ప్రధాన మంత్రి కార్యాలయం
జల్ జీవన్ మిశన్ ను గురించి గ్రామ పంచాయతీల తో, పానీ సమితుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
జల్ జీవన్ మిశన్ ఏప్ ను, రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
“వికేంద్రీకరణ కై ఉద్దేశించిన ఒక పెద్ద ఉద్యమం జల్ జీవన్ మిశన్. ఇది గ్రామాలు, మహిళలు నడుపుతున్న ఒక ఉద్యమం. ప్రజా ఉద్యమం, జనుల భాగస్వామ్యం దీని కి ముఖ్యమైన ఆధారాలు గా ఉన్నాయి”
“గత ఏడు దశాబ్దాలతోపోల్చితే ప్రజల కు నల్లా ల ద్వారా నీటిని చేర్చడం కోసం గత ఏడు దశాబ్దాల లో ఏపని అయితే జరిగిందో , దాని కంటే ఎక్కువ పని ని కేవలం రెండేళ్లలో చేసి చూపించడమైంది”
“గుజరాత్వంటి రాష్ట్రం నుంచి వచ్చిన నేను దుర్భిక్షాన్ని పోలిన స్థితిగతుల ను గమనించాను, ప్రతి ఒక్క నీటి బొట్టు కు ఉన్న ప్రాముఖ్యాన్నిగురించి అర్థం చేసుకోగలను. అందుకనే, గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలం లో, నీటి లభ్యత మరియు జల సంరక్షణ లు నాప్రాథమ్య అంశాల లో భాగం అయ్యాయి”
“ప్రస్తుతందేశం లో సుమారు 80 జిల్లాల కు చెందిన రమారమి 1.25 లక్షల పల్లెల లో ప్రతి ఇంటి కి నీరుఅందుతోంది”
“ఆకాంక్షభరిత జిల్లాల లో నల్లా ల ద్వారా నీటి ని అందుకొంటున్న ఇళ్ల సంఖ్య 31 లక్షల నుంచి పెరిగి, 1.16 కోట్ల కు చేరుకొంది”
“ప్రతిఒక్క ఇంటి లోను, పాఠశాల లోను మరుగుదొడ్డి, అందుబాటు లో ఉన్న ధరల కు శానిటరీప్యాడ్ లు, గర్భావస్థ కాలం లో పోషణ పరమైన సాయం, టీకామందు ను ఇప్పించడం వంటి చర్య లు ‘మాతృశక్తి’ని పటిష్టపరచాయి’’
Posted On:
02 OCT 2021 1:02PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జల్ జీవన్ మిశన్ ను గురించి గ్రామ పంచాయతీ లు, పానీ సమితులు/ గ్రామ నీటి, పారిశుధ్య కమిటీ (విడబ్ల్యుఎస్ సి)ల సభ్యుల తో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. ఇందులో భాగస్వాములైన అందరిలో చైతన్యాన్ని పెంచడం కోసం, ఈ కార్యక్రమం లో భాగం గా అమలుపరచే పథకాల లో పారదర్శకత్వాన్ని, జవాబుదారుతనాన్ని పెంచడం కోసం జల్ జీవన్ మిశన్ ఏప్ ను కూడా ఆయన ప్రారంభించారు. దానితో పాటు గా రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ నిధి ద్వారా ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా, ఏ కార్ పొరేశన్ అయినా లేదా పరోపకారులు, వారు భారతదేశం లో ఉన్నప్పటికీ లేదా విదేశం లో ఉన్నప్పటికీ, ప్రతి ఒక్క గ్రామీణ గృహానికి, పాఠశాల కు, ఆంగన్ బాడీ కేంద్రాని కి, ఆశ్రమ శాల కు, ఇంకా ఇతర సార్వజనిక సంస్థల కు నీటి ని నల్లా ల ద్వారా చేరవేయడం లో సాయం అందించడానికి గాను తోడ్పడవచ్చును. ఈ కార్యక్రమాని కి గ్రామ పంచాయతీ లు, పానీ సమితుల సభ్యులతో పాటు కేంద్ర మంత్రులు శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ ప్రహలాద్ సింహ్ పటేల్, శ్రీ బిశ్వేశ్వర్ టుడూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా హాజరు అయ్యారు.
సమితుల తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ లోని బాందా జిల్లా లో గల ఉమరీ గ్రామ వాసి శ్రీ గిరిజాకాంత్ తివారీ ని గ్రామం లో జల్ జీవన్ మిశన్ ప్రభావం ఎలా ఉంది? అని అడిగి తెలుసుకున్నారు. శ్రీ తివారీ ఇప్పుడు తమకు శుద్ధమైన, స్వచ్ఛ జలం అందుతున్నదని, ఈ కారణం గా గ్రామం లోని మహిళల జీవనం లో మెరుగుదల సాధ్యపడిందని వెల్లడించారు. తమకు నల్లా ల ద్వారా నీరు అందడం మొదలవుతుంది అని మీ గ్రామ ప్రజలు ఎప్పుడైనా అనుకున్నారా, వారు ఇప్పుడెలాంటి భావన చేస్తున్నారు ? అని శ్రీ తివారీ ని ప్రధాన మంత్రి అడిగారు. శ్రీ తివారీ గ్రామం లో ప్రతి ఒక్క ఇంటి లో టాయిలెట్ నిర్మాణం జరిగింది, వాటిని అంతా వినియోగించుకొంటున్నారు అని బదులిచ్చారు. బుందేల్ ఖండ్ గ్రామస్థుల అంకిత భావాన్ని ప్రధాన మంత్రి మెచ్చుకొంటూ మహిళలు శక్తి సంపన్నులు అవుతున్నారు, ‘పిఎం ఆవాస్ యోజన’, ‘ఉజ్జ్వల’, ఇంకా ‘జల్ జీవన్ మిశన్’ ల వంటి పథకాల ద్వారా వారికి హక్కు గా దక్కవలసిన గౌరవం లభిస్తోంది అని ఆయన అన్నారు.
గుజరాత్ లోని పిప్ లీ గ్రామ నివాసి శ్రీ రమేశ్ భాయి పటేల్ ను వారి గ్రామం లో నీటి అందుబాటు గురించి ప్రధాన మంత్రి ప్రశ్నించారు. నీటి నాణ్యత ను తరచు గా పరిశీలిస్తున్నారా ? అని కూడా ప్రధాన మంత్రి అడిగారు. శ్రీ రమేశ్ భాయి జల నాణ్యత బాగుందని, నీటి నాణ్యత ను పరీక్షించుకోవడం లో గ్రామ మహిళలు శిక్షణ పొందారని తెలియజేశారు. తాగే నీటి కి మీ గ్రామం ప్రజలు డబ్బు ను చెల్లిస్తున్నారా, చెల్లించడం లేదా అని కూడా ప్రధాన మంత్రి అడిగారు. నీటి విలువ గురించి గ్రామాల కు స్పష్టమైన అవగాహన ఉందని, నీటి కోసం డబ్బు చెల్లించేందుకు అంతా తయారుగా ఉన్నారని శ్రీ రమేశ్ భాయి చెప్పారు. తమ గ్రామంలో కొత్త నీటిపారుదల టెక్నిక్ లను ఉపయోగిస్తున్నట్టు కూడా ప్రధాన మంత్రి కి ఆయన తెలియజేశారు. స్వచ్ఛ్ భారత్ 2.0 ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రజలు స్వచ్ఛత ఉద్యమానికి అత్యధిక సమర్ధన ను అందించారని, జల్ జీవన్ మిశన్ కు సైతం ఇదే తరహా సఫలత లభిస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు.
ఉత్తరాఖండ్ కు చెందిన శ్రీమతి కౌశల్యా రావత్ ను ప్రధాన మంత్రి జల్ జీవన్ మిశన్ కు ముందు, తరువాత నీటి సరఫరా ఎలా ఉందని ప్రశ్నించారు. జల్ జీవన్ మిశన్ ద్వారా నీరు అందుతున్నందువల్ల పర్యటకులు వారి ఊరికి రావడం మొదలైందని, అక్కడి ఇళ్ల లో బస చేస్తున్నారని శ్రీమతి రావత్ సమాధానమిచ్చారు. టీకామందు ను ఇప్పించే కార్యక్రమం వారి గ్రామంలో పూర్తి స్థాయి లో అమలు అయిన సంగతి ని కూడా ఆమె ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు. అడవుల పెంపకం, పర్యటన లో మెరుగుదల, హోం- స్టే వంటి కార్యకలాపాల ను అనుసరిస్తున్నందుకు గాను శ్రీమతి రావత్ ను, గ్రామాలను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
తమిళ నాడు రాష్ట్రం లోని వెల్లెరి కి చెందిన శ్రీమతి సుధ ను ప్రధాన మంత్రి జల్ జీవన్ మిశన్ ప్రభావం విషయమై అడిగారు. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి అన్ని ఇళ్ళ లో నల్లా ద్వారా తాగే నీరు లభించడం మొదలైందని ఆవిడ అన్నారు. వారి ఊళ్లో తయారు చేసే జగత్ప్రసిద్ధమైన అరణి పట్టు చీరల గురించి కూడా ప్రధాన మంత్రి అడిగారు. నీటి కనెక్శన్ లభించడం తో మీకు ఇంటి లో ఇతరమైన పనులను చేసుకోవడానికి వీలు చిక్కుతోందా, చిక్కడం లేదా అని కూడా ప్రధాన మంత్రి వాకబు చేశారు. నీటి సరఫరా తో తాము అందరి జీవనం మెరుగుపడిందని, వారి వద్ద సృజనాత్మక పనుల కు సమయం మిగులుతోంది అని శ్రీమతి సుధ జవాబిచ్చారు. వారి గ్రామం లో నీటి ని సంరక్షించుకొనేందుకు చెక్ డ్యాము లు, కుంట ల వంటి నిర్మాణం ద్వారా వాన నీటి ని ఒడిసిపట్టటం వంటి కార్యకలాపాలు సాగుతున్నాయి అని ఆమె వివరించారు. గ్రామం లో ప్రజలు చేపట్టిన నీటి ఉద్యమం మహిళ ల సశక్తీకరణ దిశ లో వేసినటువంటి ఒక పెద్ద అడుగు అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.
మణిపుర్ కు చెందిన శ్రీమతి లైథంథెమ్ సరోజినీ దేవి గారి తో శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఇదివరకు నీరు దూర తీరాల లోను, చేంతాడంత బారుల లో నిలబడిన తరువాత మాత్రమే అందేదన్నారు. ఇప్పుడు స్థితి మెరుగైందని, ఎందుకంటే అన్ని ఇళ్ల లో గొట్టాల ద్వారా నీటి ని సరఫరా చేసే సౌకర్యం సిద్ధించిందన్నారు. బహిరంగ ప్రదేశాల లో మల మూత్రాదుల విసర్జన బారి నుంచి విముక్తి (ఒడిఎఫ్) లభించిన గ్రామం గా, నీటి సరఫరా తాలూకు పూర్తి కవరేజి గల గ్రామం గా మారడం తో అక్కడి ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డట్టు కూడా సరోజిని దేవి గారు తెలిపారు. నీటి నాణ్యత ను తరచు పరీక్షించడం తమ గ్రామం లో ఒక కొలమానం గా మారిందని, దీనికై అయిదుగురు మహిళల కు శిక్షణ ను ఇవ్వడం జరిగిందని ఆమె చెప్పారు. ప్రజల జీవనాన్ని సులభతరం (ఈజ్ ఆఫ్ లివింగ్) చేసేందుకు ప్రభుత్వం నిరంతరం గా కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. దేశ ఈశాన్య ప్రాంత రాష్ట్రాల లో వాస్తవిక మార్పు చోటుచేసుకొంటోందంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ పూజ్య బాపూ జీ, లాల్ బహాదుర్ శాస్త్రి జీ ల హృదయాల లో భారతదేశం యొక్క గ్రామాలే కొలువై ఉన్నాయన్నారు. ఈ రోజు న దేశ వ్యాప్తం గా లక్షల కొద్దీ గ్రామాల వారు ‘గ్రామ సభ ల’ రూపం లో జల్ జీవన్ సంవాద్ ను నిర్వహించుకొంటుండడం పట్ల ఆయన ప్రసన్నత ను వ్యక్తం చేశారు.
జల్ జీవన్ మిశన్ యొక్క విజన్ ప్రజల కు నీటి ని అందుబాటు లోకి తీసుకురావడం ఒక్కటే కాదని, ఇది వికేంద్రీకరణ తాలూకు ఒక పెద్ద ఉద్యమం గా కూడా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇది ఒక గ్రామం నడిపేటటువంటి, మహిళ లు నడిపేటటువంటి ఒక ఉద్యమం. దీని ముఖ్య ఆధారం ప్రజల ఆందోళన మరియు ప్రజల భాగస్వామ్యం’’ అని ఆయన చెప్పారు. గ్రామ స్వరాజ్యం యొక్క నిజమైన అర్థం ఆత్మబలం తో పరిపూర్ణం కావడమే అని గాంధీ గారు అంటూ ఉండే వారని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ‘‘ఈ కారణం గా గ్రామ స్వరాజ్యం యొక్క ఈ ఆలోచన ను కార్యసాధన ల దిశ లో సాగాలి, అందుకే నేను నిరంతరం కృషి చేస్తున్నాను’ అని ప్రధాన మంత్ర అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి గా తన పదవీకాలం లో గ్రామ్ స్వరాజ్ కు గాను తాను చేసిన కృషి ని శ్రీ మోదీ గుర్తు చేశారు. ఈ సందర్బం లో ఆయన గ్రామాల ను బహిరంగ ప్రదేశాల లో మల మూత్రాదుల విసర్జన కు తావు లేనివి (ఒడిఎఫ్) గా తీర్చిదిద్దడం కోసం ‘నిర్మల్ గాఁవ్’, గ్రామాల లో పాత బావుల ను, నుయ్యిల ను పునర్జీవాన్ని ప్రసాదించడం కోసం ‘జల్ మందిర్ అభియాన్’, గ్రామాల లో 24 గంటలు విద్యుత్తు సరఫరా కై ‘జ్యోతిగ్రామ్’, గ్రామాల లో సౌహార్దత కోసం ‘తీర్థ్ గ్రామ్’, గ్రామాల కు బ్రాడ్ బ్యాండ్ సదుపాయాన్ని కల్పించడానికి ‘ఇ-గ్రామ్’ కార్యక్రమాల ను చేపట్టినట్టు వివరించారు. ఇప్పుడు ప్రధాన మంత్రి గా కూడా వివిధ పథకాల నిర్వహణ, ప్రణాళిక రూపకల్పన లో స్థానిక సముదాయాల ను భాగస్వాముల ను చేయడానికి తాను కృషి చేశానన్నారు. గ్రామాల లో నీరు, స్వచ్ఛత కోసం గ్రామ పంచాయతీల కు 2.5 లక్షల రూపాయల కు పైగా నిధులను అందించడమైందని తెలిపారు. పంచాయతీ ల అధికారాలతో పాటు వాటి పనితీరు లో పారదర్శకత్వాన్ని నిశితం గా పరిశీలించడం జరుగుతోందన్నారు. జల్ జీవన్ మిశన్, పానీ సమితులు గ్రామ్ స్వరాజ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వచనబద్ధత కు ఒక ప్రముఖ ఉదాహరణ గా ఉన్నాయని ఆయన అన్నారు.
నీటి ని తెచ్చుకోవడం కోసం గ్రామీణ మహిళ లు, బాలలు మైళ్ల దూరం నడచిపోతున్నారన్న విషయాన్ని మనం అనేక సినిమాల లోను, కథల లోను, పద్యాల లోను చూశాం అని ప్రధాన మంత్రి అన్నారు. గ్రామం విషయం ప్రస్తావన కు వచ్చింది అంటే చాలు కొందరి మది లో ఇవే సన్నివేశాలు కదలాడతాయి అని ఆయన అన్నారు. ప్రతి రోజూ ప్రజలు నీటి కోసం దూరం లో ఉన్న నది కి గాని, లేదా చెరువు కు గాని ఎందుకు వెళ్లవలసి వస్తోంది?, అసలు నీరు వారి ముంగిటికే ఎందుకు రావడం లేదు? అనే ప్రశ్నలు చాలా కొద్ది మంది మనస్సు లో ఉదయిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘చాలా కాలం గా విధాన నిర్ణయాల బాధ్యత ను వహించిన వ్యక్తులు తమకు తాము ఈ ప్రశ్న ను వేసుకోవలసి ఉండాల్సింది అని నేననుకొంటున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. గతం లో విధాన నిర్ణయాల లో కీలక పాత్ర ను పోషించిన వారు జల సమృద్ధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడం వల్ల బహుశా నీటి ప్రాధాన్యం వారి కి అర్థం కాలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. కాని గుజరాత్ వంటి దుర్భిక్ష పరిస్థితులు ఎక్కువ గా ఉన్న రాష్ట్రం నుంచి తాను వచ్చానని, నీటి తాలూకు ప్రతి ఒక్క బొట్టు కు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో తాను గమనించానని శ్రీ మోదీ అన్నారు. ఈ కారణం గానే గుజరాత్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ, నీటి ని ప్రజల చెంత కు చేర్చడం, జల సంరక్షణ అనేవి తన ప్రాధాన్యతల లో భాగం అయ్యాయని ఆయన చెప్పారు.
దేశాని కి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019వ సంవత్సరం వరకు దేశం లో 3 కోట్ల ఇళ్ల కు మాత్రమే నల్లా ద్వారా నీరు అందేది అని ప్రధాన మంత్రి అన్నారు. 2019వ సంవత్సరం లో జల్ జీవన్ మిశన్ ప్రారంభం అయిన తరువాత 5 కోట్ల ఇళ్ల ను నీటి కనెక్శన్ తో ముడిపెట్టడం జరిగింది. ఇప్పుడు దేశం లో 80 జిల్లాల లో సుమారు 1.25 లక్షల కు పైగా గ్రామాల లో ప్రతి ఇంటి లో నల్లా ద్వారా నీరు చేరుతోంది. ఆకాంక్షభరిత జిల్లాల లో నీటి కనెక్శన్ ల సంఖ్య 31 లక్షల నుంచి పెరిగి, 1.16 కోట్ల కు చేరుకొందని ఆయన వివరించారు.
కేవలం రెండేళ్ల కాలం లో, గత ఏడు దశాబ్దాల లో జరిగిన కృషి కన్నా ఎక్కువ కృషి జరిగింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశం లో నీరు సమృద్ధి గా ఉన్న ప్రాంతాల లో నివసిస్తున్న ప్రతి పౌరుని తోనూ నేను చెప్తాను.. ఏమని అంటే.. మీరు నీటి ని ఆదా చేయడానికి మరింత గా కృషి చేయాలి అని; అంతే కాదు, దీని కోసం ప్రజలు వారి అలవాటుల ను సైతం మార్చుకోవాలి అని కూడా నేను కోరుతాను అని ప్రధాన మంత్రి అన్నారు.
గత కొన్నేళ్ల లో దేశం లో కుమార్తె ల ఆరోగ్యం కోసం, వారి సురక్ష కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమైందని ప్రధాన మంత్రి అన్నారు. ఇంటి లో, పాఠశాల లో టాయిలెట్స్, అందుబాటు ధరల లో శానిటరీ పాడ్ స్ సరఫరా మొదలుకొని గర్భావస్థ కాలం లో పోషణ కోసం వేల కొద్దీ రూపాయల ఆర్థిక సాయం, టీకామందు ను ఇప్పించడం ద్వారా ‘మాతృశక్తి’ ని బలపరచడం జరిగింది అని ఆయన తెలిపారు. మహిళ ల పేరు తో గ్రామాల లో నిర్మాణం జరిగిన 2.5 కోట్ల ఇళ్ల లో ఎక్కువ శాతం మహిళల పేరు తో ఉన్నాయని, ఉజ్జ్వల పథకం మహిళల కు పొగ బారి నుంచి విముక్తి ని ప్రసాదించిందని ఆయన తెలిపారు. స్వయం సహాయక సమూహాల మాధ్యమం ద్వారా మహిళల ను ఆత్మ నిర్భర్ మిశన్ పరిధి లోకి తీసుకు రావడం జరుగుతోందని, మరి గత ఏడు సంవత్సరాల లో ఈ సమూహాల సంఖ్య మూడు రెట్లు వృద్ధి చెందిందని ఆయన చెప్పారు. 2014వ సంవత్సరం కన్నా పూర్వపు అయిదు సంవత్సరాల తో పోల్చి చూస్తే జాతీయ జీవనోపాధి కార్యక్రమం లో మహిళల కు అందజేసే సహాయం గత ఏడేళ్ల లో 13 రెట్లు పెరిగింది అని ఆయన తెలిపారు.
(Release ID: 1760756)
Visitor Counter : 217
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam