సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

సెప్టెంబర్ 24 న 1 వ హిమాలయ చలన చిత్రోత్సవాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్


ప్రారంభ వేడుకకు హాజరు కానున్న పలువురు సినీ ప్రముఖులు, షేర్ షా డైరెక్టర్ శ్రీ విష్ణువర్ధన్ ప్రధాన నటుడు శ్రీ సిద్ధార్థ్ మల్హోత్రా

పరమ వీర చక్ర అవార్డు గ్రహీత జీవితం ఆధారంగా నిర్మించిన షేర్ షా చిత్ర ప్రదర్శనతో ప్రారంభం కానున్న అయిదు రోజుల చలన చిత్రోత్సవం

చిత్రోత్సవంలో భాగంగా పోటీ, పోటీయేతర విభాగాలు, మాస్టర్‌క్లాస్, చర్చా గోష్ఠులు, ప్రముఖ సినిమాల ప్రదర్శన

Posted On: 22 SEP 2021 1:13PM by PIB Hyderabad

మొదటి హిమాలయా చలన చిత్రోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి 20 వరకు అయిదు రోజుల పాటు లడఖ్ లోని లేహ్ లో జరగనున్నాయి.   మొదటి  హిమాలయ చలన చిత్రోత్సవాన్ని కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ 24 సెప్టెంబర్, 2021 న ప్రారంభిస్తారు.

చిత్రోత్సవాల ప్రారంభ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారు. ప్రారంభ కార్యక్రమంలో సూపర్ హిట్ అయిన 'షేర్ షా' చిత్ర దర్శకుడు   శ్రీ విష్ణువర్ధన్ మరియు ప్రధాన  పాత్రలో నటించిన నటుడు శ్రీ సిద్ధార్థ్ మల్హోత్రా పాల్గొంటారు. వీరితో పాటు  చిత్ర నిర్మాతలు, ఇతర నటులు కూడా కార్యక్రమానికి హాజరవుతారు. ' షేర్ షా' ప్రదర్శనతో చలన చిత్రోత్సవాలు ప్రారంభం అవుతాయి. 

చలన చిత్ర ప్రియులను అలరించడానికి చిత్రోత్సవంలో అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

1. అయిదు రోజుల చిత్రోత్సవంలో ప్రముఖ చిత్రాల ప్రదర్శన 

చిత్రోత్సవంలో జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాలను, ఇండియన్ పనోరమ చిత్రాలను ప్రదర్శిస్తారు. డిజిటల్ ప్రొజెక్షన్ సౌకర్యాలు ఉన్న లేహ్ లోని సింధు సంక్రాంతి ఆడిటోరియంలో చిత్రాలను ప్రదర్శిస్తారు. 

2. వర్కుషాపులు, మాస్టర్‌క్లాస్‌లు,  చర్చా గోష్ఠులు

స్థానిక ఔత్సాహికులకు చిత్ర నిర్మాణంలో ఉత్సాహం కలిగించి అవసరమైన శిక్షణ ఇవ్వడానికి హిమాలయ ప్రాంతానికి చెందిన నిర్మాతలువిమర్శకులుసాంకేతిక నిపుణులు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రత్యేకంగా  వర్కుషాపులు, మాస్టర్‌క్లాస్‌లు,  చర్చా గోష్ఠులను నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. 

3. పోటీ విభాగం- లఘు డాక్యుమెంటరీ     చిత్రాల పోటీ  

పోటీ విభాగంలో పాల్గొడానికి  లఘు డాక్యుమెంటరీ  చిత్రాలు ఆహ్వానించబడ్డాయి. ఈ విభాగంలో   ఉత్తమ చిత్ర దర్శకుడు, నిర్మాతఉత్తమ సినిమాటోగ్రఫీఉత్తమ ఎడిటర్, ఉత్తమ కథకు అవార్డులను అందిస్తారు. 

వీటితో పాటు చిత్రోత్సవాలకు వచ్చే వారి కోసం వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. 

* ఫుడ్ ఫెస్టివల్: 

భిన్న భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కలిగి ఉన్న లడఖ్ లోని  వివిధ ప్రాంతాల వంటలు విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటాయి. చిత్రోత్సవాలకు వచ్చే వారి కోసం  అయిదు రోజుల పాటు ఇవి అందుబాటులో ఉంటాయి. 

 

సాంస్కృతిక ప్రదర్శనలు: 

 లడఖ్ యొక్క గొప్ప సాంస్కృతిని ప్రదర్శించడానికి సాంస్కృతిక శాఖ సహకారంతోసాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.  

* సంగీత కార్యక్రమాలు :

 లడఖ్ ప్రాంతానికి చెందిన  యువ సంగీత విద్వాంసులు వేదిక వద్ద సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

ప్రకృతి అందాలకు నిలయమైన హిమాలయ ప్రాంతంలో చిత్రాలను నిర్మించడానికి ప్రపంచం వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అనేక చిత్రాలలో ప్రాంత అందాలతో పాటు స్థానిక ప్రజల జీవన విధానాలు, ప్రాంత  సంస్కృతి సాంప్రదాయాలు  కూడా చిత్రీకరించబడ్డాయి. ఇటువంటి ఉత్సవాలు స్థానిక చిత్ర నిర్మాతలు తమ కథలను  విభిన్న ప్రాంతాల నుంచి వచ్చే వారికి వినిపించి గుర్తింపు పొందడానికి అవకాశం కల్పిస్తాయి. 

గత రెండు గత రెండు దశాబ్దాల కాలంలో హిమాలయ ప్రాంతంలో చలన చిత్ర రంగం గణనీయ అభివృద్ధిని సాధించింది.  స్థానిక భాషలలో నిర్మాతలు చిత్రాలను నిర్మిస్తున్నారు.  అదే సమయంలో  ఆడియో-విజువల్ రంగ అభివృద్ధికి అవసరమైన విద్యుదీకరణ కూడా ఈ ప్రాంతంలో వేగంగా జరిగింది. 

భారతదేశం నిర్మిస్తున్న చిత్రాలు లడఖ్ ప్రాంతంలో ప్రదర్షింపబడుతున్నాయి. అయితేఇక్కడ నిర్మించిన చిత్రాలు దేశం ఇతర ప్రాంతాల్లో ఆదరణకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో  హిమాలయ చలన చిత్రోత్సవంలో నిర్వహించనున్న వర్క్ షాపులుమాస్టర్‌క్లాస్చర్చా గోష్ఠుల ఈ ప్రాంతానికి చెందిన ఔత్సాహికులకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించి వారు ఈ రంగంలో ముందుకు సాగేందుకు సహకరిస్తాయి. 

హిమాలయ ప్రాంతాన్ని దేశ  చలన చిత్ర రంగంలో అంతర్భాగంగా రూపొందించడానికి  ఈ చలన చిత్రోత్సవాలు సహకరిస్తాయి. అయిదు రోజుల సినిమా పండుగలో హిమాలయ ప్రాంతంతో పాటు దేశం ఇతర ప్రాంతాలకు చెందిన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయి. 

పోటీ విభాగం  జ్యూరీ

 

 శ్రీమతి మంజు బోరాచైర్‌పర్సన్ (అస్సాం)

 

 శ్రీ జి పి విజయ్ కుమార్సభ్యుడు (తమిళనాడు)

 

 శ్రీ రాజా షబీర్ ఖాన్సభ్యుడు (జమ్మూ, కాశ్మీర్)



(Release ID: 1757014) Visitor Counter : 178