విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పోర్చుగీస్ రిపబ్లిక్ లో పని చేయడానికి భారతీయ పౌరుల నియామకం అంశం పై పోర్చుగల్ కు, భారతదేశాని కి మధ్య ఒప్పందాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
प्रविष्टि तिथि:
08 SEP 2021 2:39PM by PIB Hyderabad
పోర్చుగీస్ రిపబ్లిక్ లో పని చేయడాని కి భారతదేశ పౌరుల నియామకం అంశం లో భారత గణతంత్ర ప్రభుత్వాని కి మరియు పోర్చుగల్ గణతంత్ర ప్రభుత్వాని కి మధ్య ఒక ఒప్పందం పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
వివరాలు:
భారతదేశ శ్రామికుల ను పంపించడానికి మరియు వారిని స్వీకరించడానికి భారతదేశాని కి, పోర్చుగల్ కు మధ్య భాగస్వామ్యం, సహకారం ల కోసం ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది.
అమలు తాలూకు వ్యూహం:
ఈ ఒప్పందం లో భాగం గా, ఈ ఒప్పందం అమలు లోకి వచ్చిన తరువాత అనుశీలన చర్యల ను చేపట్టడానికి ఒక సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ప్రభావం:
పోర్చుగల్ తో కలసి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల యూరోపియన్ యూనియన్ (ఇయు) లో సభ్యత్వం గల ఒక దేశం లో పని చేయడానికి భారతదేశ ప్రవాసీ శ్రామికుల కు ప్రత్యేకించి కోవిడ్-19 మహమ్మారి విజృంభణ అనంతరం చాలా మంది భారతీయ శ్రామికులు స్వదేశాని కి తిరిగి వచ్చిన నేపథ్యంలో, అవకాశాలు ఏర్పడగలవు. ఇది నైపుణ్యం కలిగిన భారతీయ శ్రామికుల కు, వృత్తి నిపుణుల కు కొత్త కొత్త అవకాశాల ను అందించ గలుగుతంది. ఈ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందంటే గనక, భారతీయ శ్రామికుల భర్తీ కోసం భారతదేశం, పోర్చుగల్ లు ఒక లాంఛనప్రాయమైన ఏర్పాటు ను చేసుకోగలుగుతాయి.
ప్రయోజనాలు:
పోర్చుగల్ లో పని చేయడానికి భారతీయ శ్రామికుల కు ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయి. ఒప్పందం లో ప్రస్తావించిన ప్రకారం ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య ఏర్పడే యంత్రాంగం ఇరు పక్షాల నుంచి గరిష్ఠ సమర్థన ద్వారా శ్రామికుల రాకపోక లు సాఫీ గా సాగేందుకు మార్గం సుగమం అవుతుంది.
***
(रिलीज़ आईडी: 1753210)
आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada