ప్రధాన మంత్రి కార్యాలయం
అసమ్ లోని కొన్నిప్రాంతాల లో వరద స్థితి పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
31 AUG 2021 10:42AM by PIB Hyderabad
అసమ్ రాష్ట్రం లో కొన్ని ప్రాంతాల లో వరద స్థితి ని గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. వరద తీవ్రత ను తగ్గించడం కోసం కేంద్రం పక్షాన చేతనైన అన్ని విధాలు గాను మద్దతు ను ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.
‘‘అసమ్ ముఖ్యమంత్రి శ్రీ @himantabiswa తో మాట్లాడాను; రాష్ట్రం లో కొన్ని ప్రాంతాల లో తలెత్తిన వరద స్థితి ని గురించి సమగ్రం గా సమీక్షించడమైంది. వరద స్థితి ప్రభావాన్ని తగ్గించడం కోసం కేంద్రం వైపు నుంచి సాధ్యమైన అన్ని రకాలు గాను సాయపడడం జరుగుతుందని హామీ ని ఇవ్వడమైంది. ప్రభావిత ప్రాంతాల లో నివసిస్తున్న వారందరు సురక్షితం గా, క్షేమం గా ఉండాలి అనినేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1750740)
आगंतुक पटल : 248
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam