హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా భార‌త్‌లో చిక్కుకున్న విదేశీ పౌరుల భార‌తీయ వీసా లేదా నిర్ణీత కాల నివాస కాల‌ప‌రిమితి 20.09.2021 వ‌ర‌కు చెల్లుబాటు అవుతుంది

Posted On: 02 SEP 2021 7:17PM by PIB Hyderabad

కోవిడ్ 19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ఏర్ప‌డిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల వీసాల‌పై మార్చి 2020కి ముందు భార‌త్‌కు వ‌చ్చి, తిరిగి త‌మ గ‌మ్యాల‌కు వెళ్ళేందుకు విమానాలు లేక‌పోవ‌డంతో అనేక‌మంది విదేశీ పౌరులు ఇక్క‌డే చిక్కుకుపోయారు. అటువంటి విదేశీ పౌరులు భార‌త్‌లో ఉండేందుకు త‌మ కాల‌ప‌రిమితి అధిగ‌మించి ఉన్నందుకు వారిపై ఎటువంటి జ‌రిమానా వేయకుండా సౌహార్ద్ర‌త‌తో వారి రెగ్యుల‌ర్ వీసా లేదా ఇ- వీసా లేదా వారు ఉండే నిర్దిష్ట‌కాలానికి పొడిగింపును ఇచ్చి అటువంటి విదేశీ పౌరులు భార‌త్ లో నివ‌సించే సౌల‌భ్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది.  ఆగ‌స్టు 31, 2021 వ‌ర‌కు అందుబాటులో ఉన్న సౌక‌ర్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పుడు సెప్టెంబ‌ర్ 30, 2021కి పొడిగించింది. అటువంటి విదేశీ పౌరులుఎవ‌రూ సెప్టెంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు వీసాపొడిగింపు కోసం ఎఫ్ఆర్ ఆర్ ఒ ఎఫ్ ఆర్ ఒకు ఎటువంటి ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించ‌న‌వ‌స‌రం లేదు. వారు దేశాన్ని వ‌దిలివెళ్ళే ముందు, ఇ-ఎఫ్ఆర్ ఆర్ ఒ పోర్ట‌ల్‌లో ఎగ్జిట్ అనుమ‌తి కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేఉకోవ‌చ్చు. సంబంధిత ఎఫ్ఆర్ ఆర్ ఒ ఎఫ్ ఆర్ ఒ కాల‌ప‌రిమితిని అధిగ‌మించి ఉన్నందుకు గ్రాటిస్ ఆధారంగా ఎటువంటి జ‌రిమానాను విధించ‌కుండా మంజూరు చేస్తుంది.
కాగా, సెప్టెంబ‌ర్ 30, 2021 త‌ర్వాత కూడా వీసాను పొడిగించుకోవాల‌నుకునే విదేశీ పౌరులు త‌గిన రుసుమును చెల్లించి ఇ-ఎఫ్ ఆర్ ఆర్ ఒ ప్లాట్‌ఫాంకు ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంది.. దీనిని సంబంధింత ఎఫ్ఆర్ ఆర్ ఒ ఎఫ్ ఆర్ ఒ ప్ర‌స్తుత మార్గద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా అర్హ‌త క‌లిగి ఉంటే దానిని ప‌రిగ‌ణిస్తుంది. 
అయితే, ఇప్ప‌టికే భార‌త్‌లో ఉన్న ఆఫ్ఘ‌న్ జాతీయులు, ఏర‌కం వీసాపై ఇక్క‌డ ఉన్న‌ప్ప‌టికీ, ఆఫ్ఘ‌న్ జాతీయుల‌కు వేరుగా జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల కింద వారికి వీసా పొడిగింపును మంజూరు చేస్తారు.

 

*****


 



(Release ID: 1751630) Visitor Counter : 178