యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన జాతీయ క్రీడ‌ల అభివృద్ధి నిధికి 75 కోట్ల రూపాయ‌లు అంద‌జేసిన కోల్ ఇండియా లిమిటెడ్‌
బెంగ‌ళూరు, భోపాల్‌, ఎల్‌.ఎన్‌.ఐ.పి.ఇ గ్వాలియ‌ర్ ల‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అక‌డ‌మిక్స్ వ‌ద్ద అథ్లెట్ల‌కు హాస్ట‌ళ్ల నిర్మాణంః అనురాగ్ ఠాకూర్‌

ఇండియా క్రీడారంగ ప‌వ‌ర్‌హౌస్‌గా ఎదిగేందుకు పిఎస్‌యులు, కార్పొరేట్ సంస్థ‌లు, వ్య‌క్తులు ఎన్‌.ఎస్‌.డి.ఎఫ్‌కు నిధులు స‌మ‌కూర్చి ఇందులో భాగ‌స్వాములు కావాలి: అనురాగ్ ఠాకూర్‌

Posted On: 07 SEP 2021 1:54PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు.

 ఎస్‌.ఎ.ఐ, కోల్ ఇండియాలు సంయుక్తంగా స్పోర్ట్స్ అకాడ‌మీని ఏర్పాటు చేయాలి : అనురాగ్ ఠాకూర్‌

సిఐఎల్ స‌మ‌కూర్చిన నిధులను స‌రైన విధంగా ఖ‌ర్చుచేయ‌డం జ‌రుగుతుంది. అలాగే ప్రాజెక్టును నిర్ణీత కాల వ్య‌వ‌ధిలోగా పూర్తిచేయ‌డం జ‌రుగుతుంది.: శ్రీ నితిష్ ప్ర‌మాణిక్‌

కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల శాఖ‌కు చెందిన క్రీడావిభాగంలోని జాతీయ క్రీడా అభివృద్ధినిధి , కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌సింగ్ ఠాకూర్ స‌మ‌క్షంలో న్యూఢిల్లీలో ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్‌తో ఒక అవ‌గాహ‌నా ఒప్పందం కుదుర్చుకుంది. కార్పొరేట్ సామాజిక బాధ్య‌త‌లో భాగంగా ఎన్‌.ఎస్‌.డి.ఎఫ్ కింద సిఐఎల్ 75 కోట్ల రూపాయ‌లు స‌మ‌కూర్చ‌నుంది. యువ‌జ‌న స‌ర్వీసులు క్రీడ‌ల శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ నితిష్ ప్ర‌మాణిక్‌, క్రీడ‌ల విభాగం కార్య‌ద‌ర్శి శ్రీ ర‌వి మిత్త‌ల్‌, కోల్ ఇండియా  కు చెందిన ఇత‌ర అధికారులు ఈ కార్య‌క్ర‌మంలొ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ శ్రీ అనురాగ్ ఠాకూర్‌, ఇటీవ‌ల జ‌రిగిన ఒలింపిక్ క్రీడ‌లు, పారా ఒలింపిక్ క్రీడ‌ల‌లో క్రీడాకారులు అద్భుత ప్ర‌తిభ క‌నబ‌ర‌చిన నేప‌థ్యంలో  కోల్ ఇండియా ఎన్‌.ఎస్‌.డి.ఎఫ్ కు నిధులు స‌మ‌కూర్చ‌డం స‌రైన స‌మ‌యంలో అందిన స‌హాయం గా అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పారా ఒలింపిక్స్‌లో భార‌తీయ అథ్లెట్లు  అద్భుత ప‌నితీరును ప్ర‌ద‌ర్శించడం, టోక్యో పారా ఒలింపిక్స్ క్రీడ‌ల‌లో 19 మెడ‌ల్స్‌ను సాధించ‌డం ప‌ట్ల ఆయ‌న క్రీడాకారుల‌ను అభినందించారు. కోల్ ఇండియా చొర‌వ‌ను అభినందిస్తూ మంత్రి, బొగ్గు గ‌నుల ఆదాయం నుంచి వ‌చ్చిన నిధులు , మ‌న క్రీడాకారుల‌ను వ‌జ్రాల్లా త‌యారు చేసి వారి అద్భుత క్రీడాకారులుగా తీర్చి దిద్దేందుకు ఉప‌క‌రిస్తాయ‌న్నారు.

ఇందుకు సంబంధించి మ‌రిన్ని వివరాలు అందిస్తూ అనురాగ్ ఠాకూర్‌, ఈ నిధుల‌ను సాధార‌ణంగా క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి 

 జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిల‌లో ఆయా ప్ర‌త్యేక క్రీడ‌ల‌లో అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చేలా చేసేందుకు ఉప‌యోగించ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ నిధుల‌ను మౌలిక స‌దుపాయాల ఆధునీక‌ర‌ణ‌, అభివృద్ధికి వినియోగించ‌నున్న‌ట్టు తెలిపారు. గ‌త సంవ‌త్స‌రాల‌లో ఎన్‌.ఎస్‌.డి.ఎఫ్‌కు ఎన్నో పి.ఎస్‌.యులు నిధులు స‌మ‌కూర్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

“ ఎన్‌.ఎ.ఐ , ఎల్‌,ఎన్‌.ఐ.పి.ఇ ల‌కు చెందిన క్రీడా అకాడ‌మీలకు క్రీడాకారుల‌కు మ‌రింత ప్ర‌యోజనం క‌లిగించేందుకు మ‌రిన్ని హాస్ట‌ళ్లు అవ‌స‌రం. కోల్ ఇండియా లిమిటెడ్ క్ఈర‌డాకారుల కోసం  75 కోట్ల రూపాయ‌ల‌తో మూడు హాస్ట‌ళ్ల‌ను నిర్మించాల‌ని త‌ల‌పెట్ట‌డం వ‌ల్ల క్రీడాకారుల‌కు మ‌రిన్ని స‌దుపాయాలు అందుబాటులోకి వ‌స్తాయి .” అని ఠాకూర్ తెలిపారు.

బెంగ‌ళూరు , భోపాల్‌ల‌లోని ఎస్‌.ఎ.ఐ అక‌డ‌మిక్స్‌లో అలాగే గ్వాలియ‌ర్‌లోని ఎల్.ఎన్‌.ఐ.పి.ఇ ల‌లో మూడు హాస్ట‌ళ్ల నిర్మాణానికి ఎం.ఒ.యులు కుద‌ర‌డం, క్రీడ‌ల‌శాఖ‌, ఎన్ఎస్‌డిఎఫ్ కు కోల్ ఇండియా లిమిటెడ్ కు మధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని అన్నారు. స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా లిమిటెడ్ లు దేశంలో క్రీడ‌ల సంస్కృతిని మ‌రింత పెంపొందించేందుకు

దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు.

అన్ని పిఎస్‌యులు, కార్పొరేట్ సంస్థ‌లు, వ్య‌క్తులు ముందుకు వ‌చ్చి , కార్పొరేట్ సామాజిక బాధ్య‌త‌లో భాగంగా ఉదారంగా ఎన్‌.ఎస్‌డి.ఎఫ్ కు నిధులు స‌మ‌కూర్చాల‌ని శ్రీ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఇండియా క్రీడ‌ల‌ప‌వ‌ర్ హౌస్‌గా రూపుదిద్దుకోవ‌డంలో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ  శ్రీ నిశిత్ ప్రామాణిక్‌, కోల్ ఇండియా లిమిటెడ్‌, ఇండియాలో పోటీత‌త్వం తో కూడిన క్రీడ‌ల సంస్కృతిని పెంపొందింప చేసిన‌ట్టు తెలిపారు. సిఐఎల్ అందించిన నిధుల‌ను జాగ్ర‌త్త‌గా వినియోగించ‌డం జ‌రుగుతుంద‌ని, నిర్ణీత వ్య‌వ‌ధిలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయ‌డం జ‌ర‌గుతుంద‌ని చెప్పారు.

క్రీడ‌ల శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ ర‌వి మిట్ట‌ల్ మాట్లాడుతూ, ఈ అక‌డ‌మిక్ కేంద్రాల‌లో హాస్ట‌ళ్ల‌ను నిర్మించ‌డంవ‌ల్ల‌, జాతీయ స్థాయిలో కోచింగ్ క్యాంపుల‌ను ఈ మూడు ప్రాంతాల‌లో నిర్వ‌హించ‌డానికి వీలు క‌లుగుతుంద‌ని అన్నారు.ఎన్‌.ఎస్‌.డి.ఎఫ్‌కు భ‌విష్య‌త్తులో కూడా

 కోల్ ఇండియా మద్ద‌తు కొనసాగాల‌ని కోరారు.

ఎన్‌.ఎస్‌.డి.ఎఫ్ కు కంట్రిబ్యూష‌న్లు ప్ర‌ధానంగా పిఎస్‌యులు పిఎస్‌బిల‌నుంచి వ‌స్తోంది. 31-03-2021 నాటికి  170 కోట్ల రూపాయ‌ల‌ను కార్పొరేట్ సామాజిక బాధ్య‌తా నిధులు రాగా, భార‌త ప్ర‌భుత్వం కింద గ‌ల యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ మ్యాచింగ్ వాటాగా 164 కోట్ల రూపాయ‌ల‌ను స‌మ‌కూర్చింది.

ఈ నిధుల నుంచి మంత్రిత్వ‌శాఖ మౌలిక‌స‌దుపాయాల‌కు, క్రీడాకారుల‌కు అక‌డ‌మిక్ అసిస్టెన్స్ అందించేందుకు, ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చేందుకు  అలాగే టార్గెట్ ఒలింపిక్ పోడియం ప‌థ‌కం (టిఒపిఎస్‌) కింద క్రీడాకారుల కోసం స్పొర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు నిధులు స‌మ‌కూర్చ‌డానికి ఉప‌యోగిస్తారు.

***(Release ID: 1752905) Visitor Counter : 34