విద్యుత్తు మంత్రిత్వ శాఖ
భారత్‌కు చెందిన తొలి యూరో గ్రీన్ బాండ్‌ను విడుదల చేసిన పిఎఫ్‌సి
प्रविष्टि तिथि:
16 SEP 2021 12:58PM by PIB Hyderabad
విద్యుత్ రంగంలో ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సి అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పిఎఫ్‌సి) 13.09.2021న తొలి 7ఏళ్ళ యూరోబాండ్ ను విజయవంతంగా విడుదల చేసింది.
భారతీయ ఇష్యూయర్ యూరో మార్కెట్లలో సాధించిన 1.841% ధర అతి తక్కువ రాబడి.
భారతదేశం నుంచి మొదటిసారి యూరో విలువతో విడుదల చేసిన తొలి గ్రీన్ బాండ్ ఇది. అంతేకాక, భారతీయ ఎన్‌బిఎఫ్‌సి యూరోలో జారీ చేయడం ఇదే తొలిసారి కాగా, 2017 నుంచి భారత్ నుంచి విడుదలైన తొలి యూరో బాండ్.
ఈ బాండ్ ఆసియా, యూరోప్ లోని దాదాపు 82 అకౌంట్ల నుంచి వ్యవస్థాగత పెట్టుబడిదారుల బలమైన భాగస్వామ్యమే కాక 2.65 సార్లు ఒవర్ సబ్‌స్క్రైబ్ అయింది.
(रिलीज़ आईडी: 1755460)
आगंतुक पटल : 271