నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొచ్చిన్ పోర్టులో నిర్వ‌హించిన 'స్వచ్ఛత పఖ్వాడా' కార్య‌క్ర‌మం ముగింపు

Posted On: 01 OCT 2021 10:54AM by PIB Hyderabad

కొచ్చిన్ పోర్టులో 16/09/2021వ తేదీ నుండి 30/09/2021 వరకు నిర్వ‌హించిన స్వచ్ఛతా పఖ్వాడా కార్య‌క్ర‌మం ముగిసింది. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఉద్యోగులు త‌మ ప‌ని ప్రాంతంలోను, కార్యాల‌య ప్రాంగ‌ణంలోను, పడవలు/టగ్‌లు మ‌రియు పోర్ట్ ప్రాంతంలో  శ్ర‌మ‌దాన‌ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  స్వచ్ఛత పఖ్వాడా కార్య‌క్ర‌మంల సందర్భంగా పోర్ట్ ప్రాంతం మరియు విల్లింగ్‌డన్ ద్వీపంలో గ‌ల  రెండు మునిసిపల్ కార్పొరేషన్ వార్డులలో సాధారణ ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టే ఉద్యోగులకు పరిశుభ్రత కిట్‌లను పంపిణీ చేశారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ ఎం. బీనా దీనిని  ప్రారంభించారు.
కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ యొక్క అన్ని విభాగాల ఎంపికైన ఉద్యోగులకు వారి ఇంటి వద్ద కూరగాయల తోటలను అభివృద్ధి చేయడం కోసం కూరగాయల విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. గ్రీన్ ఎనర్జీ వినియోగానికి త‌గిన‌ ప్రాచుర్యం చేకూర్చే చొరవలో భాగంగా
కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ద్వారా ఎంబార్కేషన్ జెట్టీ (నార్త్‌హండ్ పబ్లిక్ ఫెర్రీ జెట్టీ, విల్లింగ్‌డన్ ఐలాండ్) వద్ద ఏర్పాటు చేసిన ప‌లు సోలార్ విద్యుత్ దీపాల‌ను  చైర్‌పర్సన్ ఈ సంద‌ర్భంగా ప్రారంభించారు. స్వచ్ఛత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి  28/09/2021వ తేదీన‌ సైకిల్ ర్యాలీ చేప‌ట్టారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ క్రీడాకారులు మరియు కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ యొక్క సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.  పరిశుభ్రమైన పర్యావరణ ప్రాముఖ్యత మరియు మెరైన్ డిపార్ట్‌మెంట్ ద్వారా నీటి వనరులను శుభ్రంగా ఉంచడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన క‌ల్పించందుకు కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగులకు ప‌లు తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ సంద‌ర్భఃగా పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా బ్యానర్లు,  స్టిక్కర్ల‌ను రో-రో వెస్స‌ల్స్ , పడవలు మరియు పోర్ట్ ప్రాంతంలోని ముఖ్యమైన ప్రదేశాలలో  ఏర్పాటు చేశారు.  పఖ్వాడా కాలంలో కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు ‘స్వచ్ఛత’ థీమ్‌పై షార్ట్ ఫిల్మ్ పోటీ మరియు పోస్టర్ డిజైనింగ్ పోటీలు నిర్వహించబడ్డాయి. పఖ్వాడా కాలంలో ఎర్నాకుళంలోని వార్ఫ్ కార్యాలయంలో గ‌ల‌ వార్ఫ్ సూపరింటెండెంట్ కార్యాల‌యం వ‌ద్ద  దివ్యాంగ్ యాక్సెస్ సౌకర్యం నిర్మించబడింది. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ యొక్క ప్రతి విభాగంలో ఉత్తమంగా నిర్వహించబడుతున్న కార్యాలయాలు పఖ్వాడా కాలంలో గుర్తించబడ్డాయి మరియు వాటికి తగిన విధంగా అవార్డుల‌ను ప్రదానం చేయడ‌మైంది. విల్లింగ్‌డన్ ద్వీపంలోని వివిధ ప్రదేశాల నుండి పదిహేను ట్రక్ లోడ్‌ల మేర వ్యర్థాలు/ చెత్తను తొలగించి, నిర్దేశించిన ప్రదేశంలో డంప్ చేశారు. కోవిడ్ మహమ్మారి పరిస్థితి నేప‌థ్యంలో సామాజిక దూరం మరియు ఇతర భద్రతా చర్యలకు అనుగుణంగా ఆయా కార్యక్రమాల‌ను నిర్వహించారు. 

***


(Release ID: 1760079) Visitor Counter : 166