సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎన్ఎస్ఐసీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ జేఎస్ శ్రీమతి అల్కా నంగియా అరోరా
Posted On:
17 SEP 2021 11:46AM by PIB Hyderabad
'నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఎన్ఎస్ఐసీ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా (సీఎండీ) ఐడీఏఎస్‌కు (91) చెందిన శ్రీమతి అల్కా నంగియా అరోరా 14సెప్టెంబర్, 2021న అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్ఎస్ఐసీ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. 2021-22 మధ్య కాలంలో తమతమ వృత్తులలో అత్యుత్తమమైన పని తీరును కొనసాగించాలంటూ ఆమె ఉద్యోగులను ప్రోత్సహించారు. శ్రీమతి అల్కా అరోరా దేశ వ్యాప్తంగా విభిన్నమైన కార్యకలాపాలలో 30 సంవత్సరాల అనుభవం కలిగిన పరిశ్రమ అనుభవజ్ఞురాలు. ప్రస్తుతం శ్రీమతి అల్కా అరోరా కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. హస్త కళలు, టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, మేనేజింగ్ డైరెక్టర్, కాటేజ్ ఎంపోరియం అదనపు కమిషనర్‌గా కూడా పని చేశారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ (సుబ్రోతో పార్క్) & ఎఫ్ఏ ఆర్మీ హాస్పిటల్ (ఆర్ & ఆర్) ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా కూడా పని చేశారు. శ్రీమతి అల్కా అరోరా నేవీలో వివిధ హోదాలలో పని చేశారు.
నావల్ డాక్‌యార్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గాను, ముంబయి జాయింట్ కంట్రోలర్ డిఫెన్స్ అకౌంట్స్‌గాను, కమాండ్ ఆర్మీ కోల్‌కతాకు ఎఫ్‌ఏగాను వివిధ హోదాల్లో పని చేశారు.
(Release ID: 1755798)
Visitor Counter : 191