సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
లెహ్‌లో ప్రపంచంలోఏ అతి పెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి మహాత్మాగాంధీకి ఖాదీ నివాళులర్పించింది.
Posted On:
02 OCT 2021 2:56PM by PIB Hyderabad
దేశభక్తికి, భారతీయత సమష్టితత్వానికి, దేశానికి గర్వకారణంగా నిలచి , వారసత్వ హస్తకళ అయిన ఖాదీ ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ జెండాకు వందనం చేయడంలో దేశాన్ని ఒక్కతాటికి తెచ్చింది. ఈరోజు లెహ్‌లో ఖాదీతో తయారైన అతి పెద్ద జాతీయ జండాను ఎగురవేశారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి)ఈ బృహత్ జాతీయ జెండాను రూపొందిచింది. మహాత్మాగాంధీకి అత్యంత ఘనమైన నివాళులు అర్పించడానికి దీనిని ఎగురవేసింది. మహాత్మాగాంధీపర్యావరణ హితకర ఖాదీని ప్రపంచానికి అందించారు.
ఈజాతీయ జెండాను లద్దాక్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్.కె. మాథూర్ ఎగురవేశారు. ఈ బృహత్ జాతీయ జెండా ప్రతి భారతీయుడిని దేశభక్తి స్ఫూర్తితో ఒక్కటిగా నిలుపుతుందని అన్నారు. కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేన, లద్దాక్ ఎం.పి శ్రీ జెటి నామ్‌గ్యాల్, ఛీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ బృహత్ జాతీయ జెండా 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, సుమారు 1400 కేజీల బరువు కలిగి ఉంది. ఈ బృహత్ జాతీయ జెండాను తయారు చేయడానికి ఖాదీ కళాకారులకు సుమారు 3500 పనిగంటల అదనపు పని పట్టింది. 4600 మీటర్ల చేతితో వడికిన ఖాదీ కాటన్ బంటింగ్‌ను ఈ జెండా తయారీలో ఉపయోగించారు.ఇది మొతత్ం 33,750 చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేయగలదు. జండాలోని అశోక చక్కర వ్యాసం 30 అడుగులు. ఈ జెండాను తయారు చేయడానికి 70 మంది ఖాదీ కళాకారులకు 49 రోజులు పట్టింది..
స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కెవిఐసి దీని ఆలోచన చేసింది. జాతీయ జెండా రూపకల్పన, కచ్చితమైన కొలతలు పాటించడం వంటివి అత్యంత జాగ్రత్తగా చేయవలసిన అంశం కావడంతో ఈ బాధ్యతను కెవిఐసి ఇండియన్ ఆర్మీకి అప్పగించింది. భారత సైన్యం దీనిని లెహ్ ప్రధాన నగరం కొండపై దీనిని ఏర్పాటు చేసింది. ఈ జెండా నేలను తాకకుండా చూసేందుకు సైన్యం ఒక ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసింది.
ఈ జెండ ఆను 9 సమాన భాగాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్కటి 100 కేజీలుగా, ఒక్కొభాగం కొలత 50 x 75 అడుగులుగా ఉంది. 12 ఎం.ఎం తాడుతో జెండాకు నాలుగువైపుల నేఫాను ఏర్పాటుచేయడం జరిగింది.
అత్యంత నాణ్యమైన 12 నైలాన్ తాడులు, మూడు తాడులు ఒక్కోక్కటి పైన, కిందవైపు, మూడు తాడులు ఎడమ కుడివైపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని లోడ్ సామర్ధ్యం సుమారు 3000 కేజీలుగా విభజించారు.
దీనికి తోడు ప్రతి తాడుకు రెండు కొసలా లూప్ ఉంటుంది. ఇది మొత్తం జెండా బరువును నిలపగలుగుతుంది. ఈ విభాగాలన్నింటినీ కలిపి కుట్టడంతోపాటు, లోపల ఉన్న నేఫా కనపడకుండా చేశారు. నేఫా లోపలి లైనింగ్ రసాయనాల కోటింగ్ కలిగిన ఖాదీ బంటింగ్‌తో ఏర్పాటుచేశారు. ఇది తాళ్లనుంచి వచ్చే ఘర్షణను నిలువరించడం ద్వారా జెండా గుడ్డకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తుంంది. జెండాలోనినేఫాను త్రివర్ణపతాకంలోని రంగులతో ఏర్పాటు చేయడం వల్ల ఇది జెండా రంగులో కలసిపోతుంది.
(Release ID: 1760489)
Visitor Counter : 229