పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గౌహతిలో విజయవంతంగా ముగిసిన ఈశాన్య రాష్ట్రాల పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రుల రెండు రోజుల సమావేశం

Posted On: 14 SEP 2021 6:03PM by PIB Hyderabad

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గౌహతిలో నిర్వహించిన  ఈశాన్య రాష్ట్రాల పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రుల రెండు రోజుల సమావేశం ఈరోజు విజయవంతంగా ముగిసింది.  ఈ సమావేశాన్ని నిన్న కేంద్ర పర్యాటకసాంస్కృతిక, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మలు  ప్రారంభించారు.

కేంద్ర సాంస్కృతిక మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్కేంద్ర పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ కూడా ప్రారంభ సమావేశానికి హాజరయ్యారు.

కేంద్ర  పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ రెండు రోజుల సదస్సులో రెండవ రోజున  పాల్గొని ప్రసంగించారు.  కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న  అనేక ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలను సదస్సులో వివరించామని ఆయన తెలిపారు. సదస్సు విజయవంతమైందని అన్నారు.  ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు అనేక ప్రత్యేక, విభిన్న  కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నాయని అన్నారు. సదస్సులో పాల్గొన్న రాష్ట్రాలు తమ అనుభవాలను ఇతర రాష్ట్రాలతో పంచుకున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు  ప్రోత్సాహకరంగా ఉందని  ఆయన అన్నారు.

 స్వదేశ్ దర్శన్ మరియు ప్రసాద్ పథకం కింద మంజూరు అయిన పథకాల పురోగతిపై సదస్సు రెండవ రోజున ప్రధానంగా చర్చలు జరిగాయి. 

స్వదేశ దర్శన్ పథకం కిందపర్యాటక శాఖ థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్‌ల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించిందని పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ రూపేందర్ బ్రార్ తెలిపారు.   మంత్రిత్వ శాఖ ఈశాన్య ప్రాంతంలో 16 ప్రాజెక్టులను మంజూరు చేసిందని చెప్పారు.  ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాలువసతులునైపుణ్యాల అభివృద్ధికి  మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని ఆమె తెలిపారు.  పర్యాటక మంత్రిత్వ శాఖ ఈశాన్య ప్రాంతానికి  వివిధ పథకాలు మరియు ప్రధాన కార్యక్రమాల ద్వారా బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ సహాయాన్ని కూడా ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు అందిస్తుందని అన్నారు. 

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ రాకేశ్ కుమార్ వర్మ మరియు ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు కూడా సదస్సులో పాల్గొన్నారు.

***


(Release ID: 1754897) Visitor Counter : 181