ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

68.75 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


97.44 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 38,948 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (4,04,874) 1.23 శాతం

వారపు పాజిటివిటీ రేటు (2.58 శాతం) గత 73 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 06 SEP 2021 9:40AM by PIB Hyderabad

దేశంలో కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 68.75 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 25,23,089 డోసులతో కలిపి, మొత్తంగా  68.75 కోట్ల డోసులను (68,75,41,762) టీకా కార్యక్రమం అధిగమించింది. 71,77,219 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

హెచ్‌సీడబ్ల్యూలు

మొదటి డోసు

1,03,60,805

రెండో డోసు

84,80,456

 

ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు

మొదటి డోసు

1,83,29,867

రెండో డోసు

1,35,76,562

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

27,17,37,284

రెండో డోసు

3,43,00,303

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

13,64,12,519

రెండో డోసు

5,80,07,647

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

8,95,41,322

రెండో డోసు

4,67,94,997

మొత్తం

68,75,41,762

 

దేశవ్యాప్తంగా టీకాల వేగాన్ని పెంచడానికి, పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

గత 24 గంటల్లో 43,903 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,21,81,995కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.44 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 71వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 38,948 కొత్త కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 4,04,874. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 1.23 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,10,649 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 53.14 కోట్లకుపైగా (53,14,68,867) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.58 శాతంగా ఉంది. గత 73 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 7 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా, 91 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****


(Release ID: 1752495) Visitor Counter : 198