సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
నేటి నుంచి ప్రధానమంత్రి అందుకున్న బహుమతులు మరియు మెమెంటోల ఈ-వేలం మూడవ ఎడిషన్ ప్రారంభం
అక్టోబర్ 7, 2021 వరకు ఈ-వేలం జరుగుతుంది
ఈ-వేలం ద్వారా వచ్చే ఆదాయం నమామి గంగే మిషన్‌కు వెళ్తుంది
Posted On:
17 SEP 2021 4:38PM by PIB Hyderabad
ముఖ్య అంశాలు :
* ఈ దఫా ఈ-వేలంలో దాదాపు 1330 మెమెంటోలు అందుబాటులో ఉంటాయి
* వ్యక్తులు/సంస్థలు ఈ -వేలంలో https://pmmementos.gov.in వెబ్‌సైట్ ద్వారా పాల్గొనవచ్చు
* టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలు మరియు టోక్యో 2020 ఒలింపిక్ క్రీడల విజేతలు ప్రధానికి బహుమతిగా అందించిన స్పోర్ట్స్ గేర్ మరియు పరికరాలు ఈ వేలంలో ప్రధాన అంశాలు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కానుకలుగా అందిన ప్రతిష్టాత్మకమైన, చిరస్మరణీయమైన వస్తువులను విక్రయించడానికి మూడవ దశ ఈ -వేలం వెబ్‌సైట్ https://pmmementos.gov.in ద్వారా 2021 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు జరుగుతుంది. ఈసారి వేలంకి రానున్న వస్తువుల్లో టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలు మరియు టోక్యో 2020 ఒలింపిక్ క్రీడల విజేతలు ప్రధానికి బహుమతిగా అందించిన స్పోర్ట్స్ గేర్ మరియు పరికరాలు ఉన్నాయి. వీటితోపాటు అయోధ్య రామమందిరం నమూనా , చార్ ధామ్ , రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్, నమూనాలు, శిల్పాలు, పెయింటింగ్‌లు, అంగవస్త్రాలు లాంటి వస్తువులు కూడా వేలానికి రానున్నాయి.
సెప్టెంబర్ 17న ప్రారంభం అయిన ఈ-వేలంలో దాదాపు 1330 వస్తువులు అందుబాటులో ఉంటాయి. టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్‌లో బంగారు పతక విజేత శ్రీ సుమిత్ అంటిల్ టోక్యో 2020 ఒలింపిక్ క్రీడలలో శ్రీ నీరజ్ చోప్రా ఉపయోగించిన ఉపయోగించిన జావెలిన్లు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. వీటి కనీస ధరను ఒక్కొక్కటి కోటి రూపాయలుగా నిర్ణయించారు. చిన్న సైజు అలంకార ఏనుగు అతి తక్కువ ధర 200 రూపాయలకు అందుబాటులో ఉంచారు. వేలం వివరాలను కేంద్ర సాంస్కృతిక మంత్రి ట్వీట్‌లో తెలియజేశారు.
వేలంకి ఉంచిన ఇతర వస్తువులలో నీలం రంగులో లవ్లినా బోర్గోహైన్ ఉపయోగించిన బాక్సింగ్ గ్లోవ్స్ వంటి కొన్ని ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. బాక్సింగ్ గ్లోవ్స్ పై లవ్లినా బోర్గోహైన్ ప్లేయర్ స్వయంగా సంతకం చేశారు. బ్యాడ్మింటన్ రాకెట్ పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన కృష్ణ నగర్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాడ్మింటన్ రాకెట్ కూడా బిడ్‌లో ఉంది. టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలలో సిల్వర్ మెడల్ సాధించిన భావినా పటేల్ ఉపయోగించిన టేబుల్ టెన్నిస్ రాకెట్ ఆమె ఆటోగ్రాఫ్ తో సహా వేలంలో ఉంది.
వ్యక్తులు/సంస్థలు ఈ -ఆక్షన్‌లో వెబ్‌సైట్ https://pmmementos.gov.in ద్వారా 17 సెప్టెంబర్ మరియు 7 అక్టోబర్, 2021 మధ్య పాల్గొనవచ్చు.
ఈ-వేలం ద్వారా వచ్చే ఆదాయం గంగానది పరిరక్షణ మరియు పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన నమామిగేంజ్ మిషన్‌కు వెళ్తుంది. తనకు అందిన బహుమతులను వేలం ద్వారా విక్రయించి దీనిద్వారా లభించే ఆదాయాన్ని ప్రజాహిత కార్యక్రమాలకు ఉపయోగించాలని నిర్ణయించిన తొలి ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గుర్తింపు పొందారు. దేశంలోని జీవనాడి- గంగా నది సంరక్షణ కోసం ప్రారంభించిన "నమామిగంగే" కార్యక్రమానికి బహుమతుల వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖర్చు చేయాలని ప్రధాని నిర్ణయించారు. గంగా నది దేశ సాంస్కృతిక వైభవం మరియు విశ్వాసానికి చిహ్నంగా ప్రధానమంత్రి వర్ణించారు. ఉత్తరాఖండ్‌లోని గౌముఖ్ వద్ద ప్రారంభం అయ్యే గంగా నది పశ్చిమ బెంగాల్‌లో సముద్రంలో విలీనం అయ్యే వరకు దేశం వివిధ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. శక్తివంతమైన నది దేశ జనాభాలో సగం మంది జీవితాలను సుసంపన్నం చేసింది.
Click here for highlight items
****
(Release ID: 1755823)
Visitor Counter : 260