ఆర్థిక మంత్రిత్వ శాఖ
2021-22 మొదటి త్రైమాసికంలో మూలధన వ్యయ లక్ష్యాలను చేరుకున్న 11 రాష్ట్రాలు
అదనంగా 15,721 కోట్ల రూపాయలు సమకూర్చుకునేందుకు అనుమతి
Posted On:
14 SEP 2021 11:04AM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌ఘడ్, హర్యానా,కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ , రాజస్థాన్,
ఉత్తరాఖండ్ వంటి 11 రాష్ట్రాలు 2021-22 సంవత్సరం మొదటి త్రైమాసికానికి నిర్దేసించిన మూలధన లక్ష్యాలను చేరుకున్నాయి.
ఇందుకు ప్రోత్సాహకంగా ఈ రాష్ట్రాలకు అదనంగా 15, 721 కోట్ల రూపాయలు సమకూర్చుకునేందుకు వ్యయవిభాగం అనుమతి మంజూరు చేసింది. అదనపు ఓపెన్ మార్కెట్ రుణ అనుమతి మంజూరు, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో 0.25 శాతానికి సమానం.అదనంగా అందుబాటులోకి వచ్చే నిధులు రాస్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని మరింతగా పెంచుకునేందుకు దోహదపడతాయి. రాష్ట్రాల వారీగా అదనపు రుణసేకరణకు అనుమతికి సంబంధించి దీనితో జతచేయడమైనది.
మూలధన వ్యయానికి ఎన్నో రెట్ల ప్రభావం ఉంటుంది. ఇది ఆర్ధిక వ్యవస్థ భవిష్యత్ ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచుతుంది. అలాగే ఎక్కువ ఆర్ధిక రేటు ఆర్ధిక ప్రగతికి వీలు కలుగుతుంది. ఆ విధంగా, నికర రుణ సీలింగ్ (ఎన్‌బిసి) 2021-22లో రాష్ట్రాల జిఎస్‌డిపిలో 4 శాతంగా ఉంది. జిఎస్‌డిపిలో 0.50 శాతాన్ని 2021-22 లో రాష్ట్రాలు ఇంక్రిమెంటల్ మూల ధన వ్యవయానికి కేటాయించాయి. ఇంక్రిమెంటల్ రుణ సమీకరణకు అర్హతకు సంబంధించి, ఇంక్రిమెంటల్ మూల ధన లక్ష్యాన్ని డిపార్టమెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ నిర్ణయించింది.
ఇంక్రిమెంటల్ రుణ సేకరణకు అర్హత సంపాదించాలంటే, రాష్ట్రాలు, 2021-22 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 15 శాతాన్ని 2021-22 మొదటి త్రైమాసికానికి , 45 శాతం రెండో త్రైమాసికానికి, మూడో త్రైమాసికానికి 70 శాతం, 2022 మార్చి 31 నాటికి మూలధన వ్యయ లక్ష్యాలను నూరుశాతం సాధించాల్సి ఉంది.
రాష్ట్రాల తదుపరి మూలధన వ్యయ సమీక్షను వ్యయవిభాగం 2021 డిసెంబర్‌లో చేపడుతుంది. ఈ రౌండ్‌లో రాష్ట్రాలు సాధించిన మూలధన వ్యయాన్ని 2021 సెప్టెంబర్ 30న అంచనా వేస్తారు. మూడో సమీక్ష 2022 లో జరుగుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాలలో అవి ఖర్చుచేసిన మూలధన వ్యయం ఆధారంగా మూడో సమీక్షను 2022 మార్చి లో నిర్వహిస్తారు.
మూలధన వ్యయంతో అనుసంధానమైన రుణాల సీలింగ్ జిఎస్‌డిపిలో 0.50 శాతాన్ని, 2021 సెప్టెంబర్ 30 నాటికి నిర్దేశిత లక్ష్యంలో 45 శాతం మూలధన వ్యయం సాధించిన రాష్ట్రాలకు అనుమతిస్తారు. లేదా 2021 డిసెంబర్ 31 నాటికి 70 శాతం లక్ష్యం సాధించిన వాటికి అనుమతిస్తారు.
2022 జూన్ నెలలో వాస్తవ మూలధన వ్యయం తుది సమీక్ష ఉంటుంది. , 2021-22 సంవత్సరానికి ఏదైనా రాష్ట్రంలో లక్షిత మూలధన వ్యయంలో ఏదైనా తరుగుదల, లోటు ఉన్నట్టయితే, 2022-23 సంవత్సరానికి సంబంధించిన రుణ సీలింగ్‌లో సర్దుబాటు చేస్తారు.
అనుమతించిన అదనపు రుణం రాష్ట్రాలవారీగా కిందివిధంగా ఉంది.
క్రమసంఖ్య .
|
రాష్ట్రం
|
మొత్తం కోట్ల రూ.లలో
|
1.
|
ఆంధ్రప్రదేశ్
|
2,655
|
2.
|
బీహార్
|
1,699
|
3.
|
చత్తీస్‌ఘడ్
|
895
|
4.
|
హర్యానా
|
2,105
|
5.
|
కేరళ
|
2,255
|
6.
|
మధ్యప్రదేశ్
|
2,590
|
7.
|
మణిపూర్
|
90
|
8.
|
మేఘాలయ
|
96
|
9.
|
నాగాలాండ్
|
89
|
10.
|
రాజస్థాన్
|
2,593
|
11.
|
ఉత్తరాఖండ్
|
654
|
***
(Release ID: 1754807)
Visitor Counter : 255