ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, మరియు యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హారిస్ కు మధ్య జరిగిన సమావేశం

Posted On: 24 SEP 2021 3:12AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ను సందర్శించిన కాలం లో 2021 సెప్టెంబర్ 23 న వాశింగ్ టన్ డిసి లో యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హారిస్ గారి తో సమావేశమయ్యారు.

 

వారు ఇద్దరు ఈ తొలిసారి ముఖాముఖి సమావేశం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతకు ముందు 2021 జూన్ లో వారు టెలిఫోన్ ద్వారా జరిపిన సంభాషణ ను ఈ సందర్భం లో వారు ఆప్యాయం గా గుర్తు కు తెచ్చుకొన్నారు. నేత లు ఇరువురు అఫ్ గానిస్తాన్ సహా ప్రపంచం లో ఇటీవలి మార్పు చేర్పుల పై వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడి చేసుకొన్నారు. ఒక స్వేచ్ఛాయుతమైన, బాహాటమైన, అన్ని పక్షాల ను కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ఆవిష్కరించే దిశ లో పని చేయాలనే నిబద్ధత ను వారు ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు.

 

నేతలు ఇద్దరు వారి వారి దేశాల లో కోవిడ్-19 స్థితి ని గురించి చర్చించారు. టీకాకరణ ను త్వరిత తగిన పూర్తి చేయాలనే ప్రయత్వం ద్వారా మహమ్మారి ని అదుపు లోకి తీసుకు రావడానికి ప్రస్తుతం జరుగుతున్న కృషి తో పాటు కీలకమైన మందుల ను, చికిత్స సంబంధి, ఆరోగ్య సంరక్షణ సంబంధి ఉపకరణాలు ఎటువంటి లోటు లేకుండా సరఫరా అయ్యేందుకు పూచీపడడం అనే అంశాలు కూడా చర్చ కు వచ్చాయి.

 

జలవాయు పరివర్తన అంశం లో సహకార పూర్వకమైన చర్యల ప్రాముఖ్యం ఎంతైనా ఉంది అని ఉభయ పక్షాలు అంగీకరించాయి. నవీకరణ యోగ్య శక్తి ఉత్పత్తి ని పెంచడం కోసం భారతదేశం అలుపెరుగని ప్రయాసలు చేస్తోందని, ఇటీవలే నేశనల్ హైడ్రోజన్ మిశన్ ను ప్రారంభించిందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. పర్యావరణ పరం గా స్థిరత్వాన్ని ప్రోత్సహించడం కోసం జీవనశైలి లో మార్పు తీసుకురావడానికి పెద్ద పీట వేయాలి అని కూడా ఆయన నొక్కిచెప్పారు.

 

అంతరిక్ష రంగం లో సహకారం, సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం లో సహకారం, ప్రత్యేకించి క్రిటికల్ టెక్నాలజీ లో సహకారం తో పాటు ఆరోగ్య రంగం లో సహకరించుకోవడం సహా భవిష్యత్తు లో సహకరించుకోదగ్గ రంగాల పైన కూడా వారు చర్చించారు. పరస్పర ప్రయోజనకరమైన విద్య రంగ సంబంధాలు, రెండు దేశాల నడుమ జ్ఞానం, నూతన ఆవిష్కరణ లు, ప్రతిభ ఆధారం గా ప్రజలక ప్రజలకు మధ్య చైతన్యవంతమైన సంబంధాలను మరింత పటిష్టపరచుకోవడం పట్ల నేత లు సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గారి ని, సెకండ్ జెంటిల్ మేన్ శ్రీ డగ్ లస్ ఎమ్హాఫ్ గారి ని త్వరలోనే భారతదేశానికి విచ్చేయవలసిందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.

 

***



(Release ID: 1757701) Visitor Counter : 227