యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 1 నుంచి 312 వరకు దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రకటించిన క్రీడలు, యువ వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్
Posted On:
26 SEP 2021 4:41PM by PIB Hyderabad
అక్టోబర్ 1 నుంచి 312 వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్) సహా అన్ని రకాల వ్యర్ధాలపే శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. భారత దేశం స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ను జరుపుకుంటున్న నేపథ్యంలో, గాంధీజీ కలలు కన్న, స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణమైన ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని సృష్టించాలని మనం సంకల్పించుకోవాలని, ఒక ట్వీట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన క్రీడ, యువ వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. సంకల్ప్ సే సిద్ధి అన్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంతో పాలుపంచుకోవాలని మంత్రి అందరికీ విజ్ఞప్తి చేశారు.
ఈ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమని, ఇందులో భాగంగా 75 లక్షల టన్నుల వ్యర్ధాలను, ప్రాథమికంగా ప్లాస్టిక్ వ్యర్ధాలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి, దానిని వ్యర్ధాల నుంచి సంపద నమూనా ద్వారా ప్రాసెస్ చేస్తారని అనురాగ్ ఠాకూర్. ఈ కార్యక్రమం, క్లీన్ ఇండియాః సేఫ్ ఇండియా అన్న మంత్రాన్ని ప్రచారం చేయాలనే లక్ష్యంతో పని చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలనుకునే వ్యక్తులు, సంస్థలు, భాగస్వాములు తదితరులు దిగువన ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చుః
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnk5KMQ_bvtk1cFe56oCya0p3semGoKY5vEOJDdPtxzWAdaA/viewform
***
(Release ID: 1758401)
Visitor Counter : 233