 నుండి 30.09.2021 వరకు పొడిగించాలని గతంలో నిర్ణయం తీసుకుంది. పథకం భాగస్వామ్యుల నుండి అందిన ఆయా అభ్యర్థనల ఆధారంగా, ఈ గడువును 30.09.2021 దాటి.. మరో ఆరు నెలల పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ పథకం ఇప్పుడు తాజాగా 31.03.2022 వరకు అమలులో ఉంటుంది.
*****
(रिलीज़ आईडी: 1760854)
आगंतुक पटल : 269