ప్రధాన మంత్రి కార్యాలయం

పార్లమెంటు కొత్త భవనం నిర్మాణస్థలాన్ని తనిఖీ చేసిన ప్రధాన మంత్రి;  అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల ను ఆయన సమీక్షించారు


ఆ ప్రదేశం లో పని చేస్తున్న శ్రామికులకు కోవిడ్ టీకా మందు ను ఇప్పించండి;  అలాగే వారికి నెలవారీ ఆరోగ్య పరీక్షలను జరిపించండి:  ప్రధాన మంత్రి

పార్లమెంటు కొత్త భవనం నిర్మాణం లోపాలుపంచుకొంటున్న శ్రామికుల సేవల గుర్తింపునకు డిజిటల్ ఆర్కైవ్ ను తప్పక ఏర్పాటుచేయాలి:  ప్రధాన మంత్రి

Posted On: 27 SEP 2021 3:25PM by PIB Hyderabad

పార్లమెంటు నూతన భవనం నిర్మాణం పనుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 26వ తేదీ సాయంత్రం పూట ఆ ప్రదేశాని కి వెళ్ళి, తనిఖీ చేశారు. ఆయన అక్కడ జరుగుతున్న పనుల ను సమీక్షించారు.

 

ఆ ప్రదేశం లో జరుగుతున్న పనుల లో పురోగతి ని గురించి ఆయన నిర్ధారణ చేసుకొన్నారు. ఆ ప్రాజెక్టు ను సకాలం లో పూర్తి చేయవలసిందంటూ నొక్కి చెప్పారు. శ్రామికుల తో ఆయన మాట్లాడి, వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకొన్నారు. వారు ఒక పవిత్రమైన, చరిత్రాత్మకమైన కార్యం లో తలమునకలు అయ్యారని ఆయన స్పష్టం చేశారు.

ఆ ప్రదేశం లో పని చేస్తున్న వారందరికీ కోవిడ్ నిరోధక టీకా మందు ను తప్పక ఇప్పించాలి అంటూ ప్రధాన మంత్రి ఆదేశించారు. వర్కర్ లు అందరికీ పత్రి నెల ఆరోగ్య పరీక్షల ను నిర్వహించాలని కూడా అధికారుల కు ఆయన సూచించారు. నిర్మాణం పనులు ఒకసారి పూర్తి అయ్యాయి అంటే నిర్మాణ శ్రామికులు అందరి వివరాల తోను ఒక డిజిటల్ ఆర్కైవ్ ను తప్పక ఏర్పాటు చేయాలని, ఆ డిజిటల్ ఆర్కైవ్ లో వారి పేరు లు, వారి ఛాయాచిత్రాలు, వారు ఏ ప్రాంతాని కి చెందిన వారు అనేటటువంటి వ్యక్తిగత వివరాలు పొందుపరచాలని, నిర్మాణ కార్యం లో వారి తోడ్పాటు కు గుర్తింపు ను ఇవ్వాలని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఈ ప్రయాస లో పాలుపంచుకొన్న వారి పాత్రల ను గురించి తెలియజేసే ధ్రువ పత్రాల ను కూడా శ్రామికులు అందరికీ ఇవ్వాలి అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఆకస్మిక తనిఖీ వేళ లో భద్రత పరం గా అతి తక్కువ జాగ్రత చర్యల ను చేపట్టడమైంది. ఆయన ఆ ప్రదేశం లో ఒక గంట కు పైగా కాలాన్ని వెచ్చించారు.

***



(Release ID: 1758589) Visitor Counter : 159