ఉక్కు మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వరంగ స్టీల్ సంస్థల మార్కెటింగ్ వ్యూహాలపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహకరించాలని మంత్రి కోరారు.
Posted On:
21 SEP 2021 6:05PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వరంగ స్టీల్ సంస్థల చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్లతో వారి మార్కెటింగ్ వ్యూహాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలను సమీక్షించడానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. భవిష్యత్ విస్తరణ/వైవిధ్యీకరణ ప్రణాళికల నేపథ్యంలో కంపెనీలు దాని రోడ్‌మ్యాప్‌తో సహా మార్కెటింగ్ మరియు విక్రయ వ్యూహాలను మంత్రిఈ సమావేశంలో సమీక్షించారు. స్టీల్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే మరియు ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రదీప్ కుమార్ త్రిపాఠీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సీపీఎస్ఈలు దేశీయంగా, అదేవిధంగా ఎగుమతులకు సంబంధించి తమ మార్కెటింగ్ వ్యూహాలు, వివిధ ఉత్పత్తుల గురించి ఈ సమావేశంలో ఉక్కు మంత్రికి తెలియజేశాయి. అనంతరం మంత్రి స్పందిస్తూ.. డిమాండ్, సప్లయ్, ధరల పోకడలు, పోటీస్థాయి తదితరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి ఓ వ్యవస్థను కలిగి ఉండాలని మంత్రి సూచించారు. సీపీఎస్ఈలు మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎస్ఈలకు మంత్రి మరో అభ్యర్థన కూడా చేశారు. దేశంలో కొనసాగుతున్న, మరియు భవిష్యత్తులో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులకు సీపీఎస్ఈలు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరారు. భారతమాల, సాగరమాల, రహదారుల ప్రాజెక్టులు, రైల్వే సరుకు రవాణా కారిడార్లు, ఆనకట్టల నిర్మాణం మరియు ఇంధన రంగంలో ప్రాజెక్టులు సహకరించాలని మంత్రి నొక్కి చెప్పారు.
సీపీఎస్ఈలు ఉత్పత్తుల బ్రాండింగ్పై మరింత దృష్టి సారించాలని, మరియు వారి ఉత్పత్తులు ప్రాచుర్యం పొందడబానికి అందుబాటులో ఉన్న అన్నిరకాల ప్రకటనల అవకాశాలను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. డీలర్లు/డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లు, కస్టమర్‌లు మొదలైన వారితో నిరంతరం తమనుతాము భాగస్వామ్యం చేసుకోవాలని కూడా మంత్రి సూచించారు. చిన్న పట్టణాలు/నగరాలు మరియు గ్రామాలలోని సామాన్యులకు సీపీఎస్ఈల విస్తరణను విస్తరించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు.
***
(Release ID: 1756852)
Visitor Counter : 186