యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
లేహ్, లడాఖ్‌లలో అల్టిమేట్ లడాఖ్ సైక్లింగ్ చాలెంజ్ రెండవ ఎడిషన్‌ను జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
సైకిల్ తొక్కుదాం, దృఢంగా ఉందాం, భారత్‌ను దృఢంగా ఉంచుదాం. యువత దృఢంగా ఉంటే, భారత్ దృఢంగా ఉంటుంది - మంత్రి
Posted On:
25 SEP 2021 11:13AM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌లో భాగంగా సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమన్వయంతో లడాఖ్ పోలీసులు నిర్వహించిన అల్టిమేట్ లడాఖ్ సైక్లింగ్ ఛాలెంజ్ రెండవ ఎడిషన్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం ప్రారంభించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావనలకు అనుగుణంగా భారత ప్రజలలో భౌతిక దృఢత్వం గురించిన స్పృహను ఉత్తేజితం చేయడమన్నదే ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ వెనుక ఉన్న ప్రేరణ అని సైక్లింగ్ చాలెంజ్‌ను ప్రారంభిస్తూ మంత్రి చెప్పారు. సముద్ర మట్టానికి 11000 అడుగుల ఎత్తున సైక్లింగ్ పోటీలలో పాల్గొంటున్న యువత ఉత్సాహాన్ని చూసి తనకు అమితమైన సంతోషం కలుగుతోందని మంత్రి అన్నారు. సైక్లింగగ్ పోటీలను ప్రోత్సహించడం ద్వారా లడాఖ్ యువత ఫిట్ ఇండియా ప్రచారానికి ఎంతో దోహదం చేస్తున్నారని మంత్రి కొనియాడారు.
ఫిట్ ఇండియా ఉద్యమం కింద సైక్లింగ్ పోటీలను ప్రోత్సహించినందుకు లడాఖ్ పోలీసులను, ఎల్ఎహెచ్‌డిసిని మంత్రి అభినందించారు. ఫిట్ ఇండియా ప్రచారాన్ని ప్రోత్సహించడంలో యువత పాత్రను నొక్కి చెప్తూ సైకిల్ తొక్కుదాం, దృఢంగా ఉందాం, భారత్‌ను దృఢంగా ఉంచుదాం. యువత దృఢంగా ఉంటే, భారత్ దృఢంగా ఉంటుంది.
పార్లమెంట్ సభ్యుడు జమ్యాంగ్ సెరింగ్ నమ్‌గ్యాల్, సిఇసి, టాషీ గ్యాల్సన్ తో కలిసి మంత్రి సైక్లింగ్ పోటీ పాల్గొన్నారు.
***
(Release ID: 1758076)
Visitor Counter : 151