సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ముగిసిన సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ ఐకానిక్ వారోత్సవాలు

Posted On: 30 AUG 2021 5:18PM by PIB Hyderabad

ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించిన  ఐకానిక్ వారోత్సవాలు నిన్న ముగిసాయి. ఆగస్ట్ 23వ తేదీన ప్రారంభమైన ఈ వారోత్సవాల్లో మంత్రిత్వ శాఖకి చెందిన అన్ని మీడియా యూనిట్లు పాల్గొన్నాయి. వారోత్సవాల్లో భాగంగా " రాజ్యాంగ నిర్మాణం"పై ఏర్పాటు చేసిన ఈ-ఫోటో ప్రదర్శన, "చిత్రాంజాలి@75" పేరిట వర్చువల్ విధానంలో నిర్వహించిన పోస్టర్ల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకున్నాయి.  పాటు కేంద్ర మంత్రులు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్శ్రీ జి. కిషన్ రెడ్డిశ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్డా. ఎల్. మురుగన్ శ్రీమతి మీనాక్షి లేఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐకానిక్ వారోత్సవాల్లో దూరదర్శన్ నెట్‌వర్క్  "నేతాజీ", "రాచరిక రాష్ట్రాల విలీనం" వంటి డాక్యుమెంటరీలను ప్రదర్శించింది. "ఐలాండ్ సిటీ", "క్రాసింగ్ బ్రిడ్జెస్ " మొదలైన చిత్రాలను జాతీయ చలన చిత్ర పరిశ్రమ సంస్థ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ www.cinemasofindia  లో నిర్వహించిన చిత్రోత్సవంలో ప్రదర్శించింది. 

దూరదర్శన్ఆకాశవాణి ప్రాంతీయ వార్తా యూనిట్లు తమ రోజువారీ వార్తలు మరియు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా స్వాతంత్ర్య సమరయోధులుచారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, సంఘటనలను ప్రత్యేకంగా ప్రసారం చేశాయి. అనేక కమ్యూనిటీ రేడియో స్టేషన్లు కూడా ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. ఈ కార్యక్రమాలలో  స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు,  స్వాతంత్య్ర పోరాటంలో వారు చూపించిన అసాధారణమైన తెగువ పరాక్రమంఅంకితభావంగుర్తింపుకు నోచుకోని వీరులకు సంబంధించిన అనేక అంశాలను ప్రముఖంగా ప్రసారం చేశారు. 

బ్యూరో ఆఫ్ అవుట్‌రీచ్,కమ్యూనికేషన్ నిర్వహిస్తున్న   రీజనల్ అవుట్ రీచ్  బ్యూరోలు దేశవ్యాప్తంగా   వివిధ కార్యక్రమాలను నిర్వహించాయి. సాంగ్ మరియు డ్రామా డివిజన్  1000 కి పైగా పిఆర్‌టిల ద్వారా వీధి నాటకాలు, తోలు బొమ్మలాటలు మ్యాజిక్ షోలు,  జానపద కార్యక్రమాలను నిర్వహించింది.  రాష్ట్రాలలో నెహ్రూ యువ కేంద్రం మరియు ఎన్ఎస్ఎస్  యూనిట్ల సహకారంతో  స్వాతంత్ర్య నడకలు నిర్వహించబడ్డాయి. బెంగళూరులో స్వాతంత్ర్య సమరయోధులపై  ఆర్‌ఓబి నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను ఐ అండ్ బి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ప్రారంభించారు. బికనీర్‌లో కేంద్ర సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్  రాజస్థాన్ రీజనల్ అవుట్ రీచ్  బ్యూరో నిర్వహించిన ప్రదర్శనను ప్రారంభించారు.

 

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రాంతీయ యూనిట్లు దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై వెబ్‌నార్‌లను నిర్వహించాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఆయా రాష్ట్రాల నుంచి పాల్గొన్న యోధులను గుర్తు చేసే విధంగా  ఈ అంశాలను ఎంపిక చేయడం జరిగింది.  స్వాతంత్య్ర ఉద్యమంలో ముంబై పాత్ర అనే అంశంపై  ముంబై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్‌నార్‌ని ఉద్దేశించి  స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న  రోహిణి గవాంకర్ ప్రసంగించారు. భువనేశ్వర్ ప్రాంతీయ యూనిట్  వెబినార్ ను నిర్వహించింది. 

ఐకానిక్ వారోత్సవాల్లో యువత కు వివిధ క్విజ్‌లు, చర్చా కార్యక్రమాలు, పోటీలను నిర్వహించడం జరిగింది. 

 జన్ -భగీదరి (ప్రజల భాగస్వామ్యం) అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ  ఐకానిక్ వారోత్సవాలను నిర్వహించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం  ప్రభుత్వ కార్యక్రమంగా  కాకుండా ప్రజా ఉద్యమంగా జరగాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

***



(Release ID: 1750540) Visitor Counter : 222