ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీల భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాద గారి 125వ జ‌యంతి సంద‌ర్భం లో సెప్టెంబ‌ర్ 1న ఒక ప్ర‌త్యేక స్మార‌క నాణేన్ని విడుద‌ల చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 31 AUG 2021 2:53PM by PIB Hyderabad

శ్రీల భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాద గారి 125వ జ‌యంతి సంద‌ర్భం లో 125 రూపాయ‌ల విలువైన ఒక ప్ర‌త్యేక స్మార‌క నాణేన్ని  2021 సెప్టెంబ‌ర్ 1 న సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా  విడుదల చేయ‌డ‌మే కాకుండా స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

శ్రీల భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాద గారి గురించి..

స్వామీ జీ అంత‌ర్జాతీయ కృష్ణ చైత‌న్య స‌మాజం (ఐఎస్‌కెసిఒఎన్.. ‘ఇస్కాన్‌’) ను స్థాపించారు.  ఇది ‘‘హ‌రే కృష్ణ ఉద్య‌మం’’ గా ప్ర‌సిద్ధి లోకి వ‌చ్చింది.  శ్రీమ‌ద్ భ‌గ‌వ‌ద్ గీత ను, వైదిక సాహిత్యాన్ని 89 భాష‌ల లోకి అనువాదం చేయ‌డం తో పాటు వైదిక సాహిత్యం ప్ర‌పంచ వ్యాప్తం గా ప్రసారం కావ‌డం లో కూడా ఇస్కాన్ ఒక ప్ర‌ముఖ పాత్ర ను పోషిస్తోంది.  

స్వామీ జీ వంద‌ కు పైగా దేవాల‌యాల ను కూడా ప్ర‌తిష్టించారు.  ప్ర‌పంచానికి భ‌క్తి యోగ మార్గాన్ని గురించి ప్ర‌బోధిస్తూ అనేక గ్రంథాల ను కూడా ఆయ‌న రాశారు.

ఈ సంద‌ర్భం లో సంస్కృతి శాఖ కేంద్ర మంత్రి కూడా పాలుపంచుకోనున్నారు.

 



(Release ID: 1750748) Visitor Counter : 172