కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా పెట్టుబడిదారుల సాధికారత పై సెమినార్ నిర్వహించిన ఐఇపిఎఫ్ఎ- ఐసిఎస్ఐ
55,000ల కన్నా ఎక్కువ పెట్టుబడిదారుల అవగాహనా కర్యక్రమాలు నిర్వహించిన ఐఇపిఎఫ్ఎను కొనియాడిన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్‌జీత్ సింగ్
దాదాపు రూ.1,000 కోట్ల విలువైన మొత్తాలను, డివిడెండ్లను, మార్కెట్ షేర్లను రీఫండ్ చేసిన ఐఇపిఎఫ్ఎ - ఎంసిఎ కార్యదర్శి
Posted On:
07 SEP 2021 3:08PM by PIB Hyderabad
భారత దేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఎకెఎఎం) వేడుకలలో భాగంగా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఇపిఎఫ్ఎ), కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) మంగళవారం నాడు ఎంపవరింగ్ ఇన్వెస్టర్ ః ఐఇపిఎఫ్ఎ, జర్నీ ఆఫ్ 5 ఇయర్స్ అండ్ వే ఫార్వార్డ్ ( పెట్టుబడిదారులను శక్తిమంతం చేయడంః ఐఇపిఎఫ్ఎ 5 ఏళ్ళ ప్రయాణం, భవిష్యత్ ప్రయాణం) అన్న అంశంపై జాతీయ వెబినార్‌ను నిర్వహించారు. వెబినార్ సందర్భంగా ప్రజలలో పెట్టుబడిదారుల విద్య, చైతన్యాన్ని అందిస్తూ చేసిన 5 ఏళ్ళ ప్రయాణపు అనుభవాలను ఐఇపిఎఫ్ఎ పంచుకుంది.
ఈ కార్యక్రమానికి గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (ఇన్‌ఛార్జి) సహాయమంత్రి, కార్పిరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్‌జీత్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు ఐఇపిఎఫ్ఎకు శుభాకాంక్షలు చెప్తూ, ఐసిఎస్ఐ, ఐసిఎఐ, సిఎస్‌సి, ఇ-గవర్నెన్స్ వంటి పలు సంస్థలతో కలిసి ఐఇపిఎఫ్ ఎ 55వేల పెట్టుబడిదారులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం అద్భుతమైన విషయమని సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రత్యక్ష పెట్టుబడిదారి అవగాహనా కార్యక్రమాలు, మీడియా ప్రచారాలు, షార్ట్ ఫిల్మ్‌లు, ఇతర భాగస్వాములతో కలిసి గృహ పెట్టుబడిదారులు, గృహిణులు, ప్రొఫెషనల్స్ సహా భాగస్వాములందరిలో చైతన్యాన్ని తెచ్చేందుకు ఒక సంపూర్ణ విధానాన్ని ఐఇపిఎఫ్ ఎ అనుసరించిందన్నారు.
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్, ఆంక్షలు ఉన్నప్పటికీ, సోషల్ మీడియా, మాస్ మీడియా, రేడియో, ఐజిఎన్ఒయు గ్యాన్ దర్శన్ ఛానెల్ వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆర్ధిక విద్యను అందించడాన్ని ఐఇపిఎఫ్ఎ కొనసాగించిందని మంత్రి చెప్పారు. పెట్టుబడిదారుల అవగాహన, భద్రత కింద ప్రస్తుతం చేస్తున్న, చేయబోయే ప్రాంతాలలో ఐఇపిఎఫ్ఎ తన మంచి పనిని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని, ఆయన అన్నారు.
అనంతరం ప్రసంగించిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ వర్మ మాట్లాడుతూ, ఐఇపిఎఫ్ఎ ఐదేళ్ళ ప్రయాణాన్ని పంచుకోవడమే కాక, మొత్తాలను తిరిగి ఇవ్వడమే కాక, రూ. 1,000 కోట్ల విలువైన డివిడెండ్లను, మార్కెట్ షేర్లను అందించడంతో పాటుగా ఐఇపిఎఫ్ఎ పెట్టుబడిదారులకు సౌకర్యాన్ని అందించడానికి, ప్రజలకు దగ్గర కావడానికి అనేక పౌరులు కేంద్రంగా సాంకేతికత ఆధారంగా పలు కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ఐఇపిఎఫ్ఎ మొబైల్ ఆప్, ఐఇపిఎఫ్ పోర్టల్, హెల్ప్ లైన్ నెంబర్, కాల్ సెంటర్ల వంటివాటిని పెట్టుబడిదారులకు విద్య, అవగాహన దిశగా తీసుకున్న కొన్ని చర్యలు మాత్రమేనని ఆయన వివరించారు.
ఆర్థిక అక్షరాస్యత, విద్య అనేవి ఆర్థిక సంగ్రహణ, కలుపుకుపోయే వృద్ధికి కీలకమనే విషయాన్ని పట్టి చూపుతూ, ఐఇపిఎఫ్ అథారిటీ పలు భాగస్వామ్య సంస్థలైన ఐసిఎస్ఐ, ఐసిఎఐ, ఐసిఒఎ, సిఎస్‌సి ఇ గవర్నెన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐపిపిబి, ఎన్‌వైకెఎస్ తదితరులు సహకారంతో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పారు.
భారత ప్రభుత్వ ఈ భారీ చొరవలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నామని అంటూ, ఐసిఎస్ఐ అధ్యక్షుడు సిఎస్ నాగేంద్ర డి. రావ్ కార్పొరేట్ వ్యవహారల మంత్రిత్వ శాఖకు, ఐఇపిఎఫ్ అథారిటీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ నిర్మాణం కోసం ఉద్దేశించిన భారత ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ ఐసిఎస్ఐ తిరుగలేని మద్దతును అందిస్తోందనడానికి ఐఇపిఎఫ్ ఎతో అనుబధమే నిదర్శనమని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ను రూపొందించడంలో తమ ఇనిస్టిట్యూట్ ప్రతి అడుగలో అండగా ఉంటుందని ఇనిస్టిట్యూట్ హామీ ఇస్తోందన్నారు.
అథారిటీ చేపట్టిన చొరవలు, విజయాలను వివరించే ఐఇపిఎఫ్ఎ ఇ-న్యూస్‌లెటర్ ప్రారంభ సంచికను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.
ఎంపవరింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ఇంపార్టింగ్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఇన్ ది పాస్ట్ 5 ఇయర్స్ (గత 5 ఏళ్ళలో పెట్టుబడిదారులను సాధికారం చేయడం, పెట్టుబడిదారి విద్యను, అవగాహనను అందించడం), రోడ్ మ్యాప్ ఫర్ ఇన్వెస్టర్ అవేర్‌నెస్ అండ్ ప్రొటెక్షన్ టిల్ 2047 ( 2047 వరకు పెట్టుబడిదారుల అవగాహన, భద్రతకు రేఖా పటం) వంటి రెండు కీలక సాంకేతిక సెషన్లు నిర్వహించి, చర్చించిన ఐఇపిఎఫ్ఎ జాతీయ వెబినార్‌లో ఐఇపిఎఫ్ అథారిటీ సభ్యులు, ఐఐసిఎ.,ఎన్‌సిఇఎఆర్ రీసెర్చ్ చైర్లు, ప్రముఖ ప్యానెలిస్టులు, ఐఇపిఎఫ్ అథారిటీ, ఐసిఎస్ఐ సీనియర్ అధికారులు సహా పలువురు పాల్గొన్నారు.
***
(Release ID: 1752966)
Visitor Counter : 206