సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లడఖ్‌లోని హంబోటింగ్ లాలో డిడి/ఎయిర్‌ ట్రాన్స్‌మీటర్‌లను ప్రారంభించారు


మారుమూల &సరిహద్దు ప్రాంతాలను కవర్ చేయడానికి అత్యధిక ఎత్తులో ప్రసార్ భారతికి చెందిన ట్రాన్స్‌మీటర్లు

Posted On: 25 SEP 2021 2:50PM by PIB Hyderabad

కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్  ఈరోజు లడఖ్‌లోని కార్గిల్ సమీపంలో హంబోటింగ్ లా వద్ద దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియోకు చెందిన హై పవర్ ట్రాన్స్‌మీటర్‌లను దేశానికి అంకితం చేశారు. ఈ 10 కేడబ్లూ ట్రాన్స్‌మీటర్లు దేశంలో అత్యధిక ఎత్తులో ఉన్న టీవీ  మరియు రేడియో ట్రాన్స్‌మీటర్లు, ఇవి సగటున సముద్ర మట్టానికి 4054 మీటర్ల (దాదాపు 13,300 అడుగులు) ఎత్తులో ఉన్నాయి. లేహ్ వద్ద ఉన్న ట్రాన్స్‌మీటర్లు 3501 మీటర్ల ఎత్తులో ఉన్నాయి (దాదాపు 11,450 అడుగులు).

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  ప్రతికూల వాతావరణ పరిస్థితులు మరియు భౌగోళిక భూభాగాన్ని పరిగణనలోకి తీసుకుంటే హాంబోటింగ్ లా సైట్ అత్యంత కష్టతరమైన ప్రదేశాలలో ఒకటని చెప్పారు. అటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు శ్రీ అనురాగ్ ఠాకూర్ ఇంజనీర్లు మరియు కార్మికుల బృందాన్ని అభినందించారు. ట్రాన్స్‌మీటర్ల పరిధి వ్యాసార్థంలో 50 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. కార్గిల్‌కు చెందిన మారుమూల సరిహద్దు ప్రాంతంలో ఈ ట్రాన్స్‌మీటర్లు దాదాపు 50,000 మంది జనాభాను కవర్ చేస్తాయని శ్రీ ఠాకూర్ చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ సంఖ్య చిన్నదిగా అనిపించవచ్చు, అయితే సరిహద్దు ప్రాంతాలలో ప్రతి పౌరుడిని చేరుకోవడంలో భారత ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రదర్శిస్తుంది డిడి కాశీర్‌కి లడఖీ సహకారంతో 2021 అక్టోబర్ 1 నుండి ప్రతిరోజూ 30 నిమిషాల నుండి ఒక గంటకు రెట్టింపు చేయబడుతుందని మంత్రి ప్రకటించారు.

బలమైన రేడియో&టెలివిజన్ సిగ్నల్స్‌ ద్వారా సరిహద్దు కవరేజ్ అనేది ప్రభుత్వ ప్రసార విధానాలలో ముఖ్యమైన అంశం అని శ్రీ ఠాకూర్ అన్నారు. సున్నితమైన సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ &కశ్మీర్‌ మరియు లడఖ్‌లోని ప్రజలకు సరైన సమాచారం అందించడమే కాకుండా, పొరుగున ఉన్న శత్రుదేశాల నుండి వచ్చే ప్రచారాన్ని ఎదుర్కోవడం కూడా అవసరమని మంత్రి అన్నారు. సరిహద్దు ప్రాంతాలలో భూసంబంధమైన కవరేజీని బలోపేతం చేయడం ద్వారా వీక్షకులు/శ్రోతలు దేశ విధానాలు, వార్తలు మరియు వర్తమాన వ్యవహారాల గురించి తగినంతగా తెలియజేయడానికి మరియు ఏకకాలంలో వివిధ కార్యక్రమాల ద్వారా వినోదాన్ని పొందడానికి అవకాశం కల్పిస్తుంది.

డిడి మరియు ఎయిర్‌ ద్వారా ఈ ప్రాంతంలోని విద్యార్థులకు విద్యా విషయాలను కూడా ఇది అందుబాటులో ఉంచుతుంది. టీవీ, రేడియో మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రసార భారతి వివిధ రాష్ట్ర విద్యా విభాగాలు మరియు సంస్థల సహకారంతో పాఠశాల & కళాశాల విద్యార్థులకు వివిధ విద్యా విషయాలను అందిస్తోంది.

ఈ సందర్భంగా లడక్ పార్లమెంటు సభ్యుడు శ్రీ జెటి నామ్‌గ్యాల్ మాట్లాడూ కొత్త ట్రాన్స్‌మీటర్లు ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కేంద్రం నిబద్ధతను చూపుతున్నాయని అన్నారు.

టీవీ మరియు రేడియో ఛానెల్స్‌ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడానికి ప్రసార భారతి..వార్తా, వినోదం, విద్య మరియు 48 రేడియో ఛానెల్‌లతో సహా 160 కి పైగా టీవీ ఛానెల్‌లను డిడి ఫ్రీ డిష్‌ను గృహాలకు నెలవారీ రుసుము లేకుండా ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. ప్రత్యేకమైన ఫ్రీ టు ఎయిర్ మోడల్ డిడి ఫ్రీ డిష్‌ను 4 కోట్ల కంటే ఎక్కువ కుటుంబాలకు చేరుకోగల అతిపెద్ద డిటిహెచ్‌ ప్లాట్‌ఫారమ్‌గా చేసింది.

 

***


(Release ID: 1758072) Visitor Counter : 340