ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబై, ఇతర ప్రాంతాలలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 18 SEP 2021 12:29PM by PIB Hyderabad

ఆదాయపు పన్ను శాఖ ముంబైలోని ఒక ప్రముఖ నటుడికి చెందిన వివిధ ప్రాంగణాలలో సోదాలు, స్వాధీన పరుచుకునే ఆపరేషన్ నిర్వహించింది. అలాగే మౌలిక సదుపాయాలకు సంబంధించిన లక్నో ఆధారిత పరిశ్రమల గ్రూపుపై కూడా సోదాలు జరిగాయి. ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ మరియు గుర్గావ్‌లలో మొత్తం 28 ప్రాంగణాలలో సోదాలు చేశారు. 

నటుడు, అతని సహచరుల ప్రాంగణంలో శోధన సమయంలో, పన్ను ఎగవేతకు సంబంధించిన నేరారోపణలు కనుగొనడం జరిగింది. నటుడు అనుసరించే పద్దతిలో అనేక బోగస్ సంస్థల నుండి తన లెక్కలేని ఆదాయాన్ని బోగస్ అసురక్షిత రుణాల రూపంలో అందించడం జరిగింది. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఇలాంటి ఇరవై ఎంట్రీలను ఉపయోగించినట్లు వెల్లడైంది, ప్రొవైడర్లను ప్రశ్నిస్తే బోగస్ వసతి ఎంట్రీలను ఇచ్చినట్లు వెల్లడించారు. నగదుకు బదులుగా చెక్కులు జారీ చేసినట్లు వారు అంగీకరించారు. పన్ను ఎగవేత కోసం ఖాతాల పుస్తకాలలో ప్రొఫెషనల్ రసీదులు రుణాలుగా మభ్యపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ బోగస్ రుణాలు పెట్టుబడులు పెట్టడానికి, ఆస్తులను సంపాదించడానికి ఉపయోగించబడ్డాయని కూడా వెల్లడైంది. ఇప్పటివరకు వెలికితీసిన పన్ను ఎగవేత మొత్తం రూ. 20 కోట్లు.

21 జూలై, 2020 న నటుడు స్థాపించిన ఛారిటీ ఫౌండేషన్ 01.04.2021 నుండి ఇప్పటి వరకు 18.94 కోట్ల రూపాయల విరాళాలను సేకరించింది, అందులో దాదాపు రూ. 1.9 కోట్లు వివిధ సహాయక పనులకు మరియు మిగిలిన రూ. 17 కోట్లు  ఫౌండేషన్ బ్యాంక్ ఖాతాలో ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నట్లు కనుగొనబడింది. ఎఫ్సిఆర్ఏ నిబంధనలను ఉల్లంఘించి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లో విదేశీ దాతల నుండి   రూ. 2.1 కోట్లను ఛారిటీ ఫౌండేషన్ సేకరించింది.

లక్నోలోని ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ వివిధ ప్రాంగణాలలో ఏకకాలంలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లలో, నటుడు జాయింట్ వెంచర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో ప్రవేశించి, గణనీయమైన నిధులను పెట్టుబడి పెట్టారు, ఫలితంగా పుస్తక ఖాతాల్లో పన్ను ఎగవేత మరియు అక్రమాలకు సంబంధించిన నేరపూరిత సాక్ష్యాలు లభించాయి. పేర్కొన్న గ్రూప్ సబ్ కాంట్రాక్టింగ్ ఖర్చుల బోగస్ బిల్లింగ్ తో నిధులను మళ్లించింది. ఇప్పటివరకు దొరికిన అటువంటి బోగస్ ఒప్పందాల ఆధారాలు రూ. 65 కోట్లుగా తేలాయి. ఇంకా, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్/కంపెనీ సందేహాస్పద లావాదేవీ రూ.175 కోట్లను జైపూర్‌లో ఉన్న ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీతో జరిపింది. పూర్తి స్థాయిలో పన్ను ఎగవేతను బయటపెట్టడానికి తదుపరి సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల సమయంలో రూ .1.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు మరియు 11 లాకర్లపై ఆంక్షలు విధించారు. 


(Release ID: 1756107) Visitor Counter : 210