ప్రధాన మంత్రి కార్యాలయం
వ్లాదివోస్తోక్ లో జరిగిన 6వ ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ 2021 లో వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
Posted On:
03 SEP 2021 2:45PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్లాదివోస్తోక్ లో ఈ రోజు న జరిగిన 6వ ఈస్టర్న్ ఇకనామిక్ ఫోరమ్ (ఇఇఎఫ్) సర్వ సభ్య సదస్సు లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. 2019వ సంవత్సరం లో జరిగిన ఇఇఎఫ్ 5వ సదస్సు లో ముఖ్య అతిథి గా ప్రధాన మంత్రి వ్యవహరించారు. ఇఇఎఫ్ సదస్సు లో భారతదేశ ప్రధాన మంత్రి ముఖ్య అతిథి గా వ్యవహరించడం అదే తొలి సారి.
రష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతాల అభివృద్ధి విషయం లో అధ్యక్షుడు శ్రీ పుతిన్ దార్శనికత ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ఈ విషయం లో భారతదేశం తన ‘యాక్ట్ ఈస్ట్ పాలిసి’ లో భాగం గా రష్యా కు ఒక విశ్వసనీయ భాగస్వామి గా ఉంటుందని పునరుద్ఘాటించారు. రష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతం అభివృద్ధి విషయం లో రష్యా కు, భారతదేశాని కి సహజమైన అనుబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు.
‘ప్రత్యేకమైనటువంటి, విశేష అధికారాలు కలిగినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యాని’ కి అనుగుణం గా ఇరు పక్షాల మధ్య మరింత ఎక్కువ ఆర్థికపరమైనటువంటి, వాణిజ్యపరమైనటువంటి సహకారానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. మహమ్మారి కాలం లో ఆరోగ్య సంబంధి, ఔషధ నిర్మాణ సంబంధి రంగాలు సహకారానికి ప్రముఖమైన రంగాలు గా పేరు తెచ్చుకొన్నాయి అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. అలాగే, ఆర్థిక సహకారం పరం గా అవకాశాలు ఉన్న ఇతర రంగాల లో వజ్రాలు, కోకింగ్ కోల్, ఉక్కు, కలప వంటి రంగాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
భారతదేశం లోని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇఇఎఫ్-2019 ను సందర్శించడాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, రష్యా లో 11 దూర ప్రాచ్య ప్రాంతాల గవర్నర్ లు భారతదేశం సందర్శనకు తరలి రావాలంటూ ఆహ్వానించారు.
కోవిడ్ మహమ్మారి సవాళ్ళ ను విసురుతూ ఉన్నప్పటికీ, పెట్రోలియం- సహజవాయువు శాఖ మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురి నాయకత్వం లో భారతదేశాని కి చెందిన ఒక ప్రతినిధి వర్గం ఇండియా-రష్యా బిజినెస్ డైలాగ్ కు హాజరు అవుతోంది.
దీనిలో ప్రముఖ చమురు కంపెనీ లు, గ్యాస్ కంపెనీ ల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇఇఎఫ్ సందర్భం లో సఖా-యాకూతియా ప్రావిన్స్ గవర్నర్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లు ఈ నెల 2న ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. వివిధ రంగాల కు చెందిన ప్రముఖ భారతీయ కంపెనీల ప్రతినిధు లు 50 మంది కి పైగా కూడాను ఆన్ లైన్ మాధ్యమం ద్వారా పాలుపంచుకోనున్నారు.
***
(Release ID: 1751756)
Visitor Counter : 276
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada