రక్షణ మంత్రిత్వ శాఖ
భారత వైమానిక దళం కోం 56 సి- 295 ఎండబ్ల్యు రవాణా విమానాలను సమీకరించుకునేందుకు కేబినెట్ ఆమోదం ఆత్మ నిర్భర్ భారత్‌కు గొప్ప శక్తినివ్వనుంది.
Posted On:
08 SEP 2021 6:27PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
ప్లైవే కండిషన్‌లో స్పెయిన్ నుంచి 16 విమానాలు మన దేశానికి అందించనున్నారు.
40 విమానాలను ఇండియాలోనే తయారు చేయనున్నారు.
దేశీయ సామర్ధ్యాలను పెంపొందించేందుకు, మేక్ ఇన్ ఇండియాకు ఇది పెద్ద ఊతం ఇవ్వనుంది.
అన్ని విమానాలు దేశీయ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌లను కలిగి ఉండనున్నాయి.
వయసుపైడిన ఆవ్రో ఎయిర్‌క్రాఫ్ట్ ల స్థానంలో ఐఎఎఫ్‌కు ఇవి అందుబాటులోకి వస్తాయి.
రవాణా విమానం 5 నుంచి 10 టన్నుల సామర్ధ్యంతో సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది.
కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు 56 సి-295 ఎం.డబ్ల్యు రవాణా విమానాలను మెస్సర్స్ ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఎస్.ఎ, స్పెయిన్‌నుంచి భారత వైమానికదళం సమకూర్చుకునేందుకు ఆమోదం తెలిపింది. సి-295 ఎం.డబ్ల్యు రవాణా విమానాలు 5 నుంచి 10 టన్నుల సామర్ధ్యం కలిగి ఉండి సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటాయి. ఇది వయసుపైబడిన ఆవ్రో ఎయిర్‌క్రాఫ్ట్ స్థానంలో ఐఎఎఫ్‌కు అందుబాటులోకి వస్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లకు వెనుకవైపు ర్యాంప్ డోర్ ఉంటుంది. బలగాలు వెంటనే దిగడానికి, కార్గోను దించడానికి ఇది అనువుగా ఉంటుంది.
ఇందులో 16 విమానాలను వెంటనే ఉపయోగించడానికి వీలైన పద్ధతిలో స్పెయిన్ నుంచి పంపుతారు.వీటిని కాంట్రాక్టు కుదిరిన 48 నెలల్లో అందజేస్తారు. 40 ఎయిర్ క్రాఫ్ట్‌లను టాటా కన్సార్టియం కాంట్రాక్టు కుదిరిన పది సంవత్సరాలలోగా ఇండియాలోనే తయారు చేస్తుంది. వైమానిక ఎయిర్ క్రాఫ్ట్‌లు దేశంలో ఒక ప్రైవేటు కంపెనీలో తయారు చేయనున్న తొలి ప్రాజెక్టు ఇంది. అన్ని56 వినాలకు దేశీయ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ను అమరుస్తారు. ఈ ప్రాజెక్టు దేశంలో ఎయిరోస్పేస్ వాతావరణానికి మరింత ఊపు నిస్తుంది .అలాగే, దేశవ్యాప్తంగా గల పలు ఎం.ఎస్.ఎం.ఇలను ఈ ఎయిర్ క్రాఫ్ట్ ల తయారీలో భాగస్వాములను చేయనున్నారు..
ఈ కార్యక్రమం, భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్‌కు మంచి ప్రోత్సాహం ఇవ్వనుంది. ఇది ప్రైవేటు రంగానికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అత్యంత పోటీ కలిగిన వైమానక రంగం, తీవ్ర సాంకేతికతతో కూడిన ఈ రంగంలో అడుగుపెట్టేందుకు వాటికి అవకాశం కలుగుతుంది. ఈ ప్రాజెక్టువల్ల దేశీయంగా విమాన తయారీ రంగ ప్రాజెక్టులకు ప్రోత్సాహం లభిస్తుంది. దేశీయంగా తయారు అవుతుండడంతో దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. అలాగే ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.
ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీలో ఉపయోగించే చాలావరకు విడిభాగాలు, ఉప అసెంబ్లింగ్‌లు, ఎయిరో స్ట్రక్చర్‌కు సంబంధించిని అసెంబ్లింగ్‌లు దేశంలోనే తయారు కానున్నాయి. ఈ కార్యక్రమంతో విమానతయారీ రంగంలో 600 అత్యంత నైపుణ్యంగల ఉద్యోగాలు నేరుగాను, 3000 పరోక్ష ఉద్యోగాలు, అదనంగా 3000 మధ్యతరహా నైపుణ్యంగల ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 42.5 లక్షల పని గంటలు ఎయిరోస్పేస్, రక్షణ రంగానికి సంబంధించి ఏర్పడనున్నాయి. దీనివల్ల దేశంలో ప్రత్యేక మౌలిక సదుపాయాలైన హ్యాంగర్లు, భవనాలు, ఆప్రాన్లు, టాక్సీవేలు సమకూరనున్నాయ. దేశంలో తయారీ ప్రక్రియలో భాగంగా టాటా కన్సార్టియం కు చెందిన అందరు సరఫరాదారులు ప్రత్యేక ప్రాసస్‌లో భాగస్వాములను చేయడం జరుగుతుంది. దీనివల్ల వారు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నేషనల్ ఎయిరోస్పేస్, డిఫెన్స్ కాంట్రాక్టర్స్ అక్రిడేషన్ ప్రోగ్రాం (ఎన్ఎడిసి ఎపి) అక్రిడిసన్ పొందడానికి వీలు కలుగుతుంది.
ఎయిర్ క్రాఫ్ట్‌లను అప్పగించడానిఇకి ముందు, సి-295 ఎండబ్ల్యు ఎయిర్‌క్రాఫ్ట్లులకు డి లెవల్ సర్వీసింగ్ ఫెసిలిటి (ఎం.ఆర్.ఒ) ని ఇండియాలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సదుపాయం వివిధ సి-295 వేరియంట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ప్రాంతీయ ఎం.ఆర్.ఒ హబ్‌గా ఉంటుంది.
.దీనికి తోడు, ఒఇఎం కూడా అర్హతగల ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే భారతీయ భాగస్వాములనుంచి సేవలు పొందడానికి అవకాశం ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇస్తుంది.
ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం దేశీయంగా మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇచ్చేందుకు దేశీయ సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు.
***
(Release ID: 1753387)
Visitor Counter : 279