విద్యుత్తు మంత్రిత్వ శాఖ
మొదటి గ్రీన్ టర్మ్ లోన్‌పై ఎన్‌టీపీసీ ఆర్ఈఎల్ సంతకం
Posted On:
30 SEP 2021 11:27AM by PIB Hyderabad
'నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్' (ఎన్‌టీపీసీ) సంస్థకు చెందిన 100 శాతం అనుబంధ సంస్థ అయిన ఎన్‌టీపీసీ - పునరుత్పాదక శక్తి లిమిటెడ్ (ఆర్ఈఎల్) బ్యాంక్ ఆఫ్ ఇండియాతో గ్రీన్ టర్మ్ లోన్‌పై సంతకం చేసింది. రాజస్థాన్‌లోని 470 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు & గుజరాత్‌లో 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లకు గాను ఎన్‌టీపీసీ ఆర్ఈఎల్ 29 సెప్టెంబర్ 2021వ తేదీన బ్యాంక్ ఆఫ్ ఇండియాతో 15 సంవత్సరాల కాలపరిమితితో రూ.500 కోట్ల మొత్తాన్ని అత్యంత తక్కువ రేటుతో పొందేందుకు సంబంధించి గ్రీన్ టర్మ్ రుణ ఒప్పందం చేసుకుంది. ఎన్‌టీపీసీ -ఆర్ఈఎల్ ప్రస్తుతం 3,450 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది, వీటిలో 820 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 2,630 మెగావాట్ల ప్రాజెక్టుల బిడ్‌లు గెలుచుకుంది, వీటి కోసం పీపీఏ లు అమలు చేయాల్సి ఉంది.
(Release ID: 1759675)