ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్వాడ్ లీడర్స్ సమిట్ జరిగిన సందర్భం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ తో ప్రధాన మంత్రి సమావేశం

Posted On: 24 SEP 2021 3:10AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 23 న యుఎస్ఎ లోని వాశింగ్ టన్ డిసి లో క్వాడ్ లీడర్స్ సమిట్ జరిగిన సందర్భం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ తో ఒక ద్వైపాక్షిక సమావేశం లో పాల్గొన్నారు.

ఇది మహమ్మారి అనంతర కాలం లో నేతలు ఇరువురి మధ్య ఒకటో ముఖాముఖి గా జరిగిన ఒకటో సమావేశం. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రధాని శ్రీ మారిసన్ ల మధ్య 2020 జూన్ 4న వర్చువల్ మాధ్యమం ద్వారా జరిగిన ద్వైపాక్షిక సమావేశమే కడపటి ద్వైపాక్షిక సమావేశం. ఆ సందర్భం లో భారతదేశాని కి, ఆస్ట్రేలియా కు మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒక విస్తృతమైనటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయి కి ఉన్నతీకరించడమైంది.


సమావేశం సాగిన క్రమం లో, ప్రధానులు ఇరువురు ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ అంశాలు, ప్రపంచ స్థాయి ప్రాముఖ్యం కలిగిన వివిధ అంశాల పై చర్చించారు. ఇటీవలే నిర్వహించిన ఒకటో భారతదేశం-ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల మరియు రక్షణ మంత్రుల 2+2 సంభాషణ సహా ఉభయ దేశాల మధ్య క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి సంప్రదింపులు చోటు చేసుకొంటూ ఉండటం పట్ల నేత లు సంతోషాన్ని వ్యక్తం చేశారు.


కామ్ ప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్‌న‌ర్ శిప్ లో భాగం గా 2020 జూన్ లో లీడర్స్ వర్చువల్ సమిట్ జరిగినప్పటి నుంచి సాధించిన ప్రగతి ని ప్రధాన మంత్రులు ఇద్దరు సమీక్షించారు. పరస్పర శ్రేయం కోసం ఒక స్వతంత్రమైనటువంటి, అరమరికల కు తావు ఉండనటువంటి, సమృద్ధం అయినటువంటి, నియమావళి పై ఆధారపడినటువంటి ఇండో- పసిఫిక్ రీజియన్ ను ఆవిష్కరించాలనే ఉమ్మడి లక్ష్యం వైపున కు పయనించడం లో సన్నిహిత సహకారాన్ని కొనసాగించాలని వారు సంకల్పం చెప్పుకొన్నారు.


ద్వైపాక్షిక కామ్ ప్రిహెన్సివ్ ఇకనామిక్ కోఆపరేశన్ అగ్రిమెంట్ (సిఇసిఎ) లో భాగం గా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న సంప్రదింపుల ప్రక్రియ పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో, ఇరు పక్షాలు ప్రధాన మంత్రి శ్రీ స్కాట్ మారిసన్ ప్రత్యేక వ్యాపార దూత రూపం లో ఆస్ట్రేలియా పూర్వ ప్రధాని శ్రీ టోనీ ఎబాట్ భారతదేశం సందర్శన ను స్వాగతించారు. 2021 డిసెంబర్ కల్లా మధ్యంతర ఒప్పందం పై ఆధారపడ్డ ఒక ప్రారంభిక ప్రకటన ను చేయాలి అనే తమ నిబద్ధత ను వారు చాటి చెప్పారు.


జలవాయు పరివర్తన అంశాన్ని అత్యవసర ప్రాతిపదిక న పరిష్కరించడం కోసం అంతర్జాతీయ సముదాయం భాగస్వామ్యం వహించవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాను లు స్పష్టం చేశారు. ఈ సందర్భం లో, పర్యావరణ పరిరక్షణ పై ఒక విస్తృతమైన సంభాషణ ను జరుపవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. స్వచ్ఛమైన సాంకేతికత లను అందుబాటులోకి తీసుకురావడానికి గల అవకాశాల ను గురించి కూడా ఇరువురు నేతలు చర్చించారు.

ఈ ప్రాంతం లోని రెండు చైతన్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ లైన తమ రెండు దేశాలు మహమ్మారి అనంతర ప్రపంచం లో ఎదురయ్యే సవాళ్ళ ను అధిగమించడం కోసం కలసికట్టు గా కృషి చేయవలసిన అవసరం ఉందని సమ్మతించారు. ఆ సవాళ్ల లోఇతర విషయాలతో పాటు సప్లయ్ చైన్ కు ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా చూసుకొనే దిశ లో మరిన్ని జాగ్రత్త లు తీసుకోవడం అనేది కూడా ఒకటి గా ఉంది.



ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ కు, ఆస్ట్రేలియా సమాజాని కి ప్రవాసీ భారతీయుల అపారమైనటువంటి తోడ్పాటు ను ఇద్దరు నేత లు మెచ్చుకొంటూ, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను ప్రోత్సహించ గల మార్గాలు ఏమేం ఉన్నాయన్న అంశంపైన చర్చించారు.


ప్రధాని శ్రీ మారిసన్ భారతదేశాన్ని సందర్శించాలి అంటూ ఆయనకు తన ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

***

 


(Release ID: 1757696) Visitor Counter : 219