మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం అయిన నిర్భయ నిధి నిధుల వినియోగ ఉన్నతస్థాయి కమిటీ


9797.02 కోట్ల రూపాయల ఖర్చుతో అమలవుతున్న పథకాలు/ కార్యక్రమాలను సమీక్షించిన కమిటీ

బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, నాగాలాండ్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లలో డిఎన్ఏ విశ్లేషణ, సైబర్ ఫోరెన్సిక్ తో పాటు సంబంధిత సౌకర్యాలను మెరుగు పరచాలని సిఫార్సు చేసిన కమిటీ

నిర్భయ నిధులతో 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లలో డిఎన్ఏ విశ్లేషణ సౌకర్యాల కల్పన

Posted On: 01 OCT 2021 4:54PM by PIB Hyderabad

నిర్భయ నిధుల వినియోగం కోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ 2021 సెప్టెంబర్ 30 వ తేదీన మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం అయ్యింది. బీహార్ఛత్తీస్‌గఢ్గుజరాత్, నాగాలాండ్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లలో  డిఎన్ఏ విశ్లేషణ, సైబర్ ఫోరెన్సిక్ తో పాటు  సంబంధిత సౌకర్యాలను మెరుగు పరచాలని  కమిటీ హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. దీనికోసం 17.31 కోట్ల రూపాయలను కేటాయించాలని కమిటీ సూచించింది. నిర్భయ నిధుల కింద 24 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లలో  డిఎన్ఏ విశ్లేషణ సౌకర్యాలను మెరుగుపరచాలని సమావేశం సూచించింది. 

దేశంలో 9797.02 కోట్ల రూపాయల ఖర్చుతో అమలవుతున్న పథకాలు/ కార్యక్రమాలను ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో సమీక్షించింది. నిర్భయ నిధులతో మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లుపోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్కులుఅత్యవసర ప్రతిస్పందన  వ్యవస్థసురక్షిత నగర ప్రాజెక్టులుమహిళా హెల్ప్‌లైన్ లాంటి కార్యక్రమాలు/పథకాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఉన్నతస్థాయి కమిటీ సమీక్షించిన తరువాత ఈ కార్యక్రమాలు/పథకాలను   నేరుగా లేదా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు / అమలు చేసే ఏజెన్సీల ద్వారా సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేయడం జరుగుతుంది. 

 మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశానికి  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు  ఉత్తర ప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు హాజరయ్యారు. 

దేశంలో మహిళల భద్రత కల్పించి, రక్షణ పెంపొందించడానికి ఉద్దేశించిన కార్యక్రమాల అమలు కోసం కేంద్ర  ప్రభుత్వం 'నిర్భయ ఫండ్పేరిట నిధులను అందుబాటులో ఉంచింది. ఈ నిధులు మురిగిపోవు. నిర్భయ ఫండ్ కింద ప్రతిపాదించిన పథకాలు / కార్యక్రమాలను అమలు చేయడానికి అందిన ప్రతిపాదనలను ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించి  నిధుల కోసం ప్రతిపాదనలను సిఫార్సు చేస్తుంది.  ఆమోదించబడిన ప్రాజెక్టుల అమలు పురోగతిని పర్యవేక్షిస్తుంది.

***



(Release ID: 1760113) Visitor Counter : 206