గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒక వారంలో 2614 ఎస్ హెచ్ జి వ్యవస్థాపకులకు

రూ. 8.60 కోట్ల కమ్యూనిటీ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ (సిఈఎఫ్) రుణం

ఎస్ హెచ్ జి వ్యవస్థాపకులకు వ్యవస్థాపకతపై ప్రారంభ శిక్షణ నిర్వహణ

Posted On: 15 SEP 2021 1:46PM by PIB Hyderabad

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ. 8.60 కోట్ల విలువైన కమ్యూనిటీ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ (సిఈఎఫ్) రుణాన్నివారం రోజుల్లో 2614 ఎస్ హెచ్ జి గ్రూపులకు అందించింది.  స్టార్ట్-అప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ కింద 19 రాష్ట్రాలలోని వారి గ్రామాల్లో వారి మైక్రో ఎంటర్‌ప్రైజ్‌లను ప్రారంభించడానికి రుణాలు అందించారు. అమృత్ మహోత్సవం సందర్భంగా, స్టార్ట్-అప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం (ఎస్విఈపి) కింద 6వ తేదీ నుండి 12 సెప్టెంబర్, 2021 వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఎస్విఈపి పథకం గురించి అవగాహన కల్పించడం మరియు గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ వ్యాపారాలను ప్రారంభించాలనుకునే ఎస్ హెచ్ జి సభ్యులకు ఇది ఎలా మద్దతు ఇస్తుంది అనే అంశాలపై దృష్టి పెడతారు. ఈ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు పాల్గొన్నారు.

ఈ కమ్యూనిటీ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ (సిఈఎఫ్) రుణాన్ని అందించడానికి ముందు,  ఎస్ హెచ్ జి  వ్యవస్థాపకులకు వ్యవస్థాపకతపై ప్రారంభ శిక్షణ ఇచ్చారు. వారి ప్రతిపాదిత వ్యాపారం  వివరణాత్మక వ్యాపార ప్రణాళిక తయారు చేశారు. 

ఈ చొరవలో పాల్గొన్న రాష్ట్రాలు - ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్. ఈ కార్యక్రమాల సమయంలో,  ఎస్ హెచ్ జి  వ్యవస్థాపకులు తమ అనుభవాలను మరియు తమ గ్రామాల్లో తమ సొంత వ్యాపారాలను ప్రారంభించి, వ్యాపారవేత్తలు మరియు స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం (ఎస్వీఈపి) కింద అందుకున్న వివిధ మద్దతులను పంచుకున్నారు. వ్యాపారం చేయడానికి దశలను అర్థం చేసుకోవడానికి, దానిని విజయవంతం చేయడానికి, బలమైన మార్కెట్ అనుసంధానాలను ఏర్పరుచుకోడానికి రెగ్యులర్ హ్యాండ్‌హోల్డింగ్ బలాన్ని కూడా వారు నొక్కి చెప్పారు.

స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ ( ఎస్వీఈపి) అనేది గ్రామీణ ప్రాంతాలలో వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఎన్ఆర్ఎల్ఎం కింద ఒక ఉప పథకం.ఎస్విఈపి  బ్లాక్‌లో ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం పర్యావరణ వ్యవస్థను ఏర్పరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్-ఎంటర్‌ప్రైజ్ ప్రమోషన్ (సిఆర్పి-ఈపి) క్యాడర్ ఉంటుంది, వారు వ్యాపారవేత్తలకు వ్యాపార మద్దతు సేవలను అందిస్తారు. ఈ పథకం వ్యాపార ఆలోచనలను గుర్తించడం, వ్యాపార ప్రణాళికల తయారీ, రుణాలు పొందడం మరియు మార్కెటింగ్, ఖాతాలను నిర్వహించడం, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం వంటి ఇతర మద్దతులను కలిగి ఉంటుంది. ఇంకా, పర్యావరణ వ్యవస్థలో పారిశ్రామికవేత్తల శిక్షణ, సామర్ధ్యాన్ని పెంపొందించడం, ఎంటర్‌ప్రైజ్‌లను ప్రారంభించడానికి మూలధనం, ఉత్పత్తులు, సేవలకు మార్కెటింగ్ మద్దతు మొదలైనవి ఉన్నాయి, బ్లాక్ రిసోర్స్ సెంటర్ (బిఆర్సి), ఎంటర్‌ప్రైజ్ ప్రమోషన్ కోసం సింగిల్ పాయింట్ పరిష్కారం కూడా పర్యావరణ వ్యవస్థలో భాగంగా అభివృద్ధి చేశారు.  

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001E9WG.jpg

 

ఉత్తర ప్రదేశ్ లోని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రాజేంద్ర ప్రతాప్ సింగ్ ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలోని సేవాపురి బ్లాక్ లో ఎస్విఈపి బిఆర్సి కార్యాలయాన్ని ప్రారంభించారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XWMW.jpg

 

ఉత్తర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రాజేంద్ర ప్రతాప్ సింగ్ ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలోని సేవాపురి బ్లాక్‌లో ఎంటర్‌ప్రైజ్ కోసం సిఈఎఫ్ రుణం చెక్కును అందించారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0036KIA.jpg

 

రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలోని అంతహ్ బ్లాక్‌లో ఎంటర్‌ప్రైజ్, సిఈఎఫ్ రుణం చెక్కును అందుకుంది

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004VDT4.jpg

 

 మిజోరాంలోని కొలసిబ్ ఎస్‌విఇపి బ్లాక్‌లో ఎంటర్‌ప్రైజ్, సిఇఎఫ్ రుణం చెక్ అందుకుంది

******



(Release ID: 1755304) Visitor Counter : 215