జల శక్తి మంత్రిత్వ శాఖ

కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన సమావేశం కానున్న 8 ఈశాన్య రాష్ట్రాల పీహెచ్ఈడి మంత్రులు


రాష్ట్రాల్లో జల్ జీవన్ మిషన్ ను సంపూర్ణంగా, వేగంగా అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలను చర్చించనున్న సమావేశం

ఈశాన్య ప్రాంత అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం

2021-22 లో జీజేఎం అమలుకు 8 రాష్ట్రాలకు కేంద్ర గ్రాంటుగా 9,262 కోట్ల రూపాయల కేటాయింపు

Posted On: 15 SEP 2021 1:50PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంతంలో జల్ జీవన్ మిషన్ అమలు జరుగుతున్న తీరును సమీక్షించడానికి   నెల 16వ తేదీన  కేంద్ర జల్ శక్తి శాఖ  మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఎనిమిది  ఈశాన్య రాష్ట్రాల ప్రజారోగ్య  ఇంజనీరింగ్ విభాగం (పీహెచ్ఈడి) మంత్రులు సమావేశం కానున్నారు. గౌహతిలోని అస్సాం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ లో జరిగే ఈ సమావేశానికి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖల ఇంచార్జి  మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల సీనియర్ అధికారులు హాజరవుతారు.

ఈశాన్య రాష్ట్రాల్లో జల్ జీవన్ మిషన్ అమలు జరుగుతున్న తీరుసు సమీక్షించి ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరును సరఫరా చేయడానికి అమలు చేయాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చిస్తారు. కోవిడ్-19కు అనుగుణంగా జరిగే ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సమావేశ వివరాలను   ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి  కార్యక్రమాన్ని అమలు చేయడంతో సంబంధం ఉన్న చీఫ్/ ఎగ్జిక్యూటివ్/ అసిస్టెంట్/ జూనియర్ ఇంజనీర్లు తగిన కార్యాచరణను రూపొందించుకోవడానికి అవకాశం కలుగుతుంది. 

2024 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు కొళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను రూపొందించింది. తాగునీరు, పారిశుద్ధ్య శాఖ దీనిని అమలు చేస్తున్నది. ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో  పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన నిధులలో 90% నిధులను కేంద్రం మిగిలిన 10% నిధులను రాష్ట్రాలు సమకూరుస్తున్నాయి. 

ఈశాన్య ప్రాంతాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా చూడడానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా, జల్ జీవన్ మిషన్ అమలుకు కేంద్రం తన వాటాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9,262 కోట్ల రూపాయలను గ్రాంటుగా విడుదల చేసింది. నిధులు లభ్యత పెరగడంతో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేసే కార్యక్రమం వేగంగా అమలు జరగడానికి అవకాశం కలుగుతుంది. దీనితో ఈ ప్రాంత ఆర్థిక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. 

మంత్రుల సమావేశంలో జల్ జీవన్ మిషన్ వ్యూహం, ప్రణాళికఇప్పటి వరకు సాధించిన పురోగతినిర్ణీత సమయంలో లక్ష్యాన్ని సాధించడానికి అమలు వేగాన్ని పెంచే మార్గాలుమొదలైన అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును ఈశాన్య రాష్ట్రాల మంత్రులతో కేంద్ర జల్ శక్తి మంత్రి చర్చించి ఈశాన్య ప్రాంతంలో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరు అందించడానికి తీసుకోవలసిన చర్యలపై ఆయన తగిన సూచనలను ఇస్తారు. 

--జల్ జీవన్ మిషన్ ప్రారంభం కావడానికి ముందు ఈశాన్య ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 90.14 లక్షల గృహాల్లో  2.83 లక్షల గృహాలు (3.13%) మాత్రమే కొళాయి కనెక్షన్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఖ్య దాదాపు 22 లక్షలకు (24.45%) చేరింది. కోవిడ్-19 వల్ల ఏర్పడిన పరిస్థితి/ లాక్ డౌన్లు ఇతర ఆటంకాలను అధిగమిస్తూ గత 24 నెలల్లో    20 లక్షల గృహాలకు కొళాయి కనెక్షన్లను అందించారు. 2022 నాటికి హర్ ఘర్ జల్ గుర్తింపును పొందాలని మేఘాలయమణిపూర్ సిక్కిం రాష్ట్రాలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్,  మిజోరాంనాగాలాండ్త్రిపుర  రాష్ట్రాలు  2023 నాటికి , 2024 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని అస్సాం కార్యాచరణ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. 

 

 అంగన్‌వాడీ కేంద్రాలుఆశ్రమశాలలు మరియు పాఠశాలలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయడానికి  2 వ అక్టోబర్, 2020 న కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాగునీరు, మధ్యాహ్న భోజన అవసరాలు, చేతులు శుభ్రం చేసుకోవడం, మరగుదొడ్ల అవసరాల కోసం నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న  మొత్తం 72 వేల పాఠశాలల్లోప్రస్తుతం 40 వేల (56%) పాఠశాలలకు కొళాయి ద్వారా నీరు సరఫరా అవుతోంది.  70 వేల అంగన్వాడీ కేంద్రాల్లో  27,474 (39%) కొళాయిలను నెలకొల్పారు.   సిక్కింలో అన్ని పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. 

నీటి సరఫరా పథకం రూపకల్పన,  అమలు, నిర్వహణ కార్యక్రమాలలో ప్రజలను భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో పథకం అమలు జరుగుతున్నది. దీనితో జల్ జీవన్ మిషన్ లో  గ్రామ నీరు ,పారిశుద్ధ్య కమిటీలు / పానీ సమితులు , గ్రామ స్థాయిలో కార్యాచరణ కార్యక్రమాల రూపకల్పన, ఆమోదం వంటి కార్యకలాపాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.  నీటి సరఫరా మౌలిక సదుపాయాలు, బూడిద నీటి శుద్ధి  పునర్వినియోగం, గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణ కోసం సిబ్బందిని సిద్ధం చేయడానికి  రాష్ట్రాలు శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి, ప్రతి గ్రామంలో 5 మంది మహిళలకు నీటి నాణ్యత పర్యవేక్షణ మరియు స్థానిక వ్యక్తులు తాపీ మేస్త్రీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మోటార్ మెకానిక్స్, ఫిట్టర్, పంప్ ఆపరేటర్లు గా విధులు నిర్వర్తించేలా చూడడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 

https://jalshakti-ddws.gov.in/sites/default/files/15th-August-banner2.jpg

నీటి సరఫరా, పారిశుద్ధ్య అంశాలకు  ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం తో  15 వ ఆర్థిక సంఘం   2021-22లో తాగునీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ మరియు నీటి రీసైక్లింగ్ కోసం 26,940 కోట్ల రూపాయలను  ఆర్‌ఎల్‌బిలు/ పిఆర్‌ఐలకు గ్రాంట్లుగా విడుదల చేసింది.  2021-22 నుంచి 2025-26 వరకు 5 సంవత్సరాలకు 1.42 లక్షల కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉంటాయి. జేజేఎం  కింది లభిస్తున్న నిధులకు అదనంగా ఇవి అందుబాటులో ఉంటాయి.  గ్రామీణ స్థానిక సంస్థలు వర్షపు నీటి సేకరణతాగునీటి వనరులను బలోపేతం చేయడంనీటి సరఫరాను మెరుగుపరచడంబూడిద నీటి నిర్వహణ మరియు రెగ్యులర్ ఆపరేషన్  నిర్వహణ లాంటి వివిధ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా ఈ గ్రాంట్‌ని న్యాయబద్ధంగా ఉపయోగించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

గ్రామంలో నీటి సరఫరా పరిమాణం, నాణ్యత, ఒత్తిడి మరియు క్రమబద్ధత కొలవడానికి సెన్సార్ ఆధారిత  వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.  జల్ జీవన్ మిషన్ డాష్‌బోర్డ్ గ్రామ స్థాయి వరకు సమాచారాన్ని అందిస్తుంది.  మిషన్ కింద  గ్రామీణ గృహాలతో పాటు ప్రతి పాఠశాలఅంగన్వాడీ కేంద్రాలుప్రజారోగ్య కేంద్రాలు,  కమ్యూనిటీ కేంద్రాలు మొదలైన వాటికి కూడా కొళాయి ద్వారా నీరు సరఫరా చేసి ప్రతి ఒక్కరిని మిషన్ పరిధిలోకి తీసుకుని రావాలని నిర్ణయించారు.  కష్టమైన మరియు సవాలు ప్రాంతాలలో గురుత్వాకర్షణ ఆధారిత నీటి సరఫరా వ్యవస్థకు  ప్రాధాన్యత ఇస్తూ తక్కువ  ఖర్చుతో అమలు చేస్తున్నారు. దీని నిర్వహణ సులువుగా కూడా ఉంటుంది. 

 

https://jalshakti-ddws.gov.in/sites/default/files/jjmbanner1.jpg

 గ్రామీణ ప్రాంతాలలో జీవన నాణ్యతను మెరుగుపరచి  ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 15 ఆగస్టు2019 న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జల్ జీవన్ మిషన్ ను  ప్రకటించారు. ప్రతి కుటుంబంలో నీరు తేవడం అనేది మహిళలు మరియు బాలికల  బాధ్యత గా మారింది. దీనివల్ల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తున్నది. ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీరు సరఫరా అయితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి.  ఇది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 'సబ్‌కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్'అన్న  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నినాదాన్ని  ముందుకు వెళ్తున్నది. 

 

***(Release ID: 1755245) Visitor Counter : 133