నీతి ఆయోగ్
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డసాల్ట్ సిస్టమ్స్ భాగస్వామ్యం ఆవిష్కరణకు మరో ఊపునిస్తుంది
Posted On:
16 SEP 2021 2:26PM by PIB Hyderabad
అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎయిమ్) నీతి ఆయోగ్ డసాల్ట్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి సిద్ధంగా ఉంది.
ఈ విషయంలో భారతదేశంలో ఎయిమ్ ప్రోగ్రామ్‌లు మరియు ఎయిమ్ లబ్ధిదారుల ప్రస్తుత మరియు భవిష్యత్తు కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేందుకు వర్చువల్ ఈవెంట్‌లో ఈరోజు ఎయిమ్ మరియు డసాల్ట్ సిస్టమ్స్ మధ్య స్టేట్‌మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్‌ఓఐ) సంతకం చేయబడింది.
ఈ ఎస్‌ఓఐ కింద, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ( ఎటిఎల్‌లు), ఎయిమ్ ఇంక్యుబేటర్‌లు (ఎఐసీలులు మరియు ఈఐసీలు), అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్‌లు (ఎసిఐసి), అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ (ఎఎన్‌ఐసి) కింద మంజూరు చేసిన ఎయిమ్ లబ్ధిదారులకు స్మాల్ ఎంటర్‌ప్రైజ్ కోసం ఆవిష్కరణ (అరైజ్)కు దసో సిస్టమ్స్ మద్దతు ఇస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం సమాజంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి బహిరంగ ఆవిష్కరణ సహకారానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
దసో మరియు ఎయిమ్, నీతి ఆయోగ్ మధ్య జరిగిన ఈ ఎస్‌ఓఐ ఆరు అంశాలను కలిగి ఉంది. వీటిలో ఎంచుకున్న ఎయిమ్ స్టార్ట్ అప్‌లకు డసాల్ట్ సిస్టమ్స్ యొక్క 3డి ఎక్స్‌పీరియన్స్ ల్యాబ్ స్టార్ట్-అప్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ యాక్సెస్ ఉంటుంది; ఎంపికచేసిన ఎయిమ్ స్టార్ట్-అప్‌లకు వారి ఉత్పత్తుల సామర్ధ్యం పెంపొందించడానికి మార్గదర్శకత్వం; ఎంపికచేసిన ఎయిమ్ స్టార్ట్-అప్‌లకు 3డి ఎక్స్‌పీరియన్స్ ల్యాబ్ సంబంధిత గ్లోబల్ కమ్యూనిటీ యాక్సెస్; ఎంపికచేసిన ఎయిమ్ స్టార్ట్-అప్‌లకు డస్సాల్ట్ సిస్టమ్స్ ప్రపంచవ్యాప్త కస్టమర్లు, భాగస్వాములు మరియు సాంకేతిక సహకారులు వర్తించేటప్పుడు పరిశ్రమతో కనెక్ట్ అవుతుంది; డస్సాల్ట్ సిస్టమ్స్ జాతీయ మరియు ప్రపంచ ఈవెంట్‌లలో ఎంపిక చేసిన ఎయిమ్ స్టార్ట్-అప్‌ల భాగస్వామ్యం; ఎయిమ్ మరియు నీతి ఆయోగ్ నిర్వహించే ఉమ్మడి ఈవెంట్‌లు, హ్యాకథాన్‌లు.
ఎయిమ్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ " డస్సాల్ట్‌తో భాగస్వామ్యం అనేది విన్-విన్ పార్ట్‌నర్‌షిప్ అని మరియు లబ్ధిదారులందరికి దేశంలో ఎయిమ్‌కు చెందిన విస్తరిస్తున్న పర్యావరణ వ్యవస్థకు ప్రాధాన్యతనిస్తుందని" అన్నారు.
"ఎంపిక చేసిన భారతీయ స్టార్టప్‌లకు ఈ చొరవ కొత్త అవకాశాలను అందిస్తుంది. ఎందుకంటే వారు డస్సాల్ట్ సిస్టమ్స్ గ్లోబల్ స్టార్ట్ అప్ ఎకోసిస్టమ్- వారి యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌కి మరియు తోటివారు, ఇండస్ట్రీ నిపుణులు, ఇంజనీర్లు, డిజైనర్‌లతో కనెక్ట్ అయ్యే అవకాశం మరియు 3డీ ఎక్స్‌పీరియన్స్ ల్యాబ్‌లో భాగమయ్యారు. స్టార్టప్‌లను వేగవంతం చేయగల సామర్థ్యం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజంతో నేను చాలా సంతోషిస్తున్నానని ”అన్నారాయన.
డస్సాల్ట్ సిస్టమ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ ఎన్‌జీ తన అభిప్రాయాలను పంచుకుంటూ " ఎయిమ్‌తో భాగస్వామ్యం అనేది దేశంలో మేకర్స్, ఇన్నోవేటర్‌ల పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి డసాల్ట్ యొక్క నిబద్ధతను బలోపేతం చేసే దీర్ఘకాలిక సంబంధానికి నాంది" అని చెప్పారు.
"ఎయిమ్‌తో మా భాగస్వామ్యం స్టార్టప్‌లకు సాంకేతికత, పరిశ్రమ ఉత్తమ పద్ధతులు మరియు ప్రభుత్వం నడిచే విధానాలను ఎలా ప్రభావితం చేయగలవు అనే మా ఉమ్మడి లక్ష్యాలపై మరింత బలోపేతం చేస్తుంది," అని ఆయన అన్నారు, "మా 3డి ఎక్స్‌పీరియన్స్ ల్యాబ్ కొత్త డొమైన్‌లలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌ల కోసం టెక్నాలజీ మరియు కమ్యూనిటీని అందిస్తుంది ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు మరియు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వైద్య పరికరాలు, ఎనర్జీ & మెటీరియల్స్ రంగం మరియు భవిష్యత్తులో పరిశ్రమ కోసం స్థిరమైన పరిష్కారాలను అందించే పొదుపు ఆవిష్కర్తలకు కూడా అది లభిస్తుందని ”అని చెప్పారు.
*****
(Release ID: 1755461)
Visitor Counter : 251