గనుల మంత్రిత్వ శాఖ

రష్యా కు చెందిన జాయింట్ స్టాక్ కంపెనీ రోస్ జియోలోజియా కు, భారతదేశం లోని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) కి మధ్య భూ-విజ్ఞానశాస్త్రం రంగం లో సహకారానికి సంబంధించిన ఒక ఒప్పంద పత్రం పై అవగాహన పూర్వకఒప్పంద పత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి 

Posted On: 08 SEP 2021 2:40PM by PIB Hyderabad

రష్యా కు చెందిన జాయింట్ స్టాక్ కంపెనీ రోస్ జియోలోజియా (స్టేట్ హోల్డింగ్ కంపెనీ .. దీనినే రోస్ జియో గా ప్రస్తావిస్తూ ఉంటారు; ఇది ష్యన్ ఫెడరేశన్ చట్టాల ప్రకారం నెలకొల్పినటువంటి ఒక చట్టబద్ధ ఎన్ టిటీ) కి, భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ఆధీనం లోని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) కి మధ్య భూ- విజ్ఞానశాస్త్రం రంగం లో సహకారానికి సంబంధించిన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పైన సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది.

ఈ అవగాహన పూర్వక ఒప్పంద పత్రం ముఖ్య ఉద్దేశ్యాల లో భూ- విజ్ఞాన రంగం లో ఇరు పక్షాల కు మధ్య లోతయిన మరియు /లేదా దాగి ఉన్న ఖనిజ నిక్షేపాల అన్వేషణ లో సాంకేతిక సహకారం; ఎరో-జియోఫిజికల్ డేటా విశ్లేషణ; పిజిఇ మరియు ఆర్ఇఇ ల అన్వేషణ, పరిశోధన; రష్యా కు చెందిన అత్యంత ఆధునిక సమాచార సాంకేతిక విజ్ఞానం అండ దండల తో ఇండియన్ జియో సైన్స్ డేటా రిపాజిటరి ని సంయుక్తం గా అభివృద్ధి పరచడం; డేటా పరమైన ఖచ్చితత్వాన్ని సాధించడం తో పాటు అధికతమ వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడం కోసం తవ్వకాలు, నమూనా ల రూపకల్పన, ఇంకా ప్రయోగశాల స్థాయి విశ్లేషణ ల రంగం లో జ్ఞానాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం, భూ- విజ్ఞాన శాస్త్రంతో జతపడ్డ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది వంటి వారి కి శిక్షణ ను ఇవ్వడం, సామర్థ్య నిర్మాణం రంగం లో పరస్పర సహకారాన్ని విస్తరించుకోవడం వంటివి భాగం గా ఉన్నాయి.

రోస్ద జియో, జిఎస్ఐ ల అపార అనుభవం, వాటి మధ్య గల పరస్పర సహకారం తాలూకు సామర్థ్యాన్ని దృష్టి లో పెట్టుకొంటే, ఈ అవగాహన పూర్వక ఒప్పంద పత్రం భూ- విజ్ఞాన రంగం లో జిఎస్ఐ కి, రోస్ జియో కు మధ్య సహకారానికి ఒక విస్తృతమైన ఫ్రేమ్ వర్క్ ను అందించే కోణం లో గొప్ప ప్రయోజనకారి గా ఉండగలదు.

పూర్వరంగం:

రోస్ జియోలోజియో (రోస్ జియో) రష్యన్ ఫెడరేశన్ లోకెల్లా అతి పెద్దదైనటువంటి జియలాజికల్ స్టేట్ హోల్డింగ్ కంపెనీ గా పేరుతెచ్చుకొంది. ఈ కంపెనీ కి వృత్తిపరం గా ఉన్నత శ్రేణి దక్షతల కు తోడు భూ- విజ్ఞాన సంబంధి సమాచారం తాలూకు సంచయం, అరుదైన సంభావన ల సత్తా కూడా ఉంది. ఈ కంపెనీ అన్ని రకాలైన ఖనిజ వనరుల అన్వేషణ కార్యకలాపాల ను జరుపుతూ ఉంటుంది. వాటి లో.. ప్రాంతీయ సర్వేక్షణ ల మొదలు నిలవల ను అంచనా వేయడం, ఆయా క్షేత్రాల లో గని తవ్వకాల పనుల ను ప్రారంభించడం వంటి భూవైనిక పూర్వేక్షణ మరియు అన్వేషణ సంబంధి కార్యకలాపాల నిర్వహణ వరకు భాగం గా ఉన్నాయి. ఈ కంపెనీ సముద్ర తీరాని కి ఆవల భూ విజ్ఞాన సంబంధ కార్యకలాపాలు, ఆన్-శెల్ఫ్ నిర్వహణ రంగం లో అద్వితీయమైన యోగ్యత ఈ కంపెనీ కి సొంతం.

రోస్ జియో ప్రతినిధి వర్గం 2020వ సంవత్సరం లో భారతదేశాన్ని సందర్శించినప్పుడు, న్యూ ఢిల్లీ లో గనుల శాఖ తో, జిఎస్ఐ తో సమావేశమైంది. భూ- విజ్ఞాన శాస్త్ర రంగం లో సహకారానికి సంబంధించి జిఎస్ఐ కి, రోస్ జియో కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం పై సంకతాలు చేయాలని ఆ సమావేశం లో ప్రతిపాదించడం జరిగింది. ఆ ప్రతిపాదన కు అనుగుణం గా రోస్ జియో తో జిఎస్ఐ సంప్రదింపులు జరిపి, ఒక ముసాయిదా ఎమ్ఒయు కు తుది రూపు ను ఇచ్చింది.

 

***



(Release ID: 1753212) Visitor Counter : 149